ITDA Meeting
-
అరకు కాఫీ.. అంతర్జాతీయ ఖ్యాతి!
‘ఓ కప్పు అరకు కాఫీ తాగుదాం డియర్.. ఇండియా నుంచి వచ్చి మన మనసు దోచుకుందంటే నమ్ము.. అరకు కాఫీ లేకుండా రోజు గడవడం లేదోయ్..’ అంటున్నారు ప్రస్తుతం విదేశీయులు. సహజ సిద్ధంగా కుళ్లిన ఆకులు వేసి పెంచిన ఆర్గానిక్ అరకు కాఫీ విదేశాల్లోనూ దూసుకెళ్తోంది. విశాఖ మన్యంలో సాగవుతున్న అరబికా రకం కాఫీ పారిస్‌లో ఇప్పటికే పాగా వేసింది. జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ విక్రయాలు పెరిగి అక్కడి కాఫీ ప్రియులకూ మన కాఫీ నోరూరిస్తూ సత్తా చాటుతోంది. – సాక్షి, విశాఖపట్నం 2017లోనే పారిస్‌లో పాగా ఫ్యాషన్ ప్రపంచ రాజధాని పారిస్‌లోనూ అరకు కాఫీ బ్రాండ్‌తో 2017, ఫిబ్రవరిలోనే కాఫీ షాప్ వెలిసింది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ దీన్ని అక్కడ ఏర్పాటు చేసింది. కాఫీ సాగు విస్తరణలో మనదేశంలో తమిళనాడును వెనక్కినెట్టి కర్ణాటక తర్వాత రెండో స్థానం కోసం కేరళతో పోటీపడుతోంది. విశాఖ మన్యంలో పండించిన కాఫీ గింజలను గిరిజన రైతుల నుంచి వివిధ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇందులో ప్రధానమైంది. నాంది ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 20 వేల ఎకరాల్లో కాఫీ గింజలను పదేళ్లుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. విస్తరణే లక్ష్యంగా ప్రణాళిక కాఫీ తోటలు విస్తరించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ప్రణాళిక అమలు చేస్తోంది. గత నాలుగేళ్లలో మొత్తం 42 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. వీటిని 2025–26 నాటికి మరో 58 వేల ఎకరాలకు విస్తరించాలనేది లక్ష్యం. ఇందుకోసం చింతపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. మూడేళ్లపాటు సిల్వర్ ఓక్ చెట్లు పెరిగిన తర్వాత వాటి మధ్య అంతర పంటగా కాఫీ మొక్కలు, మిరియాల పాదులు నాటుకోవడానికి ఐటీడీఏ సహకరిస్తోంది. దేశంలో మూడో స్థానం 2025–26 నాటికి మన్యంలో 2 లక్షల విస్తీర్ణంలో కాఫీ తోటలు విస్తరిస్తే దేశంలోనే 20 వేల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో కర్ణాటక తర్వాత ద్వితీయ స్థానానికి ఏపీ చేరుకుంటుంది. ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతో తమిళనాడును వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరింది. ఒక మొక్క నుంచి క్లీన్ కాఫీ గింజలు ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఒక మెట్రిక్ టన్ను కాఫీ గింజల ధర ప్రస్తుతం రూ.1.50 లక్షల వరకు ఉంది. విదేశీ ఎగుమతులే కీలకం భారతదేశంలో పండుతున్న కాఫీలో 80 శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో కాఫీ సాగు చేస్తున్నా ఎగుమతుల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. కర్ణాటకలో కార్పొరేట్ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఎకరానికి 225 కిలోలు దిగుబడి వస్తుండగా, విశాఖ మన్యంలో 100 నుంచి 120 కిలోల వరకు వస్తోంది. కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారని, దీంతో మరో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించే అవకాశం ఉందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు రాధాకృష్ణ తెలిపారు. -
అధికారుల తీరు బాగోలేదు!
శ్రీకాకుళం, సీతంపేట: సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో (ఐటీడీఏ) పీవో తప్ప అధికారులెవ్వరూ సక్రమంగా పనిచేయడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో వివిధ శాఖలపై గురువారం సమీక్ష నిర్వహించారు. పలుశాఖల ప్రగతిపై క్షుణ్ణంగా సమీక్షించారు. అయితే సంబంధిత శాఖల అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వారి పనితీరు బాగోలేదంటూ ఆగ్రహం చెందారు. ప్రాజెక్టుఅధికారి శివశంకర్ బాగా పనిచేస్తున్నారని, అధికారులంతా ఆయనకు సహకరించాలన్నారు. నిధులు భారీగా ఖర్చుచేస్తుంటే అధికారులు పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఐటీడీఏ పరిధిలో ఎంతమంది పీవీటీజీ, నాన్పీవీటీజీ గిరిజనులున్నారు, గిరిజన విద్యకు సంబంధించి అంబేడ్కర్ ఓవర్సీస్, విద్యానిధి, బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలు ప్రశ్నించినప్పుడు డీడీ మురళీకృష్ణమూర్తి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. దీంతోఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్.. మరోసారి తాను పర్యటనకు వచ్చేసరికి తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన విద్యార్థుల్లో డ్రాపౌట్లు ఉండకూడదన్నారు. డిజిటిల్ తరగతులు జరుగుతున్నాయా అని డిప్యూటీ ఈవో రామ్మోహన్‌రావును ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో వివిధ పథకాలు గిరిజనులు తెలుసుకోవడానికి ఒక ఏటీడబ్ల్యూవోను జిల్లా కేంద్రంలో నియమించాలన్నారు. ట్రైకార్ రుణాలకు సంబంధించి మండలానికి ఒకటి, రెండు యూనిట్లు మంజూరు చేస్తే గిరిజనాభివృద్ధి ఎలా జరుగుతుందన్నారు. చేపల చెరువులకు సంబంధించి 300 చెరువులుంటే 3 సొసైటీలు ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. ఎస్టీ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించగా మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు సమాధానం చెప్పలేకపోయారు. గిరిజన సహకార సంస్థ వారికి ఆదాయం వచ్చిన ఉత్పత్తులు కొనుగోలు చేయడం తప్ప, గిరిజనులకు ఉపయోగమైన వస్తువులు కొనడం లేదన్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.45 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారని ఈఈ అశోక్‌ను ప్రశ్నించారు. పశువుల పోషణకు సంబంధించి ఏవిధమైన సబ్సిడీ ఇస్తున్నారో చెప్పాలన్నారు. వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ను గిరిజనులు వాడితే బిల్లులు చెల్లించక్కర్లేదని, ఎవరైనా బిల్లులు కట్టమని అడిగితే కేసులు పెట్టాలని, పీవోకు ఫిర్యాదు చేయాలన్నారు. గ్యాంగ్‌రేప్, మర్డర్కేసుల బాధితులకు పరిహారమివ్వాలి.. గ్యాంగ్‌రేప్, మర్డర్కేసులకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని శివాజీ ఆదేశించారు. రూ.5 వేలు పింఛన్, డీఏ, ప్రభుత్వ ఉద్యోగం, గృహనిర్మాణ స్థలం ఇవ్వాలన్నారు. గ్యాంగరేప్, మర్డర్ కేసులకు సంబంధించి పరిహారంగా రూ. 8.25 లక్షలు ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు ఎన్నికేసులు పెండింగ్‌లో ఉన్నాయనేది పరిశీలించాలని డీఎస్పీ స్వరూపరాణికి సూచించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు సుబ్బారావు, రవీంద్ర, సుధారాణి, నరహరి వరప్రసాద్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్, ఆర్డీవో గున్నయ్య, తహసీల్దార్ పి.అమల, ఎంపీడీవో చంద్రకుమారి, ఐడబ్ల్యూఎంపీ ఏపీడీ డోల లక్ష్మి, ఈఈ అశోక్, ఖాధీర్, పీఏవో భవానీ శంకర్, జీసీసీ డీఎం మధు, పీహెచ్‌వో సత్యనారాయణరెడ్డి, కొత్తూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కె.రాము పాల్గొన్నారు. -
ఎన్నాళ్లో వేచిన సమయం!
సీతంపేట శ్రీకాకుళం : సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలపై తరువాత కాలంలో అధికారులు ఎవరూ దృష్టిసారించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు చాలా సమస్యలతో ఇప్పటికీ సతమతమవుతున్నారు. నీటి కోసం అగచాట్లు ఐటీడీఏ పరిధిలో తాగునీటి సౌకర్యం లేని గ్రామాలు వంద వరకూ ఉన్నాయి. రక్షిత పథకాల నిర్మాణానికి నిధులు మంజూరైనా పూర్తిస్థాయిలో పనులు జరగని పరిస్థితి. దీంతో నీటి కోసం గిరిపుత్రులు గెడ్డలపై ఆధార పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. అందని వైద్యం.. గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు కూడా సక్రమంగా అందడం లేదు. అత్యవసర సమయాల్లో కూడా 108 వాహన సేవలు మృగ్యమౌతున్నాయి. ఫీడర్ అంబులెన్స్‌లు ఉన్నా కొండపై గ్రామాలకు వెళ్లలేకపోతుండడంతో సకాలంలో గిరిజనులకు వైద్యసేవలు అందడం లేదు. మరెన్నో సమస్యలు... రహదారులు లేని గ్రామాలు ఇప్పటికీ ఏజెన్సీలో చాలా ఉన్నాయి. గిరిజనలకు రహదారి, తాగునీటి సౌకర్యాల కల్పన పూర్తి స్థాయిలో కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అర్హులైన గిరిజనులకు సైతం గృహనిర్మాణ శాఖ ద్వారా నూతన ఇళ్లు మంజూరు లేదు. గతంలో నిర్మించిన ఇళ్లకు చాలా వరకు బిల్లులు ఇవ్వలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. నిధులు మంజూరైన నిర్మించలేకపోయారు! గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా ఐటీడీఏ టీపీఎంయూ విభాగం పరిధిలో ఏడు మండలాలకు 124 రహదారులు ఏడాది కిందట మంజూరయ్యాయి. అలాగే మరో 88 రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు మంజూయ్యాయి. అయితే ఇప్పటి వరకు పనులు మాత్రం పూర్తి చేయలేదు. జూలై నెలాఖరకు కొన్ని, ఆగస్టు 31వ తేదీ నాటికి మరి కొన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లేదంటే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అయినా ఫలితం లేదు. కనీసం 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. అలాగే చిన్ననీటి వనరుల ద్వారా చెక్‌డ్యాం పనులు కూడా పూర్తికాలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు జరిగినా అవి నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కొద్ది రోజుల కిందట టిటుకుపాయిగూడ, భామిని మండలం వడ్డంగి తదితర ప్రాంతాల్లో పాలకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పర్యటించి చెక్‌డ్యాంలను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని విషయాన్ని గుర్తించారు. నాసిరకం పనులపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేసినా ఫలితం లేదు. ఉపాధిహామీ పథకం పనులు చేసిన వారికి కూడా వేతనాలు చెల్లించలేదు. ఐటీడీఏ పరిధిలో ఉపాధి వేతన బకాయిలు సమారు రూ.10 కోట్లు ఉన్నాయి. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేతనదారులు కోరుతున్నారు. గిట్టుబాటు ధరలు నిల్ గిరిజనులు పండిస్తోన్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. గిరిజన సహకార సంస్థ ఉన్నా.. అన్నిరకాల వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి. కొండచీపుర్లు, చింతపండు వంటి వస్తువులను మాత్రమే జీసీసీ కొనుగోలు చేస్తున్నా..వారికి కూడా సరైన మద్దతు ధరలు కల్పించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కందులు, పసుపు, అల్లం, జీడి వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నామని గిరిపుత్రులు చెబుతున్నారు. వెంటాడుతున్న ఏనుగుల సమస్య ఏనుగుల సమస్య గిరిజనులను దశాబ్ద కా లంగా వెంటాడుతోంది. సుమారు 12 ఏనుగులు ఐటీడీఏ పరిధిలోని మండలాల్లోనే సంచరిస్తూ.. గిరిజనులకు చెందిన పంటలను, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. చాలామందిని పొట్టనపెట్టుకున్నాయి. అయినా ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధితులకు నష్ట పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిలో శనివారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగనుంది. అయితే గిరిజనుల సమస్యలపై సభ్యులు ఎలా స్పందిస్తారో.. ఏం మాట్లాడుతారో చూడాలి. -
ఆరోగ్యమే ప్రగతికి ప్రతిరూపం
సమిష్టిగా పరీక్షలు చేస్తే మంచి ఫలితాలు.. ఏటూరునాగారంలో నేత్రాలయం ఏర్పాటు వైద్య, ఆరోగ్య సిబ్బంది సమీక్షలో కలెక్టర్ కరుణ ఏటూరునాగారం : ప్రతీ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ప్రగతి సాధించినట్లు భావించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ఏజెన్సీలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 160 గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ వైద్యాధికారులు, సిబ్బందితో పాటు 104 విభాగం సంయుక్త చేపట్టిన ప్రత్యేక క్యాంపులపై గురువారం ఐటీడీఏ సమావేశపు మందిరంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 22 నుంచి ఆగస్టు 4 వరకు చేపట్టిన వైద్య శిబిరాల వివరాలను ఆమె ఆరా తీయగా.. ఏజెన్సీలో 19,826 కుటుంబాలు, 92,235 మంది ప్రజల వివరాలు సేకరించామని, 16,454 మంది రోగులను పరీక్షించినట్లు డీఎంహెచ్ఓ బోదబోయిన సాంబశివరావు వివరించారు. ఈ మేరకు పరీక్షలు పూర్తయిన వారికి కుటుంబ ఆరోగ్య సంరక్షణ కార్డులను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంకా 160 గ్రామాల్లో 73 గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వివరించారు. అయితే, మిగతా 87 గ్రామాలను పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్.. కలిసికట్టుగా పనిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఉద్యోగులు ఇలా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. 40 శాతం పోషకాహార లోపంతోనే... ఇప్పటి వరకు తిరిగి పరీక్షించిన గ్రామాల్లో 40 శాతం మంది చిన్నారులు పోషకాహారలోపంతో ఉన్నట్లు వైద్యాధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ముఖ్యంగా గొత్తికోయగూడెంల్లోని చిన్నారులు సరైన పోషకాహారం అందడం లేదని హెల్త్ సూపర్వైజర్ కోటి శకుంతల వివరించారు. ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో బరువు చూసే యంత్రాలు, పోషక విలువలు, లోపం వల్ల వచ్చే రోగాలను తెలిపే చార్ట్స్ లేవని ఆర్బీఎస్కే జిల్లా అధికారిణి శ్యామల నీరజ వెల్లడించారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ కరుణ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు సరైన పోషకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు 68 మందికి రక్తహీనత ఉందని వైద్యులు కలెక్టర్‌కు వివరించగా.. ఇందుకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని డిప్యూటీ డీహెచ్ఎం అప్పయ్య చెప్పారు. కాగా, పీహెచ్‌సీలకు డిజిటల్ తెరలు కేటాయించాలని మాస్ మీడియా జిల్లా అధికారి అశోక్‌రెడ్డి ఏటీడీఏ పీఓను కోరారు. కంటిపరీక్షలు, శస్త్రచికిత్సలు ఏజెన్సీలో కంటిచూపుతో బాధపడుతున్న వారికి వెంటనే పరీక్షలు, అద్దాలు, శస్త్రచికిత్స కోసం ఏటూరునాగారం మండల కేంద్రంలో నేత్రాలయం నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ కరుణ వెల్లడించారు. అలాగే గుట్కాలు, అంబర్తో టీబీ తదితర వ్యాధులు వస్తున్నాయని వైద్యాధికారులు కలెక్టర్‌కు విన్నవించగా.. పోలీసులతో గుట్కాల విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. దోమల నివారణ మందును ఇప్పటి వరకు 50 గ్రామాల్లో పిచికారి చేయించామని, 120 హాస్టళ్లలో పిచికారి చేయించేందుకు చర్యలు చేపట్టామని మలేరియా జిల్లా అధికారి పైడి రాజు కలెక్టర్‌కు విన్నవించారు. కాగా, హాస్టళ్లలోని ఎనిమిది వేల మంది గిరిజన పిల్లలకు కావాల్సిన వైద్య సదుపాయాలను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. 104 సిబ్బందికి వేతనాలు మంజూరు నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదని 104 సిబ్బంది కలెక్టర్ కరుణ దృష్టికి తీసుకువెళ్లగా.. వెంటనే ఫైల్‌ను పరిశీలించి నిధులు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. సమీక్షలో ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఏపీఓ వసంతరావు, అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, జిల్లా లెప్రసీ ఆఫీసర్ మధుసూదన్, డీఐఓ హరీష్‌రాజ్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ రవిప్రవీణ్‌రెడ్డి, ఎన్ఆర్హెచ్ఎం మేనేజర్ రాజిరెడ్డి, జిల్లా గణాంకాల అధికారి కాంతరావు, రమేష్ గాడ్కే పాల్గొన్నారు. ఏజెన్సీలో కలెక్టర్ బస మండల కేంద్రంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ గురువారం రాత్రి బస చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆమె గెస్ట్హúస్కు వెళ్లారు. మండలంలో జరుగుతున్న హరితహారం, గిరిజన విద్య, ఇతర శాఖలపై శుక్రవారం కలెక్టర్ సమీక్షిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక వైద్యశిబిరాలు, హరితహారం కింద నాటిన మొక్కలను ఆమె పరిశీలించనున్నారు. ఈ మేరకు పలు శాఖల జిల్లా అధికారులు సైతం ఏటూరునాగారంలో ఉండిపోయారు. -
మమ అనిపించారు
ఉట్నూర్ : కొమురంభీమ్ ప్రాంగణంలో కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశం ఆసాంతం సాదాసీదాగా సాగింది. అప్పుడప్పుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప.. సమస్యలపై వాడీవేడి చర్చ ఎక్కడా కనిపించలేదు. సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గేడం నగేష్, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాపూరావ్, నడిపెల్లి దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, చిన్నయ్య, కోనేరు కోనప్ప, డీసీసీబీ చైర్మన్ దామోదర్, ఐటీడీఏ పీవో శ్రీనివాస్, జిల్లా ఉన్నతస్థారుు అధికారులు హాజరయ్యూరు. జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర సభ్యులంతా అధికార పార్టీకి చెందిన వారేకావడంతో గిరిజన సంక్షేమంపై గట్టిగా ప్రశ్నించేందుకు బలమైన ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేకుండాపోరుుంది. దీంతో సమావేశం చప్పగా సాగింది. మొదట్లో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాగా.. సమావేశం ప్రారంభమయ్యూక ఖానాపూర్, ఆసిఫాబాద్, ముథోల్, చెన్నూర్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చారు. ఒక్కరిద్దరు సభ్యులు ప్రశ్నలు లెవనెత్తినా.. అవి వారి పరిధి మండలాలకే పరిమితమయ్యూరుు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు వారి పరిధిలోని అధికారుల తీరును వివరించడంతో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై మండిపడ్డారు. సభ్యుల్లో కొట్టొచ్చిన అవగాహన లేమి.. ఐటీడీఏ పాలక వర్గం సమావేశంపై కొత్తగా ఎన్నికైన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలో అవగాహన లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. కొత్తగా ఎన్నిక కావడం.. పాలకవర్గం సమావేశానికి మొదటిసారిగా హాజరుకావడంతో.. జిల్లా పరిషత్ పనులా.. ఐటీడీఏ పనులా తెలియక సతమత మయ్యూరు. ఇంజినీరింగ్ విభాగం సమీక్షలో పలువురు సభ్యులు తమ పరిధిలోని పాఠశాలలు, ఇతర పనులపై సమస్యలు లేవనెత్తారు. దీంతో అధికారులు అవి తమ పరిధిలోకి రావంటూ సమాధానాలు ఇచ్చారు. అదీకాక వివిధ విభాగాల సమీక్ష సమయంలో కూడా సభ్యులు జిల్లా పరిషత్, ఆర్వీఎం, ఇతర విభాగాలకు సంబంధించిన పనులపై ఐటీడీఏ అధికారులను నిలదీశారు. దీంతో అదీ తమ పరిధి కాదంటూ సమాధానం ఇయ్యడంతో విస్తుపోయూరు. దీంతో ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. సభ్యుల్లో అవగాహన లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు అన్ని శాఖలకు చెందిన పనుల పూర్తి వివరాలు, అవి ఎవరి పరిధిలోకి వస్తాయో వివరిస్తూ నివేదికలు తయారు చేసి సభ్యులకు అందించాలన్నారు. ఎవరికి వారివే సమస్యలు.. జెడ్పీటీసీలు, ఎంపీపీలు వైద్య శాఖపై మండి పడ్డారు. ఆసిఫాబాద్ జెడ్పీటీసీ హేమాజీ తన మండలంలో గత సీజన్లో ఐదు వేల వరకు మ లేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 15 మంది చనిపోయూరని వైద్యాధికారులు కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యూరని మండి పడ్డారు. పీహెచ్‌సీకి అంబులెన్సు లేక అత్యవసర వైద్యం కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఉట్నూర్ సీహెచ్‌సీలో వైద్యులు ఎల్లవేళ్లలా అందుబాటులో లేక.. గిరిజనులకు సరైన వైద్యం అందడం లేదని, మండలంలో ఉ న్న శ్యాంపూర్, హస్నాపూర్, దంతన్‌పల్లి పీహెచ్‌సీల్లో వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియకుండా ఉందన్నారు. మంచిర్యా ల ఏరియూ ఆస్పత్రికి అంబులెన్స్ లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దివాకర్‌రా వు తెలిపారు. దీంతో మంత్రి ఐకే రెడ్డి స్పంది స్తూ.. ఎవరైనా దాతలను చూసి అంబులెన్స్ ఏ ర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. నర్సాపూర్ పీహెచ్సీ భవన ం నిర్మాణం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా ఇంత వరకు పూర్తికావడం లేదని సభ్యుడు ప్రస్తావించాడు. బజార్హత్నుర్ పీహెచ్సీలో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరని జెడ్పీటీసీ నారాయణ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దహెగాం మండలంలో వైద్యులు సమయానికి రావడం లేదని జెడ్పీటీసీ సుజాత పేర్కొన్నారు. దీంతో మంత్రులు జిల్లా వైద్యాధికారి రుక్మిణమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు జిల్లాలకు వెళ్లిన వారిని రప్పించాలని ఆదేశించారు. దీంతో వైద్యాధికారి స్పందిస్తూ.. అది తన పరిధిలోనిది కాదని, వైద్యవిధాన పరిషత్ తీసుకున్న నిర్ణయమని వివరించారు. డీసీహెచ్ చంద్రమౌళి విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని, పలుమార్లు హెచ్చరించినా తన పనితీరు మార్చుకోవడం లేదని, ఆయన్ను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయూలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆశ్రమాల్లో విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నా.. చింతాపూర్లో రెండు నెలలుగా దొడ్డు బియ్యం వండిపెడుతున్నారని ఎమ్మెల్యే చిన్నయ్య డీటీడబ్ల్యూ సావిత్రిపై మండిపడ్డారు. కృష్ణపల్లిలో రెండు నెలలుగా కోడిగుడ్లు పెట్టడం లేదన్నారు. ఆశ్రమాల్లో ఒక్కసారే వారానికి సరిపడా కాంట్రాక్టర్లు కూరగాయలు సరఫరా చేస్తుండడంతో గోదాముల్లో మురిగిపోతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. ఉట్నూర్ బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ సమయంలో వెల్లడైనట్లు వివరించారు. ప్రభుత్వం కొత్త ఏర్పాటు చేయూలనుకుంటున్న ఏకలవ్య పాఠశాలను ఉట్నూర్ కేంద్రంగా ఏర్పాటు చేయూలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంచిర్యాల బాలికల మేనేజ్మెంట్ ఆశ్రమ పాఠశాలల్లో మహిళా సిబ్బందిని కాకుండా పురుషులను ఎలా నియమించారని ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రశ్నించారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు, భవన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో అందించే నాలుగు జతల బట్టలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డీడీ స్పందిస్తూ.. ఇప్పటికే 25 శాతం మంది విద్యార్థులకు రెండు జతల బట్టలు అందించాల్సి ఉందని, ఆప్కోకు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం లేదని వివరించారు. దీంతో మంత్రి రామన్న డీడీపై మండిపడ్డారు. ‘ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు. సమస్య ఇంత జఠిలంగా ఉన్నా.. మా దృష్టికి తీసుకురారా’ అంటూ నిలదీశారు. ప్రతి విద్యార్థి కొలత తీసుకుని బట్టలు కుట్టాలని, లేకుండా ఏజెన్సీలు రద్దు చేయూలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మంచినీటి పథకాల్లో 425 వివిధ కారణాలతో పనిచేయడం లేదని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్ర సేన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్ననీటి పారుదల విభాగం చేపట్టిన పనులు ఇంకా పూర్తి కావడం లేదని మంత్రి రామన్న ఈఈఎంఐ రాజేశ్వర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 644 మంది లబ్ధిదారులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని, వివిధ కారణాలతో నిలిచిపోయూయని సీసీఎఫ్ తిమ్మారెడ్డి వివరించారు. వచ్చే సమావేశంలోగా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మంత్రి రామన్న ఆదేశించారు. అటవీ శాఖ ఆమోదం లేక నిలిచిపోరుున రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపేలా కృషి చేస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్‌తో భయందోళన.. భోజన విరామం తర్వాత ప్రారంభమైన కొద్ది సేపటికే సమావేశ మందిరంలో షార్ట్ సర్క్యూట్‌తో ట్యూబ్‌లైట్లు పగిలారుు. నిమిషాల వ్యవధిలో హాలులోని లైట్లు అన్నీ పగిలిపోవడంతో మంత్రులు, సభ్యులు, అధికారులు, ఎమ్మెల్యేలు బయటకు పరుగులు తీశారు. కరెంట్ కట్ కావడంతో జనరేటర్ వేయడం వల్ల పవర్ హై ఓల్టేజీ సరఫరా అరుు ఇలా జరిగిందని సిబ్బంది చెప్పడంతో అందరూ మళ్లీ చేరుకున్నారు. సభ్యులందరి ఆమోదంతో అన్ని వసతులతో కొత్త భవనాన్ని ఏడాదిలోపు నిర్మించాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు.