అడవిలో యువతి సజీవదహనం
Published Wed, Jan 11 2017 2:58 PM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి సమీపంలోని అడవిలో ఓ యువతిని సజీవదహనం చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జాకారం గ్రామానికి చెందిన ఎస్తి రాణి(18)గా గుర్తించారు. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆమె అదృశ్యమైంది. బుధవారం సజీవదహనమై కనిపించింది. పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement