భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటికి నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. మృతులు మార్తాల ప్రకాశ్ (56),రాజమణి,(45),దేవరాజు(19),వంశీ (13) ఇంటి బయట తాళాలు వేసి పెట్రోలు పోసి తగలబెట్టిన దుండగులు . ఈ ప్రమాదం పై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.