మొహర్రం ఊరేగింపులో విషాదం | muharram Parade of tragedy in nizamabad district | Sakshi
Sakshi News home page

మొహర్రం ఊరేగింపులో విషాదం

Published Wed, Nov 5 2014 2:07 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

muharram Parade of tragedy in nizamabad district

నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్ పంచాయతీ  అచ్చాయపల్లిలో బుధవారం జరిగిన మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. గ్రామంలో పీర్లను ఊరేగిస్తున్న బృందం విద్యుదాఘాతంతో ఓ యువకుడు సజీవ దహనం కాగా మరో 26 మంది గాయపడ్డారు. వివరాలు.. మొహర్రం సందర్భంగా అచ్చాయపల్లికి చెందిన కొందరు పీర్‌లను ఎత్తుకొని ఊరేగింపుగా ఎల్లారెడ్డి మండలం మచాపూర్  నుంచి వస్తుండగా 132 కేవీ హై టెన్షన్ వైర్లకు పీర్ కర్ర తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. వైర్ల నుంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు లేచి వారిపై పడ్డాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన జింక సాయిలు(35) అక్కడిక్కడే సజీవదహనం కాగా, 26 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement