
అగ్నిగుండంలోపడి కాలిపోతున్న వెంకటసుబ్బయ్య
అవుకు: కర్నూలు జిల్లా అవుకు మండలంలో మొహర్రం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సుంకేసులలో గురువారం రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో అగ్నిగుండంలోపడి సజీవ దహనమయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దస్తగిరిస్వామి పీర్ల చావిడి వద్ద మొహర్రం వేడుకల సందర్భంగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. పెద్దసరిగెత్తు సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు వేశారు.
వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా వచ్చారు. పక్క గ్రామమైన కాశీపురానికి చెందిన చమురు వెంకటసుబ్బయ్య (48) దస్తగిరిస్వామి చావిడిలోని పీర్లను దర్శించుకున్నారు. అనంతరం మద్యం తాగి మత్తులో పక్కనే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడిపోయాడు. గమనించిన ప్రజలు రక్షించేలోపే పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. దీంతో సుంకేసుల, కాశీపురం గ్రామాల్లో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment