Muniratnam
-
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రామనగర జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో అత్యాచారం ఘటన జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే మునిరత్న సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోద చేసినట్ల తెలిపారు. మునిరత్నం రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే.Karnataka | A rape, sexual harassment case has been filed against Rajarajeshwari Nagar BJP MLA Munirathna. The case was registered at Kaggalipura police station in Ramanagara district. As per the complaint, the incident took place at a private resort under Kaggalipura police…— ANI (@ANI) September 19, 2024ఇప్పటికే మునిరత్న ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో ప్రస్తుతం బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్‌పై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇవాళ( గురువారం) విచారణ చేపట్టనుంది.అయితే మునిరత్న జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే.. తాజాగా కేసులో ఆయన్ను జైలు దగ్గరే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ తిరస్కరణకు గురైతే కగ్గలిపుర పోలీసులు వారెంట్ దాఖలు చేసి ప్రొసీజర్ ప్రకారం అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) కాంట్రాక్టర్‌ను బెదిరించినందుకు మునిరత్నను బెంగళూరు పోలీసులు సెప్టెంబర్ 14 రాత్రి అదుపులోకి తీసుకున్నారు.చదవండి: Actor Darshan: కారాగారంలో 100 రోజులు -
సిటీలో విస్ఫోటనం
సాక్షి, బెంగళూరు: సమయం.. ఆదివారం ఉదయం 9.45 గంటలు.. ప్రాంతం.. బెంగళూరులోని వయ్యాలికావల్ 11వ బీ క్రాస్ రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్న నివాసం వద్ద భారీ విస్ఫోటం.. ఈ సంఘటనలో ఎమ్మెల్యే అనుచరుడు వెంకటేష్ (45) అక్కడికక్కడే మరణించారు. పేలుడుకు మృతదేహం గుర్తుపట్టలేనంతగాచితికిపోయింది. నగరం నడిబొడ్డున పేలుడు జరగడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. మూడు నాలుగు వందల మీటర్ల వరకు పేలుడు శబ్ధం ప్రతిధ్వనించింది. దీంతో జనం ఏం జరిగిందోనని కలవరపాటుకు గురయ్యారు. పేలుడు సంగతి దావానలంలా వ్యాపించడంతో ఘటనాస్థలికి తరలివచ్చారు. ఎమ్మెల్యేకు ఉన్న పలు నివాస భవనాల్లో ఇది కూడా ఒకటి. పేలుడు తీవ్రతకు గోడలకు పగుళ్లు వచ్చాయి. ముమ్మరంగా పరిశోధన సంఘటన స్థలంలో బాంబు స్క్వాడ్ బృందం, జాగిలాలను వెంటనే పిలిపించి పరిశీలించారు. న గర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే పేలుడుకు కారణాలు తెలిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎవరు సంచరించకుండా గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ సిబ్బంది పేలుడు శకలాలను, మృతదేహం నమూనాలను సేకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ ముమ్మరంగా శోధించింది. సంఘటనాస్థలంలో ఫోరెన్సిక్, బాంబు నిపుణుల తనిఖీలు భారీశబ్ధం, జనం భయభ్రాంతులు పేలుడుతో ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాలైన మల్లేశ్వరం, వయ్యలికావల్, ఇతరత్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. పరిసర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అసలు పేలుడు వెనుక కారణాలు ఏంటో తెలియక తికమకపడ్డారు. వెంకటేశ్ వృత్తిరీత్యా ఒక ధోబీ– టైలర్ అని సమాచారం. ఆయనకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి వయ్యాలికావల్‌లో ఉంటున్న వెంకటేశ్‌కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కొత్త ఇల్లు కట్టే ప్రయత్నాలు ఉండేవారు. ఎమ్మెల్యే మునిరత్నకు వెంకటేష్ ఒక బాల్య స్నేహితుడు కావడం గమనార్హం. ఎమ్మెల్యే విచారం ఎమ్మెల్యే మునిరత్న మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి ఊహాగానాలను, పుకార్లను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వెంకటేష్ మరణం తననెంతో కలచి వేసిందన్నారు. వెంకటేష్, తాను కలసి చిన్నతనంలో ఆడుకునేవారమని చెప్పారు. ఏమిటీ కారణం పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటిని నిర్మాణ పనిలో వెంకటేశ్ ఉన్నాడు. ఆదివారం ఉదయం కొత్త ఇంటికి అమర్చే కిటికీలు, తలుపులు, తదితర వస్తువులను పరిశీలించేందుకు వచ్చిన వెంకటేశ్ పేలుడుకు బలయ్యారు. ఎమ్మెల్యే నివాసం ఎదురుగా సుమారు 400 చ.అ ఖాళీ స్థలం ఉంది.అందులో కొత్త కట్టడానికి సంబంధించిన సామగ్రి ఉంది. ప్లాస్టిక్ మౌల్డింగ్ కోసం వినియోగించే ఉద్ధేశంతో తీసుకొచ్చిన కొన్ని రసాయనాల వల్ల పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రసాయనాల డబ్బాలను తెరిచే ప్రయత్నంలో పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రసాయనాలను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని సరఫరా చేసిన వ్యక్తిని విచారిస్తామని చెప్పారు. లేక నిజంగా బాంబులే పేలాయా? అన్నది విచారణలో తెలుస్తుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘అనంత’ టీడీపీలో భగ్గుమన్న సెగలు
సాక్షి, అనంతపురం : అనంతపురం అర్బన్ టీడీపీలో నిరసన సెగలు భగ్గుమన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. ప్రభాకర్ చౌదరిపై ప్రజా వ్యతిరేకత ఉన్న కారణంగా ఆయనను మార్చాలని టీడీపీ నేత మునిరత్నం డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ అన్ని వర్గాలు ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకిస్తున్నాయి. ఆయనకు సీటు ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. నాకు సీటు ఇస్తామని స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన హామీని నిలబెట్టుకోవాలి. ప్రభాకర్ చౌదరికి సీటు ఇస్తే సహకరించేది లేదు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈ విషయాన్ని సుజనా చౌదరికి, యనునమలకు స్పష్టంగా చెప్పాము అని పేర్కొన్నారు. బలిజలకు అన్యాయం జరుగుతోంది.. అనంతపురం టీడీపీ అర్బన్ సీటును బలిజలకు కేటాయించాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో బలిజలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ అనంత అర్బన్ సీటును బలిజలకు ఇస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. అనంతపురంలో జేసీ మాట కూడా చెల్లుబాటు కాలేదని ఆయన వర్గీయులు వాపోయారు. గుంతకల్, అనంతపురం టిక్కెట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తే ఓటమి తప్పదని జేసీ హెచ్చరించినా వారికే టికెట్లను కేటాయించి చంద్రబాబు ఆయనకు షాక్ ఇచ్చారు. ఆయనను నమ్ముకుని టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు కూడా భంగపాటు తప్పలేదు. మరోవైపు జేసీ సూచించినట్లుగా శింగనమల అసెంబ్లీ స్థానాన్ని బండారు శ్రావణికి కేటాయించడంతో...సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాలకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై యామినీ బాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేని శ్రావణికి టికెట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు.(అలా అయితే మాకు ఓటమే : జేసీ) -
అమానుషం
గొర్రెల దొడ్డికి నిప్పు పెట్టిన దుండగులు 60 జీవాలు సజీవ దహనం {పాణాలతో కొట్టుమిట్టాడుతున్న మూడు పొట్టేళ్లు ఎంత అమానుషం.. కర్కశం.. దుండగుల దాష్టీకానికి మూగ జీవాలు బుగ్గిగా మారాయి. వుంటల్లో తప్పించుకోవడానికి కూడా వీలు లేని విధంగా కంచె ఉండడంతో మాంసపు ముద్దలయ్యూరుు. ఆలస్యంగా గమనించిన యజమాని ఏమీ చేయలేని నిస్సయ స్థితిలో కన్న బిడ్డలా పెంచుకున్న జీవాలు కంటి ముందే కాలి బూడిదవుతుంటే నిశ్చేష్టులై ఉండిపోయారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. గంగవరం:గంగవరం వుండలంలోని కొత్తపల్లె అటవీ ప్రాతంలో గురువారం రాత్రి గుర్తు తెలియుని దుండగులు గొర్రెలదొడ్డికి నిప్పు పెట్టారు. ఈసంఘటనలో 42 గొర్రె లు, 3 పొట్టేళ్లు, 15 పిల్లలు సజీవ దహనవుయ్యూరుు. సుమారు రూ.4 లక్షల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. కొత్తపల్లె గ్రామానికి చెందిన మునిరత్నం అతని భార్య ఆంజమ్మ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాతంలో యుర్రయ్యుగారిపళ్లె వంక వద్ద గొర్రెలకు దొడ్డిని నిర్మించుకున్నారు. పక్కనే గుడిసె కట్టుకుని గొర్రెలు మేపుకుంటూ దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. వీరికి గొర్రెలే జీవనాధారం. గురువారం రాత్రి వుునిరత్నం అతని భార్య ఆంజవ్ము గొర్రెలదొడ్డికి సమీపంలో వ్యవసాయు పొలం వద్ద నివాసవుుంటున్న బంధువు ఇంటికి వెళ్లారు. ఈ విషయుం గమినించిన గుర్తు తెలియుని దుండగులు గొర్రెలదొడ్డికి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో గొర్రెలు మంటల్లో చిక్కుకుని కాలి బూడిదయ్యూరుు. వుంటల్లో తప్పించుకోవడానికి కూడా వీలు లేనివిధంగా కంచె ఉండడంతో పూర్తిగా దొడ్డిలో ఉన్న గొర్రెలు, పొట్టేళ్లు, పిల్లలు వూంసపు ముద్దలయ్యూయి. వుంటలు గమనించిన మునిరత్నం అతని భార్య ఆంజమ్మ దొడ్డి వద్దకు చేరుకుని నిస్సహాయు స్థితిలో ఉండిపోయూరు. చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు కూడా లేవు. సహాయుం చేయడానికి ఆ సమయంలో ఎవరు అందుబాటులో లేరు. గొర్రెల దొడ్డి కాలి బూడిదరుుంది. పక్కనున్న పూరిగుడిసె కూడా కాలిపోరుుంది. శుక్రవారం ఉదయుం విషయుం తెలుసుకున్న సర్పంచ్ గిరిరాజారెడ్డి, గ్రావుస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘోరంపై గంగవరం పోలీసులకు, రెవెన్యు అధికారులకు సవూచారం ఇచ్చారు. సీఐ రవి బాబు, ఎంఆర్ఐ విష్ణురామ్ తవు సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ.4లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కేసు నమోదుచేసి బాధితులకు తప్పక న్యాయుం చేస్తావుని హామీ ఇచ్చారు.