అమానుషం | Set fire to the lavatory sheep thugs | Sakshi
Sakshi News home page

అమానుషం

Published Sat, Jan 24 2015 2:52 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

అమానుషం - Sakshi

అమానుషం

గొర్రెల దొడ్డికి నిప్పు పెట్టిన దుండగులు
60 జీవాలు సజీవ దహనం
{పాణాలతో కొట్టుమిట్టాడుతున్న మూడు పొట్టేళ్లు

 
ఎంత అమానుషం.. కర్కశం.. దుండగుల దాష్టీకానికి మూగ జీవాలు బుగ్గిగా మారాయి. వుంటల్లో తప్పించుకోవడానికి కూడా వీలు లేని విధంగా కంచె ఉండడంతో మాంసపు ముద్దలయ్యూరుు. ఆలస్యంగా గమనించిన యజమాని ఏమీ చేయలేని నిస్సయ స్థితిలో కన్న బిడ్డలా పెంచుకున్న జీవాలు కంటి ముందే కాలి బూడిదవుతుంటే నిశ్చేష్టులై ఉండిపోయారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు.  
 
గంగవరం:గంగవరం వుండలంలోని కొత్తపల్లె అటవీ ప్రాతంలో గురువారం రాత్రి గుర్తు తెలియుని దుండగులు గొర్రెలదొడ్డికి నిప్పు పెట్టారు. ఈసంఘటనలో 42 గొర్రె లు, 3 పొట్టేళ్లు, 15 పిల్లలు సజీవ దహనవుయ్యూరుు. సుమారు రూ.4 లక్షల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. కొత్తపల్లె గ్రామానికి చెందిన మునిరత్నం అతని భార్య ఆంజమ్మ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాతంలో యుర్రయ్యుగారిపళ్లె వంక వద్ద గొర్రెలకు దొడ్డిని నిర్మించుకున్నారు. పక్కనే గుడిసె కట్టుకుని గొర్రెలు మేపుకుంటూ దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. వీరికి గొర్రెలే జీవనాధారం. గురువారం రాత్రి వుునిరత్నం అతని భార్య ఆంజవ్ము గొర్రెలదొడ్డికి సమీపంలో వ్యవసాయు పొలం వద్ద నివాసవుుంటున్న బంధువు ఇంటికి వెళ్లారు. ఈ విషయుం గమినించిన గుర్తు తెలియుని దుండగులు గొర్రెలదొడ్డికి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో గొర్రెలు మంటల్లో చిక్కుకుని కాలి బూడిదయ్యూరుు.

వుంటల్లో తప్పించుకోవడానికి కూడా వీలు లేనివిధంగా కంచె ఉండడంతో పూర్తిగా దొడ్డిలో ఉన్న గొర్రెలు, పొట్టేళ్లు, పిల్లలు వూంసపు ముద్దలయ్యూయి. వుంటలు గమనించిన మునిరత్నం అతని భార్య ఆంజమ్మ దొడ్డి వద్దకు చేరుకుని నిస్సహాయు స్థితిలో ఉండిపోయూరు. చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు కూడా లేవు. సహాయుం చేయడానికి ఆ సమయంలో ఎవరు అందుబాటులో లేరు.  గొర్రెల దొడ్డి కాలి బూడిదరుుంది.  పక్కనున్న పూరిగుడిసె కూడా కాలిపోరుుంది. శుక్రవారం ఉదయుం విషయుం తెలుసుకున్న సర్పంచ్ గిరిరాజారెడ్డి, గ్రావుస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘోరంపై గంగవరం పోలీసులకు, రెవెన్యు అధికారులకు సవూచారం ఇచ్చారు. సీఐ రవి బాబు, ఎంఆర్‌ఐ విష్ణురామ్ తవు సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ.4లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కేసు నమోదుచేసి బాధితులకు తప్పక న్యాయుం చేస్తావుని హామీ ఇచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement