ప్రేమోన్మాది బాధిత కుటుంబాన్ని ఆదుకున్న సీఎం జగన్‌  | CM YS Jagan supported family of vijayawada love harassment Burned alive victim | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది బాధిత కుటుంబాన్ని ఆదుకున్న సీఎం జగన్‌ 

Published Thu, Nov 4 2021 5:33 AM | Last Updated on Thu, Nov 4 2021 5:33 AM

CM YS Jagan supported family of vijayawada love harassment Burned alive victim - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌తో పెద్దజమలయ్య, ఏసమ్మ దంపతులు, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం(మైలవరం): ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన వీరమల్ల పెద్ద జమలయ్య, ఏసమ్మల కుమార్తె చిన్నారిపై నాగభూషణం అనే ప్రేమోన్మాది గత ఏడాది అక్టోబర్‌లో విజయవాడ హనుమాన్‌పేటలో పెట్రోల్‌ పోసి నిప్పంటించగా అక్కడికక్కడే సజీవ దహనమైంది.

యువతి కుటుంబ పరిస్థితిని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. కాగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆ యువతి తల్లిదండ్రులను బుధవారం సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లగా.. జగన్‌ వారిద్దరికీ ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని, కుమారుడికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించగా.. రూ.10 లక్షలను అధికారులు అందజేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement