చోరీకి వచ్చి.. మంటల్లో చిక్కుకొని.. | Theft burned alive in fire accident | Sakshi
Sakshi News home page

చోరీకి వచ్చి.. మంటల్లో చిక్కుకొని..

Published Thu, Mar 23 2017 12:24 AM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

చోరీకి  వచ్చి.. మంటల్లో చిక్కుకొని.. - Sakshi

చోరీకి వచ్చి.. మంటల్లో చిక్కుకొని..

మంటలు ఆర్పిన తర్వాత బయటపడిన మృతదేహం

కొత్తూరు: దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి మంటల్లో చిక్కి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం తెల్లవారు జామున జరిగింది. కొత్తూరులోని పోలీస్‌స్టేషన్‌ వెళ్లే రోడ్డులో దొండిరామ్‌కు చెందిన టీ కొట్టులోంచి మంటలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అనంతరం పరిశీలించగా టీకొట్టు డబ్బాలో సగం కాలిన వ్యక్తి మృతదేహం కనిపించింది.

ఈ విషయమై రూరల్‌ సీఐ మధుసూదన్‌ ను వివరణ కోరగా.. టీకొట్టులో చోరీకి వచ్చిన దొంగ.. డబ్బాపై ఉన్న రేకులు తొలగించి లోపలికి ప్రవేశించి నట్లు తెలిపారు. అదే సమయంలో టీకొట్టులో అమ్మకానికి పెట్టిన పెట్రోల్, కిరోసిన్‌ డబ్బాలపైన దొంగ పడిపోయాడు. చీకటిగా ఉండడంతో వెలుతురు కోసం అగ్గిపుల్లను వెలిగించగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి అతడు సజీవ దహనమైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరో కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement