
ఎలా జరిగింది..?
వలిగొండ : మండలంలోని నర్సాయిగూడెంలో గల ఎస్‌టీఎల్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జిన్నింగ్ మిల్లులో గురువారం రాత్రి సుమారు 6 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో సుమారు 4వేల క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైంది. నష్టం కోటి 60 లక్షల వరకు ఉంటుందని బయ్యర్లు అంటున్నారు. అయితే ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ షార్ట్‌సర్క్యూట్ జరగడానికి అవకాశం లేదు. ఆ సమయంలో అక్కడ కూలీలు కూడ పనిచేయడం లేదంటున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఇదే జిన్నింగ్ మిల్లులో గతనెల 17న అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఆసమయంలో పాత మిగిలిపోయిన పత్తి, బేల్‌పట్టి(ఇనుప పట్టి)లు కావడంతో కేవలం రూ.రెండు లక్షల వరకు నష్టం మాత్రమే జరిగింది.
ప్రమాదం జరిగినా వీడని నిర్లక్ష్యం..
గత నెల 17న ఇదే జిన్నింగ్‌మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో మంచినీటి వసతి లేకపోవడం, ఫైర్‌సేఫ్టీ యంత్రాలు పనిచేయక పోవడంతో ఆ చిన్న అగ్ని ప్రమాదాన్ని నిలువరించలేకపోయారు. ఆ అగ్ని ప్రమాదం అనంతరమైన ఫైర్‌సేఫ్టీపై ృష్టి పెట్టకపోవడం మిల్లు యాజమాన్యం వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం సీసీఐ కొనుగోలుదారులైన ఫైర్‌సేఫ్టీపై ృష్టి పెట్టకపోవడం విచిత్రంగా ఉంది.
అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు
అగ్నికి ఆహుతైన పత్తి సుమారు 4 వేల క్వింటాళ్ల వరకు ఉంటుందని, దీనిని సుమారు 5,6 రోజుల నుంచి కొనుగోలు చేసిందిగా కొనుగోలుదారులలో ఒకడైన కిషోర్ తెలిపారు. ఈ 5,6 రోజులలో ఇంత పెద్దమొత్తంలో పత్తి కొనుగోలు చేసి ఉంటారని, ఇన్సూరెన్స్ కోసం చేశారాని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పత్తి దగ్ధమైతుండగా అక్కడ ఉండాల్సిన సీసీఐ కొనుగోలుదారులు కార్యాలయంలో ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ సంస్థకు సంబంధించిన కాగితాలు వెతుకుతుండడం పలువురి అనుమానాలకు ఆస్కారమిచ్చినట్లవుతోంది. ఈ 5, 6 రోజులలో ఎంతమంది రైతులు పత్తి అమ్మకాలు చేశారని పరిశీలిస్తే వాస్తవాలు బయటపడే అవకాశముందని పలువురు అనుకుంటున్నారు. (సీసీఐ కొనుగోలు చేయాలంటే రైతు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బాంక్ ఖాతా జిరాక్స్‌లు సమర్పిస్తేనే కొనుగోలు చేయాలన్న నిబంధన ఉందని మార్కెట్ కార్యదర్శి మధుకర్ తెలిపారు.)