rani
-
అరకులో పాస్ పోర్ట్ ఆఫీస్ ప్రారంభించిన ఎంపీ తనూజ రాణి
-
ప్రెజర్ నుంచి ప్లెజర్‌కు...
పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యల ఒత్తిడి, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి... ‘ఒత్తిడి’ రాక్షస పాదాల కింద ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి. అయితే ఒత్తిడి అనేది తప్పించుకోలేని పద్మవ్యూహమేమీ కాదు. ఒత్తిడిని చిత్తు చేసే వజ్రాయుధం, ఔషధం సంగీతం అని తెలిసిన స్వప్నరాణి... ఆ ఔషధాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు, గృహిణుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమందికి చేరువ చేస్తోంది. మరోవైపు మరుగునపడిన జానపదాలను వెలికి తీస్తూ ఈ తరానికి పరిచయం చేస్తోంది. ‘సంగీతం ఈ కాలానికి తప్పనిసరి అవసరం’ అంటుంది.నిజామాబాద్‌కు చెందిన స్వప్నరాణి సంగీతం వింటూ పెరిగింది. సంగీతం ఆమె అభిరుచి కాదు జీవనవిధానంగా మారింది. యశ్వంత్రావ్ దేశ్‌పాండే దగ్గర హిందుస్తానీ సంగీతంలో డిప్లమా, పాలకుర్తి రామకృష్ణ దగ్గర కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ, పీహెచ్డీ చేసింది. ఉత్తర తెలంగాణలో సంగీతంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది.‘ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు’ అనే అంశంపై పరిశోధన చేసింది. తన పరిశోధనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరువందలకు పైగా జానపద పాటలను సేకరించింది. సంగీతం అనేది నిలవ నీరు కాదు. అదొక ప్రవాహ గానం. ఆ గానాన్ని సంగీత అధ్యాపకురాలిగా విద్యార్థులకు మాత్రమే కాదు వయో భేదం లేకుండా ఎంతోమందికి చేరువ చేస్తోంది స్వప్నరాణి.స్వప్నరాణి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి కనీస అర్హత ఏమిటి?‘నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది’ అనే చిన్న మాట చాలు.నిజామాబాద్‌లోని ప్రభుత్వ జ్ఞానసరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ తిప్పోల్ల స్వప్నరాణి ‘నాకు వచ్చిన సంగీతంతో నాలుగు డబ్బులు సంపాదించాలి’ అనే దృష్టితో కాకుండా ‘నాకు వచ్చిన సంగీతాన్ని పదిమందికి పంచాలి’ అనే ఉన్నత లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.స్వప్నరాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న వారిలో కాస్తో కూస్తో సంగీత జ్ఞానం ఉన్నవారితో పాటు బొత్తిగా స ప స లు కూడా తెలియని వారు కూడా ఉన్నారు.స్వప్న శిష్యుల్లో సాధారణ గృహిణుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎంతోమంది ఉన్నారు.‘సంగీతం గురించి వినడమే కానీ అందులోని శక్తి ఏమిటో తెలియదు. స్వప్న మేడమ్ సంగీత పాఠాల ద్వారా ఆ శక్తిని కొంచెమైనా తెలుసుకునే అవకాశం వచ్చింది. స్ట్రెస్ బస్టర్ గురించి ఏవేవో చెబుతుంటారు. నిజానికి మనకు ఏ కాస్త సంగీతం వచ్చినా ఒత్తిడి అనేది మన దరిదాపుల్లోకి రాదు’ అంటుంది ఒక గృహిణి.‘సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్నప్పటి కల. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాను. ఈ టైమ్‌లో సంగీతం ఏమిటి అనుకోలేదు. స్వప్నగారి పాఠాలు విన్నాను. నా కల నెరవేరడం మాట ఎలా ఉన్నా... సంగీతం వల్ల ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి.ఇప్పటికి ఐదుసార్లు శతగళార్చన కార్యక్రమాలు నిర్వహించిన స్వప్న ‘సహస్ర గళార్చన’ లక్ష్యంతో పనిచేస్తోంది. ‘రాగం(నాదం), తాళంలో శృతిలయలు ఉంటాయి. నాదంలో 72 ప్రధాన రాగాలు ఉంటాయి. ఏ శబ్దం ఏ రాగంలో ఉండాలో ట్రాక్ తప్పకుండా ఉండాలంటే నేర్చుకునేవారిలో ఏకాగ్రత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఒక దీక్షలా అభ్యసిస్తేనే సంగీతంలో పట్టు సాధించడం సాధ్యమవుతుంది’ అంటుంది స్వప్నరాణి.భవిష్యత్తుకు సంబంధించి స్వప్నరాణికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తన విద్యార్థులను ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి రోజున తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సంసిద్ధం చేయడం వాటిలో ఒకటి. భవిష్యత్తులో సహస్ర గళార్చన కార్యక్రమాలు ఎక్కువగా చేసే లక్ష్యంతో శిష్యులను తీర్చిదిద్దుతుంది.సంగీతం... ఈ కాలానికి తప్పనిసరి అవసరం‘సంగీతం మనకు ఏం ఇస్తుంది?’ అనే ప్రశ్నకు ఒక్క మాటల్లో జవాబు చెప్పలేం. సంగీతం అనేది తీరని దాహం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు. అందుకే ఈ కాలానికి సంగీతం అనేది తప్పనిసరి అవసరం.సంగీతం వినడమే కాదు నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. నా పరిశోధనలో భాగంగా మరుగున పడిన ఎన్నో జానపదాలను సేకరించిన వాటిని ఈ తరానికి పరిచయం చేస్తున్నాను.– స్వప్నరాణి– టి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
ఎస్ఈసీగా రాణీ కుముదిని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్ఈసీ) విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఐ.రాణీ కుముదిని నియమితులయ్యారు. మంగళవారం ఈ మేరకు ఆమెను ఎస్ఈసీగా నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీచేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. గత నాలుగేళ్లుగా ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహించిన సి.పార్థసారధి పదవీకాలం ఈ నెల 8న ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం గత ఫిబ్రవరితో ముగియగా ఏడున్నర నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.అదే విధంగా గత జూలై మొదటివారంలో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తులో భాగంగా, అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాల తయారీపై పార్థసారధి హయాంలో షెడ్యూల్ జారీచేశారు. ఈనెల 13న ముసాయిదా జాబితాల ప్రచురణ మొదలుపెట్టి, 28న ఓటర్ల తుది జాబితాలను ప్రచురించాలని ఈ షెడ్యూల్లో పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. 1988 బ్యాచ్ ఐఏఎస్... ఉమ్మడి ఏపీలో అనేక హోదాల్లో పనిచేసిన దివంగత ఐపీఎస్ అధికారి ఇస్మాల్ పుల్లన్న కుమార్తె రాణీ కుముదిని. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా 2023 దాకా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. తొలుత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జేసీగా, కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగానూ కొంతకాలం ఉన్నారు. కారి్మక, ఐఎల్వో కమిషనర్‌గా, ఉద్యానశాఖ కమిషనర్‌గా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సరీ్వసుల్లోకి వెళ్లారు. కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శిగా, ఎన్ఎఫ్డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో కార్మికశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (స్పెషల్ సీఎస్) పనిచేశారు. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ పొందారు. విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్ తెలంగాణ విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోపాల్ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పురపాలక శాఖ, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. -
‘మిషన్ దివ్యాస్త్ర’ని విజయవంతం చేసిన 'దివ్యపుత్రి'!
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు కూడా. ఈ అగ్ని-5 క్షిపణి విజయవంతం వెనకు ఉన్న మహిళ మన హైదరాబాద్ డీఆర్డీవోలో పనిచేస్తున్న ల్యాబరేటరీ శాస్త్రవేత్త. ఇంతకుమునుపు ఇలాంటి క్షిపణి వ్యవస్థలపై పనిచేసి 'అగ్ని పుత్రి'గా పేరుగాంచిన టెస్సీ థామస్ అడుగుజాడల్లో వచ్చిన మరో శక్తిమంతమైన 'దివ్యపుత్రి' ఈమె!. ఈ 'మిషన్ దివ్యాస్త్ర' ప్రాజెక్టుకు దేశంలోని మన హైదరాబాద్ క్షిపణి కాంప్లెక్స్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త షీనా రాణీ నాయకత్వం వహించారు. ఆమె 1999 నుంచి ఈ అగ్నిక్షిపణి వ్యవస్థలపై పనిచేస్తున్నారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికతతో కూడిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించి ఈ ఏడాదికి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కి కీర్తి కీరిటంగా నిలిచారు షీనా రాణి. అందువల్ల ఆమెను భారత రక్షణ పరిశోధన సంస్థ ఆమెను 'దివ్యపుత్రి'గా అభివర్ణించింది. ఆమె చాలమటుకు ఈ అగ్ని సీరిస్ క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిండంతో షీనా రాణిని 'పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ'గా పిలుస్తారు. ఈ 57 ఏళ్ల షీనా రాణి హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీలో శాస్త్రవేత్త. ఆమె తిరువనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత విక్రమ సారాభాయ స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)లో ఎనిమిదేళ్లు పనిచేసింది. 1998లో పోఖ్రాన్ అణు పరీక్ష తర్వాత ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించడానికి డీఆర్డీవోలో చేరారు. ఇక 1999 నుంచి షీనా రాణి మొత్తం అగ్ని శ్రేణి క్షిపణులు ప్రయోగ నియంత్రణ వ్యవస్థలపై పని చేశారు. అయితే ఆమె కెరీర్లో మంచి తోడ్పాటునందిచింది. క్లిష్టతరమైన కాలంలో డీఆర్డీవోకి నాయకత్వం వహించిన డాక్టర్ అవినాష్ చందర్ అని చెప్పుకొచ్చారు. ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇష్టపడతారు. అదే తనకు ఈ అగ్ని క్షిపణి కార్యక్రమం పట్ల అంకితభావంతో ఎలా పనిచేయాలనేది నేర్పించిందని వివరించింది. ఇక ఆమె భర్త పీఎస్ఆర్ఎస్ శాస్త్రీ డీఆర్డీవోలో క్షిపణులపై పనిచేశారు. 2019లో ఇస్రో ప్రయోగించిన కౌటిల్య ఉపగ్రహానికి ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. ఈ 'మిషన్ దివ్వాస్త్ర' పేరుతో ప్రయోగించిన విమాన పరీక్షను ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించారు. ఈ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’కి.. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది. ఎంఐఆర్వీ సాంకేతికత కలిగిన ఈ ఒక్క క్షిపణి ఒకేసారి అనేక అణు వార్హెడ్లను మోహరించి, వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిలో ఉన్న ఒకటికి మించిన వార్హెడ్ల కారణంగా శత్రు దేశాల మిసైల్ డిఫెన్ వ్యవస్థలను ఏమార్చడంతో పాటు వాటి ఖండాంతర క్షిపణి విధ్వంస దాడులను తట్టుకుని లక్ష్యాన్ని ఛేదించేగలదు. ఈ క్షిఫణిని స్వదేశీయంగా ఎంఐఆర్వీ సాంకేతికతో అభివృద్ధి చేసి భారతదేశం.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన చేరింది. అంతేగాదు ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కల్పించడం లక్ష్యఛేదన కచ్చితత్వంతో జరిగేలా చూడటం ఈ అగ్ని 5 క్షిపణి ప్రత్యేకత. (చదవండి: నర్సు వెయిట్ లాస్ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో జస్ట్ ఒక్క ఏడాదిలోనే..) -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్‌గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్‌లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్‌లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్‌ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్‌లో ‘మీ స్కూల్ కరిక్యులమ్‌లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్‌తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్‌లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
అత్యంత పెద్ద కోట ఇది.. అసలు దీని చరిత్ర ఏంటి?
-
పసిడి పారుల్ అన్ను బంగారం
చైనా గడ్డపై భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి అద్భుతం చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి భారత్‌కు 5000 మీటర్ల విభాగంలో పారుల్... జావెలిన్ త్రోలో అన్ను రాణి పసిడి పతకాలు అందించారు. ఈ ఇద్దరితోపాటు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ కాంస్యం... పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ కాంస్యం... పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజతం... పది క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ రజతం గెల్చుకున్నారు. అథ్లెటిక్స్ కాకుండా బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు... కనోయింగ్‌లో ఒక కాంస్యం లభించాయి. ఓవరాల్‌గా ఆసియా క్రీడల పదో రోజు భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరాయి. మరో ఐదు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ప్రస్తుతం భారత్ 69 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆర్చరీలో మూడు పతకాలు... బాక్సింగ్‌లో మరో పతకం... క్రికెట్లో ఒక పతకం కూడా ఖరారయ్యాయి. ఫలితంగా ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం లాంఛనం కానుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. హాంగ్జౌ: బరిలోకి దిగితే పతకం సాధించాలనే లక్ష్యంతో తమ ఈవెంట్లలో పోటీపడుతున్న భారత అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో మెరిపిస్తున్నారు. నిలకడగా రాణిస్తూ... తమపై పెట్టుకున్న అంచనాలకు మించి ప్రతిభ కనబరుస్తూ... 1951 తర్వాత ఈ క్రీడల చరిత్రలో పతకాలపరంగా తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. పోటీల పదోరోజు భారత్‌కు తొమ్మిది పతకాలు రాగా... అందులో ఆరు అథ్లెటిక్స్ ఈవెంట్ల నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటికే 22 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలు) గెలిచారు. తద్వారా 2018లో 20 పతకాల ప్రదర్శనను సవరించారు. 1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యధికంగా 34 పతకాలు గెలిచారు. మంగళవారం భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి పసిడి కాంతులు విరజిమ్మారు. 5000 మీటర్ల రేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ విజేతగా అవతరించింది. ఆమె అందరికంటే వేగంగా 15 నిమిషాల 14.75 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని గెలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో 5000 మీటర్లలో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పారుల్ గుర్తింపు పొందింది. తాజా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. ఆమె 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం గెలిచింది. గతంలో మహిళల 5000 మీటర్ల విభాగంలో భారత్ తరఫున సునీతా రాణి (1998–రజతం; 2002–కాంస్యం), ఓపీ జైషా (2006–కాంస్యం), ప్రీజా శ్రీధరన్ (2010–రజతం), కవితా రౌత్ (2010–కాంస్యం) పతకాలు నెగ్గారు. తాజా స్వర్ణ పతకంతో ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో తనను డీఎస్పీగా నియమిస్తారని పారుల్ ఆశిస్తోంది. యూపీ ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన వారికి డీఎస్పీ ఉద్యోగం ఇస్తారు. మూడో ప్రయత్నంలో... వరుసగా మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్ను రాణి కాంస్యం సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో ఆరో స్థానంతో నిరాశపరిచింది. మూడో ప్రయత్నంలో 31 ఏళ్ల అన్ను రాణి ఏకంగా బంగారు పతకాన్ని మెడలో వేసుకుంది. 11 మంది పోటీపడ్డ ఫైనల్లో అన్ను రాణి జావెలిన్‌ను తన నాలుగో ప్రయత్నంలో గరిష్టంగా 62.92 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖరారు చేసుకుంది. నదీషా దిల్హాన్ (శ్రీలంక; 61.57 మీటర్లు) రజతం, హుయ్‌హుయ్ లియు (చైనా; 61.29 మీటర్లు) కాంస్యం గెలిచారు. ‘ఏడాది మొత్తం ఎంతో ప్రయత్నించినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయా. ప్రభుత్వం నాపై ఎంతో డబ్బు వెచి్చంచి విదేశాల్లో శిక్షణకు పంపించింది. ఫలితాలు రాకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యా. అయితే ఆసియా క్రీడల్లో ఈ సీజన్లోనే ఉత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది’ అని అన్ను రాణి వ్యాఖ్యానించింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రోలో గతంలో బార్బరా వెబ్‌స్టర్ (1951; కాంస్యం), ఎలిజబెత్ డావెన్‌పోర్ట్ (1958; రజతం... 1962; కాంస్యం), గుర్మిత్ కౌర్ (1998; కాంస్యం) పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకాన్ని సాధించింది. హీట్స్‌లో 55.42 సెకన్ల సమయం నమోదు చేసి పీటీ ఉష జాతీయ రికార్డును సమం చేసిన విత్యా ఫైనల్లో దానిని పునరావృతం చేయలేకపోయింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల విత్యా 55.68 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజత పతకం గెలిచాడు. తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ ఈ కేరళ అథ్లెట్ ఒక నిమిషం 48.43 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ప్రవీణ్ 16.68 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. 49 ఏళ్ల తర్వాత... పది క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో 49 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించింది. ఢిల్లీకి చెందిన తేజస్విన్ శంకర్ 7666 పాయింట్లతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు. 2011 నుంచి భారతీందర్ సింగ్ (7658 పాయింట్లు) పేరిట ఉన్న డెకాథ్లాన్ జాతీయ రికార్డును తేజస్విన్ సవరించాడు. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో విజయ్ సింగ్ చౌహాన్ స్వర్ణం, సురేశ్ బాబు కాంస్యం గెలిచాక ఈ క్రీడల్లో మళ్లీ భారత్‌కు పతకం అందించిన డెకాథ్లెట్‌గా తేజస్విన్ గుర్తింపు పొందాడు. -
తప్పుడు వీడియో షేర్ చేస్తావా? అంటూ మహిళా అథ్లెట్‌పై కోచ్ భార్య దాడి
కర్ణాటక: కోచ్ భార్య మహిళా అథ్లెట్‌పై దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బిందురాణి అనే అథ్లెట్ ప్రాక్టీస్ కోసం కంఠీరవ స్టేడియం వెళ్లారు. అక్కడ శ్వేత అనే మహిళ బిందురాణిని నోటికొచ్చినట్లు తిట్టి చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కోచ్‌ల గ్రూప్‌లో ప్రైవేట్ కార్యక్రమం వీడియోను బిందు షేర్ చేసిందని, తప్పుడు వీడియోను షేర్ చేస్తావా అంటూ కోచ్ యతీశ్ భార్య శ్వేత దాడి చేసినట్లు తెలిసింది. ఆమైపె తాను అథ్లెటెక్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బిందురాణి తెలిపింది. -
చేపల్లో మహా‘రాణి’లు!.. లొట్టలేసుకుని తింటారు.. ఎందుకంత డిమాండ్?
సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు అంతగా డిమాండ్ లేని రాణి ఫిష్ చేపలకు ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. స్థానిక మార్కెట్లో గులివిందలుగా పిలిచే ఈ చేపలు అధిక డిమాండ్, ధరలతో కొన్నాళ్లుగా మహారాణులయ్యాయి. మత్స్యకారులకు కాస్త ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. లేత ఎరుపు, పసుపు, తెలుపు, బంగారు, నీలి రంగుల చారలతో కంటికి ఒకింత ఇంపుగా కనిపించే ఈ చేపలకు చెన్నై, కేరళ రాష్ట్రాల్లో లొట్టలేసుకుని తింటారు. అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో లభించే ఈ చేపలకు రుచి ఎక్కువ. అందువల్ల తమిళనాడు, కేరళ ప్రాంతాల ప్రజలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఒడిశాలోని చిలక ప్రాంతం నుంచి మన రాష్ట్రంలోని కాకినాడ వరకు వీటి లభ్యత అధికంగా ఉంటుంది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు మత్స్యకారులకు సముద్రంలో ఇవి పెద్ద సంఖ్యలో లభ్యమవుతాయి. గతంలో చెన్నై, కేరళల నుంచి వర్తకులు విశాఖపట్నం వచ్చి వీటిని కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే వారు. అప్పట్లో ఇక్కడ కిలో రూ.50కి మించి కొనుగోలు చేసే వారు కాదు. అక్కడ కిలో రూ.100కు పైగా విక్రయించుకునే వారు. పైగా ఈ ప్రాంతంలో వీటికి అంతంతమాత్రపు ధరే లభించేది. కానీ కొన్నాళ్లుగా వీటికి మహా రాణి యోగం పట్టింది. కొంతమంది స్థానిక వర్తకులు ఈ రాణి చేపలను ఇక్కడ నుంచి నేరుగా చెన్నై, కేరళలకు ఎగుమతులు చేస్తున్నారు. అక్కడ కిలో రూ.130 వరకు అమ్ముతున్నారు. దీంతో ఇక్కడ రాణి ఫిష్‌కు అనూహ్యంగా మంచి ధర లభిస్తోంది. ఇలా ప్రస్తుతం వీటిని ట్రేడర్లు కిలో రూ.100 వరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో పెద్ద సైజు రాణి ఫిష్‌ను కిలో రూ.200 ధర కూడా పలుకుతోంది. ఇలా గతంలో అక్కడ అమ్మకం చేసే ధరే దాదాపు ఇక్కడ వస్తోంది. చదవండి: మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు అసలే వేట గిట్టుబాటు కాక సతమతమవుతున్న మత్స్యకారులు, బోటు యజమానులకు గులివిందల ధర లాభదాయకంగా ఉంటోంది. ఇది మత్స్యకారులకు ఊరటనిస్తోంది. ‘డీజిల్ ధర కొన్నాళ్లుగా మాకు పెను భారంగా మారింది. ఈ తరుణంలో సమృద్ధిగా లభ్యత, మంచి ధరతో గులివందలే ఆదుకుంటున్నాయి.’ అని మైలపిల్లి రాము అనే బోటు యజమాని ‘సాక్షి’తో చెప్పారు. రోజుకు 25–30 టన్నుల రాణి ఫిష్‌లు విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు రోజుకు సగటున 150 టన్నుల చేపలు వస్తుంటాయి. వీటిలో ప్రస్తుతం రాణి ఫిష్ (గులివిందలు) చేపలు 25–30 టన్నుల వరకు ఉంటున్నాయి. వీటిలో కొనుగోళ్లు చేయగా మిగిలిన చేపలను కొన్ని రోజులపాటు ఎండబెట్టిన తర్వాత విక్రయిస్తారు. -
ఎస్తేర్ ‘జిమ్’దాబాద్.. ఏపీ తొలి మహిళా బాడీబిల్డర్
సృష్టికి మూలం స్త్రీ. ప్రతి మగాడి గెలుపు వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ ఈ వనితల విజయం వెనుక వారి స్వయంకృషి ఉంది. అచెంచల ఆత్మవిశ్వాసం.. మొక్కవోని దీక్ష.. కఠోర సాధనతో వీరు తాము అనుకున్న లక్ష్యం సాధించారు. అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టారు. ఉరిమే ఉత్సాహంతో ముందుకురికారు. జయభేరి మోగించి విజయతీరాలు చేరారు. తమ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రతిభ కనబరిచారు. మహిళా లోకం సగర్వంగా తలెత్తుకునేలా.. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు. చదవండి: ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం తెనాలి(గుంటూరు జిల్లా): రావూరి ఎస్తేరు రాణి.. ఈమె జీవితం వడ్డించిన విస్తరి కాదు.. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యారు. పేదరికం శాపంలా వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. జిమ్ ట్రైనర్‌గా ఉపాధి పొందుతూనే బాడీబిల్డర్గానూ రాణించారు. రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ఫలితంగా ఈనెల 11న సిక్కింలో జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేరురాణి సొంతూరు తెనాలి సమీపంలోని వేమూరు. నాలుగున్నరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను, ఆమె తమ్ముడినీ నాయనమ్మ చేరదీసింది. ఇద్దరినీ చదివించింది. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేరు రాణి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేసేవారు. కొద్దినెలల్లోనే అక్కడ జిమ్ ట్రైనర్‌గా మారారు. ఆ తర్వాత శరీర సౌష్టవ పోటీలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కఠోర సాధనతో ఏడాదిన్నరలోపే అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు గత జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సత్తాచాటారు. ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ప్రముఖుల ప్రోత్సాహం ఎస్తేరురాణికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ రూ.లక్ష, అడిషనల్ డీజీపీ శ్రీధర్, సునీల్ కలిసి రూ.50 వేలు చొప్పున సాయాన్ని సమకూర్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. నిత్యం ఆరు గంటల కఠోర సాధన ఎస్తేరురాణి రోజూ ఆరు గంటలు కఠోర సాధన చేస్తారు. ఈ సాధన ఫలించాలంటే రోజూ కిలో చికెన్, ఇరవై గుడ్లు మెనూలో ఉండాలి. వచ్చే జీతం సరిపోకపోయినా.. కొందరి సాయంతో మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. నేషనల్స్‌లో పతకం సాధించి ఉద్యోగం పొందాలనేదే లక్ష్యమని ఎస్తేరు రాణి చెబుతున్నారు. ప్రతిభా ‘మాధవీ’యం తెనాలి: చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గాలి మాధవీలతకు ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల జాబితాను ప్రకటించింది. అందులో మాధవీలతకు స్థానం లభించింది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఈ నెల 3న ఈ జాబితాను ప్రకటించారు. వీరి స్ఫూర్తిదాయక సేవలను ‘షి ఈజ్ 75 విమెన్ ఇన్ స్టీమ్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురానున్నారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు వీరి వీడియోలను ప్రదర్శిస్తారు. సదస్సులో వీరిని పరిచయం చేస్తారు. ఆ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సైంటిస్ట్‌లు, కళాకారులు, సమాజ సేవకులు, మానవతావాద డాక్టర్ల సరసన చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కనకారెడ్డి, శివలీల కోడలు మాధవీలతకు స్థానం లభించింది. సాధారణ రైతు కుటుంబం నుంచి.. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం మాధవీలత స్వస్థలం. 1971లో సాధారణ రైతు కుటుంబంలో అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి దంపతులకు జని్మంచారు. జేఎన్టీయూ, కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, స్వగ్రామంలో తొలి ఇంజినీరుగా గుర్తింపును పొందారు. ఎన్ఐటీ, వరంగల్‌లో ఎంటెక్, ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని సర్వోత్తమ విశ్వవిద్యాలయం ఐఐఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్‌పర్సన్‌గా మాధవీలత సైన్స్‌ని, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువచేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలో జమ్ములో గల చీనాబ్ నదిపై రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జి డిజైన్, నిర్మాణంలో మాధవీలత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత విషయానికొస్తే గృహిణిగా, అమ్మగా తన పాత్రపోషిస్తూనే వృత్తిపరంగానూ రాణిస్తున్న మాధవీలత అభిరుచిలోనూ తనదైన శైలి కబరుస్తుంటారు. కవితలనూ రాస్తుంటారు. ‘ఆశా’వహ దృక్పథంతో.. గుంటూరు వెస్ట్: ఆశావహ దృక్పథమే ఆమెను ముందుకు నడిపింది. పరిస్థితులకు ఎదురీదుతూనే ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. రూ.200తో వ్యాపారం మొదలు పెట్టి రూ.40లక్షల టర్నోవర్‌కు చేర్చారు. ఆమె పేరు ఆశా సేకూరు. ఊరు గుంటూరు. సహజసిద్ధ ఉత్పత్తుల తయారీతో సమున్నత ప్రగతి సాధించారు. ఇప్పుడు విదేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆశా విజయగాథ ఆమె మాటల్లోనే.. ఆలోచనాత్మకంగా ముందడుగు.. 2008లో విజయ్ ప్రసాద్‌తో పెళ్లయింది. నేను గర్భిణిగా ఉండగా ఆయన నడిపే యానిమేషన్ స్టుడియో ఆర్థిక ఇబ్బందులతో మూతపడింది. ఎనిమిదో నెలలోనే కూతురు తన్వీ పుట్టింది. సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయినా బెదిరి పోలేదు. ఆ సమయంలో పాప రంగు రావాలని కొన్ని లోషన్స్ వాడాను. అవి వికటించి ర్యాషెస్ వచ్చాయి. అమ్మమ్మకు చెబితే వంటగదిలో లభించే కొన్ని వస్తువులతో సున్నిపిండి చేసి ఇచ్చింది. ఇది పాపకు బాగా పనిచేసింది. అప్పుడే సహజసిద్ధ ఉత్పత్తులు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. సున్నిపిండి తయారీకి కేవలం రూ.200 ఖర్చయింది. ఆచరణ ఇలా.. ఆ తర్వాత పాప శరీరానికి బాదం ఆయిల్ మంచిదని రూ.5.000 వెచ్చించి చత్తీస్‌గఢ్ నుంచి ఆయిల్ ఎక్స్్రస్టేట్ మిషన్ కొన్నాను. కేజీ బాదం పప్పును పిండితే కేవలం 150 గ్రాములే వచ్చింది. దానిలో మరికొన్ని వస్తువులు కలిపి పాపకు వాడాను. బాగా పనిచేసింది. ఆ తర్వాత సహజసిద్ధ ఉత్పత్తుల తయారీలో ఆయుర్వేదిక్ కాస్మొటాలజీ, ఆర్గానిక్, ఇతర సర్టిఫికేట్ కోర్సులు చేశా. సొంతంగా సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి మొదట నా బిడ్డకు వాడేదాన్ని. వాటి ఫలితాల ఆధారంగా తన్వీ నేచురల్స్ పేరిట సంస్థ స్థాపించి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టా. ప్రస్తుతం 25 రకాల వస్తువులు తయారు చేస్తున్నా. సంస్థ టర్నోవర్ ఇప్పుడు రూ.40లక్షలు. విదేశాలకూ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నా. ప్రస్తుతం 600 మంది రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. యువతకూ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అనుభవాలు వారికి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను. -
మాట్లాడే అవకాశం ఇవ్వరా?
సాక్షిప్రతినిధి, వరంగల్/కమలాపూర్: తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభలో ఓ మహిళా ఎంపీపీ ఆందోళన చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో శనివారం జరిగింది. కమలాపూర్ మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు రూ.29.51 లక్షల విలువ గల వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనకందిన సమాచారం మేరకు స్థానిక ఎంపీపీ రాణి సభ మధ్యలో వచ్చారు. మంత్రి ప్రసంగం అనంతరం మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని, తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంటానని కోరారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం మంత్రి మాట్లాడిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి ఉండదని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో సభా వేదికపైనే తనకు మాట్లాడే అవకాశం ఎందుకివ్వరంటూ నిలదీశారు. వెంటనే ఆమెను వేదికపై నుంచి కిందకు పంపించేశారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. శనిగరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నిగ్గుల వేణు వాట్సాప్, ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని, శనివారం తమ ఇంటి ముందు బైక్ ఆపి ఈలలు వేస్తూ, సైగలు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలతో తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళలతో కలసి హుజూరాబాద్– పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. -
పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నటి..
భోజ్‌పురి నటి రాణి చటర్జీ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టెలివిజన్ రంగానికి చెందిన తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్లో తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ ఇంకా తేదీపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కొంత కాలంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే తన బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది మాత్రం రాణి రహస్యంగా ఉంచారు. అతని గుర్తింపును ఇప్పుడు వెల్లడించలేనని.. కానీ తొందరలోనే వివరాలు చెబుతానని అన్నారు. అలాగే వెడ్డింగ్ ప్లాన్స్ గురించి ఆమె మాట్లాడుతూ.. ముస్లిం సంప్రాదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని అన్నారు. కాగా, ససురా బడా పైసావాలా సినిమాతో రాణి భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవ్రా బడా సతవేల, ఏక్ లైలా తీన్ చైలా, నాగిన్, రాణి చాలీ సాసురల్, దులారా.. వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే భోజ్‌పురిలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
లడ్డూలతో చోరీ
టీ.నగర్: తిరుచ్చి సెంట్రల్ బస్టాండ్‌లో మత్తు లడ్డూలు ఇచ్చి, ప్రయాణికుల వద్ద చోరీలకు పాల్పడుతున్న మహిళను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా తిరువైయ్యారు సమీపాన గల రంగనాథపురం ప్రాంతానికి చెందిన షణ్ముగం భార్య పార్వతి (50). ఈమె తిరుపూర్ జిల్లా పల్లడంలో బనియన్ కంపెనీలో పనిచేస్తోంది. గత జూన్ 27వ తేదీ తిరుచ్చి సెంట్రల్ బస్టాండ్ నుంచి పల్లడం వెళుతుండగా, పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికురాలికి స్వామి ప్రసాదంగా మత్తు లడ్డూను అందజేసింది. ఆ తర్వాత స్పృహ తప్పిన ఆమె ధరించి ఉన్న 8.5 సవర్ల నగలను అపహరించి పరారైంది. బుధవారం తిరుచ్చి నుంచి కోవైకు వెళ్లేందుకు పార్వతి అక్కడికి రాగా, నగలు చోరీ చేసిన మహిళను గుర్తించి అక్కడి పోలీసులకు అప్పగించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
బావల వేధింపులే కారణం..
అడ్డగుట్ట: తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమై హుస్సేన్ సాగర్‌లో శవమై తేలిన మౌనిక(రాణి) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారం రోజుల పాటు పలు కోణాల్లో విచారించారు. కాల్ డేటా, సీసీ ఫుటేజీలను పరిశీలించగా మౌనిక ఆత్మహత్యకు ఆమె కుటుంబసభ్యుల్లో ఇద్దరు బావలు, ఇద్దరు అన్నలే కారణమని తేలింది. తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... బుద్ధానగర్ ప్రాంతానికి చెందిన మాచర్ల అంజయ్య కుమార్తె మౌనిక మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత నెల 21న ఉదయం కాలేజీకి వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. దీంతో ఆమె సోదరుడు సాయికుమార్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా 23న రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలోని హుస్సేన్ సాగర్‌లో మౌనిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న లేక్‌పోలీసులు మృతదేహాన్ని ‘గాంధీ’ మార్చురీకి తరలించారు. దీనిపై సమాచారం అందడంతో తుకారాంగేట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తె ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని కోరుతూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలు మౌనిక చనిపోయే ముందు తన స్నేహితులు ముగ్గురికి ఫోన్ చేసి మాట్లాడినట్లు గుర్తించారు. సదరు యువకులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయితే ఈ కేసుతో వారికి సంబంధం లేదని తేలడంతో వారిని వదిలేశారు. కాగా మౌనిక ఆత్మహత్యకు కొద్ది సేపటి ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి బావలు, అన్నలు తనను వేధిస్తున్నారని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్లు గుర్తించారు.. దీంతో ఆమె బావలు వడ్డె సోమశేఖర్, ఆంథోనితో పాటు అన్నలు శివకుమార్, సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు బావల శారీరకంగా వేధిస్తుండగా, అన్నల మానసిక వేధింపుల కారణంగానే మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
రాణి ఆత్మహత్య కేసులో విచారణ చేపట్టాలి
అడ్డగుట్ట: తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన యువతి హుస్సేన్ సాగర్‌లో శవమై తేలిన విషయం తెలిసిందే. అయితే కొందరు వ్యక్తుల వేధింపుల కారణంగా రాణి ఆత్మహత్యకు పాల్పడిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం మృతదేహంతో తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ ఎదుట అందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే... తుకారాంగేట్, బుద్ధానగర్‌కు చెందిన అంజయ్య కుమార్తె రాణి(18) మారేడుపల్లిలోని వెస్లీ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. నవంబర్ 21న కాలేజీకి వెళ్లిన రాణి తిరిగి రాలేదు. దీంతో 22న ఆమె కుటుంబసభ్యులు తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా 23న హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని గుర్తించిన లేక్ పోలీసులు గాంధీ మార్చురీలో భద్రపరిచారు. దీనిపై సమాచారం అందడంతో తుకారాంగేట్ పోలీసులు రాణి కుటుంబ సభ్యులకు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూపించారు. అయితే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో వారు గుర్తించలేకపోయారు. దీంతో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాణి కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతురాలు రాణిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి.. తమ కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి అంజయ్య పేర్కొన్నారు. రాణి ఆత్మహత్యకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబసభ్యులు మంగళవారం రాత్రి తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారాం అందడంతో నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెనవర్, గోపాలపురం ఏసీపీ వెంకటరమణ అక్కడికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాణి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామన్నారు. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
విమానాన్ని జుట్టుతో లాగడమే లక్ష్యం
రాయదుర్గం: ఎప్పటికైనా విమానాన్ని నా జుట్టుతో లాగుతా..అదే నా లక్ష్యం.. అని చెబుతున్నారు గిన్నిస్ రికార్డు సాధించిన రాణిరైక్వార్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 37ఏళ్ల యువతి తన జుట్టుతో ఇంతవరకు జీపు, మినీబస్సు,ట్రక్, కంటైనర్, డబుల్‌డెక్కర్ బస్సు, ట్రైన్ ఇంజన్ లాగి శభాష్ అనిపించుకున్నారు. జుట్టుతో భారీ వాహనాలు లాగుతూ దేశంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఆమె గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్ సంస్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ♦ ఇప్పటి వరకు 100 టన్నుల లోపు భారీ వాహనాలు జుట్టుతో లాగా.. ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొడితే దాన్ని కూడా బద్దలు కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తా. ఎప్పటికైనా విమానాన్ని లాగాలనేది నా లక్ష్యం. ఆ సమయం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానన్నారు. ♦ యువతలో చైతన్యం తీసుకురావడానికి బ్రహ్మకుమారీస్ çసంస్థ సభ్యురాలిగా పనా వంతు కృషిచేస్తున్నానన్నారు. నా 10వ ఏటనే బ్రహ్మకుమారీస్ సంస్థలో చేరా. ఆ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. ఇక్కడే ఎన్నో నేర్చుకున్నా. ప్రస్తుతం భోపాల్‌లోని బ్రహ్మకుమారీస్ సంస్థలో ఉంటున్నా. ♦ చిన్నతనం నుంచి ఏదో సాధించాలనే తపన ఎక్కువగా ఉండేది. ఇంట్లో ఏ పనీ చేసేదాన్ని కాదు. అందరితో పోట్లాడేదాన్ని. మాఇంట్లోని పెద్ద వారు ఎన్నో నేర్పించారు. నాలో శక్తిని గుర్తించేలా చేసుకోవడానికి కూరగాయల ట్రాలీలో మొదట 10 నుంచి 25 ఇటుకలను పెట్టి జుట్టతో లాగేదాన్ని. అది విజయవంతం కావడం, పేపర్లో ఫోటో వేయడంతో ఉత్సాహం పెరిగింది. ♦ ఆ తర్వాత జీపు, మినీబస్సు, డబుల్ డెక్కర్, ట్రక్, రైల్ ఇంజన్, భారీ ట్రాలీపై 200 మందిని కూర్చోబెట్టి జుట్టుతో లాగా. ♦ నాలో ఎలాంటి అతీతవక్తులు లేవు. అలా అని జుట్టుకు ఏదో రాసుకోవడం లేదు. అందరిలాగే నేనూ కొబ్బరినూనె రాసుకుంటా. వాహనాలు లాగే ముందు ఎలాంటి ప్రాక్లీస్ చేయను. ఇది దేవుడిచ్చిన బలం. మెడిటేషన్ చేసి ఆతర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా. రాణి రైక్వార్ గురించి... గ్రామం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాక్లోర్గ్రామం తల్లిదండ్రులు : ఎంఎల్ రైక్వార్, రుక్మిణి, ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ♦ వయస్సు–37 ఏళ్ళు ♦ 1993లో బ్రహ్మకుమారీస్ సంస్థలో చేరిక ♦ 16వ ఏటనే కూరగాయల ట్రాలీలో పది నుంచి 25 వరకు ఇటుకలతో జుట్టుతో లాగడంతో ప్రారంభం ♦ ఆ తర్వాత జీపు, మినీబస్సు,ట్రక్, కంటైనర్, డబుల్‌డెక్కర్ బస్సు, ట్రైన్ ఇంజన్ లాగడం మినీ బస్సును జుట్టుతో లాగిన రాణి గచ్చిబౌలి శాంతిసరోవర్ ప్రాంగణంలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియం ముందున్న ఖాళీ స్థలంలో రాణిరైక్వార్ తన జుట్టుతో మినీ బస్సును లాగి ఆశ్చర్యపరిచారు. మినీ బస్సు ముందుబాగాన్ని తాళ్ళతో కట్టి, వాటిని ఆమె తన జుట్టుకు కట్టుకొని బస్సును ముందుకు లాగడంతో ప్రత్యక్షంగా చూస్తన్న వారు చప్పట్లతో అభినందనలు తెలిపారు. రికార్డుల వివరాలు... ♦ 2007లో కొరియాలోని ఓ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో డబుల్‌డెక్కర్ బస్ లాగడం ♦ 2008లో 8 టన్నుల ట్రక్నుజుట్టుతో లాగడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు ♦ 2012లో గిన్నిస్ వరల్డ్ రికార్డు– కలర్స్ చానల్ షో ద్వారా భారీకంటైనర్పై 200 మంది కూర్చునగా జుట్టుతో 90 అడుగుల దూరం లాగిన రికార్డు ♦ 2019లో లండన్‌లో బ్రిటీష్ పార్లమెంట్ ద్వారా ఎనర్జిటిక్విమెన్ ఆఫ్ ఇండియా అవార్డు స్వీకారం -
వివాహితను రక్షించబోయి..ప్రాణాలు కోల్పోయాడు
సాక్షి, విజయవాడ: వివాహితను రక్షించబోయి ఇద్దరు యువకులు గల్లంతు అయిన ఘటన విజయవాడలోని గుణదలలో చోటుచేసుకుంది. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గుణదలకు చెందిన రాణి అనే ఓ మహిళ మంగళవారం గుణదల రైవస్ కాల్వలో దూకేసింది. అదే సమయంలో అక్కడ ఉన్న అయిదుగురు యువకులు గమనించి ఆమెను రక్షించేందుకు కాలువలోకి దూకారు. వీరిలో ముగ్గురు యువకులు రాణిని రక్షించి బయటకు తీసుకొని రాగా, మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కాగా గల్లంతైన యువకులను వడుగు శివరామకృష్ణ (నాని), తాడేపల్లి సాయి అజయ్‌గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. గాలింపులో భాగంగా గల్లంతు అయిన శివరామకృష్ణ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇవాళ సాయంత్రం ఒడ్డుకు చేర్చింది. మహిళను రక్షించబోయి ప్రాణాలు పోగొట్టుకున్న శివరామకృష్ణ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యుల కన్నీటి పర్యంతమయ్యారు. -
కన్నీటి' గెడ్డ'
విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలోని గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాంగి ఎస్తేరు రాణి(14) శుక్రవారం ఉదయం సమీపంలోని గెడ్డలో స్నానానికి దిగి మునిగిపోయి చనిపోయింది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు కావడంతో తోటి విద్యార్థినులతో కలిసి పాఠశాలకు దగ్గరలో ఉన్న గెడ్డకు దుస్తులు ఉతుక్కోడానికి వెళ్లింది. అనంతరం స్నానానికి దిగి ప్రమాదానికి గురైంది. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గెడ్డ లోతుగా ఉండడంతో విద్యార్థిని బయటకు రాలేకపోయింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండలంలోని గుం టసీమకు చెందిన ఎస్తేరు లక్ష్మీపతికి ఇద్దరు మగ పిల్లలు, అమ్మాయి ఉన్నారు. ఆరు నెలల కిందట అతని భార్య చనిపోయింది. కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పాఠశాలకు ప్రహరీలేకపోవడం వల్లే.. పాఠశాల ప్రహరీ పూర్తిగా శిథిలమైంది. పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతోవిద్యార్థినులు గుంపులు గుంపులుగా సమీపంలోని గెడ్డకు వెళుతుంటారు. పాఠశాల సిబ్బంది పట్టించుకోనితనం కూడా ఉంది. రోజూ మాదిరి శుక్రవారం కూడా గెడ్డలో దిగిన విద్యార్థిని రాణి గల్లంతయింది. తోటి విద్యార్థినులు పరుగున పాఠశాలకు వచ్చి చెప్పడంతో ఉపాధ్యాయులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాత్రి 7గంటలకు మృతదేహాం లభ్యమైంది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థిని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో పాఠశాలతోపాటు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పట్టించుకోని ఉన్నతాధికారులు.. విద్యార్థిని ఉదయం 8గంటల సమయంలో గెడ్డల పడి మృతి చెందింది. పాడేరు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమశాఖ డీడీ, విద్యాశాఖ ఉన్నతాధికారులు సాయంత్రం వరకు ఈ సంఘటన పై పట్టించుకోలేదన్న వాదన వ్యక్తమవుతోంది. గిరిజన విద్యార్థులంటే ఉన్నతాధికారులకు చులకన అని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులు ఈ సంఘటనపై ఉపాధ్యాయులను నిలదీశారు. స్థానిక ఎస్ఐ హిమగిరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెన్నై: నటి రాణికి లైంగిక వేధింపులు
-
నటికి వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, చెన్నై: ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా సాగుతుండగానే మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి. వివిధ రంగాల్లో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బాధితురాళ్లు నిర్భయంగా వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో మహిళలపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా తమిళ నటి రాణి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. సీరియల్ చిత్రీకరణ సమయంలో సహ నటుడు షణ్ముగరాజన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సెంగుడ్రమ్ పోలీస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రక్ష పేరుతో పాపులర్ అయిన రాణి దాదాపు 32 సినిమాల్లో నటించారు. తెలుగు, కన్నడలోనూ ఆమె పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. నచ్చావులే సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకున్నారు. -
ప్రముఖ గాయని రాణి మృతి
టాలీవుడ్ సీనియర్ గాయని కె. రాణి (75) ఇక లేరు. హైదరాబాద్ కల్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందినట్టు చిన్న కుమార్తె కవిత ధృవీకరించారు. 1942లో కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో కిషన్, లలిత దంపతులకు జన్మించారామె. అసలు పేరు కె. ఉషారాణి. ఈ కుటుంబం కడపలో స్థిరపడింది. 8 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ చిత్రంలో ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’, ‘చెలియ లేదు.. చెలిమి లేదు..’ అనే పాటలతో రాణి పాపులర్ అయ్యా రు. ‘బాటసారి, జయసింహ, ధర్మదేవత, సంపూర్ణ రామాయణం, లవకుశ’ వంటి పలు చిత్రాల్లో తన మధురమైన గానంతో శ్రోతలను అలరించారు. ఆమె పాడిన చివరి చిత్రం ‘విశాల హృదయాలు’. ఆ సినిమాలో ఆమె ‘ఒక్క మాట..’ అనే పాట పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, సింహళ, ఉజ్బెక్ వంటి పలు భాషలలో సుమారు 500 పాటలు పాడారామె. శ్రీలంక జాతీయ గీతం కూడా ఆలపించారు రాణి. రాష్ట్రపతి భవన్లో తన గానామృతంతో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణని ఆకట్టుకున్న ఘనత రాణి సొంతం. సింహళ, ఉజ్బెక్ భాషలలో పాడిన తొలి ఇండియన్ సింగర్ ఆమె కావడం విశేషం. అలాగే, అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాజ్ ‘మెల్లిసై రాణి’ అనే బిరుదు ఇచ్చారు. 1966లో జి. సీతారామరెడ్డితో రాణి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంట్లో రాణి ఉంటున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
సీనియర్ గాయని కె రాణి కన్నుమూత
-
టాలీవుడ్‌కు మరో షాక్.. గాయని మృతి
దేవవాసు సినిమాలో ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’ అంటూ విషాదగీతాన్ని ఆలపించి తెలుగు ప్రేక్షకులతో కంటతడి పెట్టించిన సీనియర్ గాయని కె రాణి (75) కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రాణి.. హైదరాబాద్, కళ్యాణ్ నగర్‌లోని తన కుమార్తె విజయ నివాసంలో శుక్రవారం రాత్రి తొమ్మది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. శ్రీలంక జాతీయగీతాన్ని ఆలపించి అరుదైన ఘనత సాధించిన్న రాణి తొమ్మిదేళ్ల వయసులోనే సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగులో దాదాపు 500లకు పైగా పాటలను ఆలపించారు. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ,బెంగాలీ, సిన్హలా, ఉజ్జెక్ తదితర భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. రూపవతి సినిమాతో తెలుగులో తన కెరీర్‌ను మొదలు పెట్టిన రాణి.. బాటసారి, జయసింహ, ధర్మదేవత, లవకుశ తదితర సూపర్‌హిట్ చిత్రాల్లో పాటలు పాడారు. జాతీయ కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ ఆమెను ‘ఇన్నిసాయ్ రాణి’ అంటూ కీర్తించారు.1951లో గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకున్న తరువాత సినీ సంగీతానికి దూరమయ్యారు. సర్వేపల్లి రాధకృష్ణగారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్లో ప్రదర్శన ఇచ్చిన ఘనత కూడా కె.రాణి సొంతం. ఆమె మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
పెంచుకోవడానికే కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి ఆరు రోజుల చిన్నారి చేతనను కిడ్నాప్ చేసిన మహిళను సరూర్‌నగర్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన నైనా రాణిగా గుర్తించారు. ఆమెకు పిల్లలు పుట్టరనే ఉద్దేశంతో పెంచుకోవడానికే శిశువును ఎత్తుకుపోయినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, నిందితురాలిగా తేలడంతో నైనా రాణిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్జోస్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ ఎం.చేతన, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌తో కలసి గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. మొదటి భర్త మరణం.. రెండుసార్లు అబార్షన్ బీదర్ సమీపంలోని ఖాసింపురకు చెందిన నైనా రాణి తండ్రి దర్జీ. తల్లి గృహిణి. ఈమెకు అన్న, తమ్ముడు ఉన్నారు. నైనాను నాలుగేళ్ల క్రితం బీదర్‌కే చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొన్ని రోజులకే అత డు చనిపోవడంతో మూడేళ్ల క్రితం జహీరాబాద్ వాసి సీమన్తో రెండో వివాహం చేశారు. ప్రస్తుతం సీమన్ ఎన్టీఆర్ నగర్ మార్కెట్లో పండ్ల వ్యాపారం చేస్తుండగా నైనా ఇంటి పట్టునే ఉంటోంది. రెండుసార్లు గర్భస్రావం కావడంతో తనకిక పిల్లలు పుట్టరని భావించింది. ఏడు నెలల క్రితం తాను గర్భవతినని తల్లిని, భర్త సీమన్‌నూ నమ్మించింది. ఎన్టీఆర్ నగర్‌తో పాటు బీదర్, జహీరాబాద్‌లోని సోదరి ఇళ్లల్లో గడుపుతూ తాను గర్భవతినని ప్రచారం చేసుకుంది. తాను ప్రసవించానని చెప్పి శిశువుతో ఇంటికి వెళ్లే సమయం వచ్చిందని భావించిన నైనా.. నవజాత శిశువు కోసం శనివారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. సోమవారం ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించి విఫలమైంది. చివరకు చేతనను వాక్సినేషన్ పేరుతో కిడ్నాప్ చేసింది. ఆమె మాట నమ్మని కుటుంబీకులు.. ఆస్పత్రి నుంచి చిన్నారిని ఎత్తుకువెళ్లిన తర్వాత బీదర్‌లో ఉన్న కుటుంబీకులతో తనకు జహీరాబాద్‌లోని సోదరి ఇంటి వద్ద ప్రసవం అయిందని, ఆడపిల్ల పుట్టిందని చెప్పింది. భర్తకు ఫోన్ చేసి ఇదే విషయం చేరవేసింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఎంజీబీఎస్‌కు వెళ్లిన నైనా.. అక్కడి దుకాణంలో పాలు కొని ప్రతి రెండు గంటలకూ శిశువుకు పట్టిస్తూ హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లింది. నయాకమాన్ ప్రాంతంలో బస్సు దిగి.. షాగంజ్‌లో మరో వ్యక్తితో పాటు ఉంటున్న తమ్ముడి రూమ్‌కు వెళ్లింది. తాను ప్రసవించానంటూ అతడికి చేతనను చూపించింది. ఆమె మాటలు నమ్మని అతడు అన్నకు సమాచారం ఇచ్చాడు. అతడితో పాటు తల్లిదండ్రులూ షాగంజ్ చేరుకుని చిన్నారిని చూశారు. చిన్నారి బొడ్డును చూడటంతో పాటు నైనా స్థితిని పరిశీలించిన ఆమె తల్లి శిశువు విషయం అనుమానించి జహీరాబాద్‌లోని సోదరికి ఫోన్ చేసి ఆరా తీయగా అబద్ధంగా నిర్థారణ అయింది. సోమవారం రాత్రి తమ్ముడి రూమ్‌లోనే ఉండిపోయి పరిణామాలపై అంతా చర్చించారు. అరెస్టు అవుతామని భయపడి.. మంగళవారం ఉదయానికి మీడియాలో కిడ్నాప్‌పై ప్రతి 5 నిమిషాలకు అప్డేట్స్ ప్రసారమయ్యాయి. దీంతో అరెస్టు అవుతామని భయపడిన నైనా, ఆమె కుటుంబీకులు ఏం చేయాలని ఆలోచించారు. నైనా అన్న స్నేహితుడైన ఉత్తర కన్నడ పత్రిక రిపోర్టర్‌ను సంప్రదించాడు. శిశువును ప్రభుత్వాస్పత్రిలో వదిలేద్దామని సలహా ఇచ్చిన అతగాడు నైనా అన్నతో కలసి బైక్‌పై శిశువును తీసుకువెళ్లి బీదర్ ఆస్పత్రిలో వదిలేశాడు. ఈ విషయాన్ని న్యూటౌన్ ఠాణాలో పని చేసే ఎస్సైకు చెప్పాడు. అతడు బీదర్‌లో ఉన్న హైదరాబాద్ టీమ్‌కు సమాచారం ఇచ్చాడు. వీరు మంగళవారం సాయంత్రం శిశువును స్వాధీనం చేసుకుని బుధవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. బీదర్ ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు శిశువును వదిలినట్లు, ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడినట్లు గుర్తించారు. సెక్యూరిటీ గార్డును విచారించగా అతడు విలేకరి పేరు చెప్పాడు. ఇలా విలేకరిని, అతడి ద్వారా నైనా అన్న, తమ్ముడు, అతడి రూమ్మేట్ను పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో మాలెగావ్ ప్రాంతంలోని పెద్దమ్మ ఇంట్లో తలదాచుకున్న నైనాను గురువారం తెల్లవారుజామున పట్టుకుని హైదరాబాద్ తరలించారు. పోలీసులు ఖాసింపుర వెళ్లే సమయానికి తన బిడ్డను చూసుకోవడానికంటూ ఎన్టీఆర్ నగర్ నుంచి సీమన్ సైతం అక్కడకు చేరుకున్నాడు. -
ఆటో రాణి
ఒంగోలులోని మదర్ థెరిస్సా కాలనీ.. ఉదయాన్నే ఓ యువతి ఇంటి ముందు తన ఆటోను శుభ్రం చేసుకుంటోంది. ఆ సమయంలో మరో ఆటో డ్రైవర్ ఆమె ఆటోను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి పారిపోయాడు. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయిన ఆ యువతి వారం రోజుల పాటు వెతికి ఆ ఆటో డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపే వరకు ఊరుకోలేదు. మళ్లీ ఆమే..తోటి ఆటో డ్రైవర్ వచ్చి పక్కన కూర్చొని భుజంపై చేయి వేశాడు. అంతే అతని చెంప ఛెళ్లుమనిపించింది. ఆటో బాడుగకు వెళ్లినప్పుడు ‘ఆటో కావాలి..రేటెంత..’ అంటూ అసభ్యంగా మాట్లాడిన ఓ తుంటరి తాట తీసింది. ఆడతనాన్ని కాదు..ఆధిపత్య పోరులో నలిగిన అసహనాన్ని..అబలను కాదు..జీవిత పాఠాలతో రాటుదేలిన అంకుశాన్ని..తనువునేమి చూస్తావు..తలరాతను మార్చుకున్న నా తడాఖా చూడువంటగది దాటి వడివడిగాబతుకు బండి నడుపుతున్న నా తెగువను చూడు ఒంగోలు వన్‌టౌన్: అడుగడుగునా పొంచి ఉన్న మృగాల కోరలు వంచుతూ మొండి ధైర్యంతో తనను తాను కాపాడుకుంటూ..భర్త లేకపోయినా ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ బతుకు పోరు సాగిస్తోంది ఉమన్ ఆటో డ్రైవర్ ఎస్తేర్ రాణి. ఆమె జీవితంలోకి తొంగిచూస్తే..ఎంతో వేదన..మరెంతో తెగువ కళ్లముందు కదులుతుంది. ఒంగోలు మదర్‌థెరిస్సా కాలనీలో నివాసముంటున్న ఉప్పు సరళ.. భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న క్రమంలో మళయాళీ అయిన ప్రకాష్‌తో పరిచయం పెళ్లికి దారి తీసింది. సరళ, ప్రకాష్ దంపతులకు పుట్టిన మొదటి సంతానం ఎస్తేర్ రాణి, రెండవ సంతానం ఏసుబాబు. రాణి ఏడో తరగతి వరకూ చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా చదువు మానేసింది. తమ్ముడు టెంట్ హౌస్ కార్మికుడిగా, రాణి తల్లితోపాటు భవన నిర్మాణ కూలీగా మారింది. మట్టి మనుషుల జీవితాల్లో నిత్యం తొంగి చూసే ఆర్థిక సమస్యలు, వ్యసనాల కారణంగా తల్లీ కూతురు, తండ్రీ కొడుకులుగా కుటుంబం రెండుగా విడిపోయింది. తండ్రి, తమ్ముడు ఏసుబాబును తీసుకుని నగరంలోని ఒక టెంట్ హౌస్‌లో పని చేసుకుంటూ జీవిస్తుండగా రాణి..తల్లితో కలిసి అదే కాలనీలో ఉంటూ అమ్మతోపాటే కూలీగా మారింది. ఆ క్రమంలోనే పదిహేడేళ్ల వయస్సులో రాణికి భవన నిర్మాణ కార్మికుడైన రెడ్డి నరేంద్రతో 2012లో వివాహం అయింది. రాణి, నరేంద్రలకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి సాయితేజ, చిన్నకొడుకు సాయిమనోజ్ . కంకర పనికి వెళ్లి రోజుకు రూ.350 సంపాదిస్తూ రాణి కుటుంబ బరువు బాధ్యతలు మోస్తుండటంతో నరేంద్ర చెడు వ్యసనాలకు బానిసై కాలేయం దెబ్బతిని 2015లో మరణించాడు. భర్త మరణంతో దిక్కుతోచని రాణి కుంగిపోలేదు. కూలి పని మానేసి బంధువుల వద్ద ఆటో నడపడం నేర్చుకుంది. 2015లో ఒంగోలు మున్సిపల్ ఆఫీసులో 26 మంది ఉమెన్ ఆటో డ్రైవర్లకు అప్పటి కలెక్టర్ లోన్ సౌకర్యం ద్వారా ఆటోలు పంపిణీ చేశారు. రాణి కూడా ఒక ఆటో తీసుకుంది. ఆటో ద్వారా వచ్చే ఆదాయంలో కొంత బ్యాంక్‌కు చెల్లించడమే కాకుండా కుటుంబ భారాన్ని సమర్ధించుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ రూ.10 వేలు అప్పు చేసి మరో ఆటోను కొనుగోలు చేసింది. ప్రస్తుతం రెండు ఆటోల ద్వారా వచ్చే ఆదాయంతో సమాజంలో గౌరవ ప్రదమైన జీవనంతో తానెవరికీ తీసిపోనని నిరూపిస్తోంది. ఆటో నడుపుతున్న కొత్తలో కుర్రాళ్లు ఆటోలతో, బైక్‌లతో వెంటపడి ఫోన్ నంబర్ ఇవ్వమని వేధించినా తెగువతో రోడ్డు మీదకు వచ్చిన ఎస్తేర్ రాణి అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. పిల్లల భవిష్యత్తే ముఖ్యం చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన రాణిని మరో పెళ్లి చేసుకోమని ఎవరైనా సలహా ఇస్తే..‘పరాయి పిల్లలను తన పిల్లలుగా చూసే మరో మగాడు ఈ సమాజం లో ఉంటాడా’ అంటూ ఎదురు ప్రశ్ని స్తుంది. ‘నా తల్లి, నేను పడిన కష్టాలు నా పిల్లలు చూడకూడదు’ అంటూ గుండెనిండా ధైర్యాన్ని నింపుకుని మాట్లాడే రాణి ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యంగా చెబుతున్న ఆటోరాణి ఆశయం నెరవేరాలని, చితికిన కుటుంబాన్ని అపురూపంగా మలచుకున్న ఆమె ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. -
మిస్ కర్ణాటక రాణి
సాక్షి, శివాజీనగర : బెంగళూరు నగరానికి చెందిన ఇశ్ ఈవెంట్ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో దావణగెరెకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మిస్ కర్ణాటక కిరీటాన్ని ధరించగా, మండ్య జిల్లా మళవళ్లికి చెందిన సవితా ఎం.శంకర్ మిసెస్ కర్ణాటక కిరీటాన్ని ధరించారు. గత నెల 15 నుంచి మూడు రోజుల పాటు కనకపుర రోడ్డులోని ఓ ప్రైవేట్ రెసార్ట్‌లో ఏర్పాటు చేసిన బ్యూటీ మిసెస్ కర్ణాటక, మిస్ కర్ణాటక పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రేక్షకులతో పాటు పోటీదారులు 600 మందికిపైగా ఇందులో సవితా ఎం.శంకర్ మిసెస్ కర్ణాటక విన్నర్‌గాను, బ్యూటీ మిస్ పోటీలో రాణి గెలుపొందారని ఇశ్ ఈవెంట్ సంస్థ డైరెక్టర్ వీరేశ్ శనివారం మీడియాకు తెలిపారు. పుష్ఫ, వైష్ణవి ద్వితీయ, తృతీయ స్థానంలో గెలుపొందారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో జరిపిన అందాల పోటీల్లో 28 మంది ఎంపికయ్యారన్నారు. డైరెక్టర్ వీరు, ఫ్యాశన్ డిజైనర్ శ్వేతా కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రముఖ సినీ నటుడు సుదీప్ కార్యక్రమ అంబాసిడర్‌గా వ్యవహరించారని తెలియజేశారు. వెంకటేశ్, చామరాజ్, అమరేష్, రఘునందన్ కార్యక్రమ ప్రమోటర్స్‌గా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా మిస్, మిసెస్ కర్ణాటక కిరీటాన్ని ధరించిన రాణి, సవితా, వైష్ణవి విలేకరులతో మాట్లాడుతూ అందాల పోటీలు కేవలం నగరాలకు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలవారికి కూడా అవకాశం కల్పించిన ఈశ్ ఇవెంట్ సంస్థకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అందాల పోటీల్లో ప్రతిభా, క్రీడా, సంప్రదాయ పోటీలు జరుగుతాయని, ఇందులో పాల్గొనటం తమకు ఎంతో ఆనందం కలిగిస్తోందని తెలిపారు. -
అమర ప్రేమ
-
జీవితంలో ఇంతటి ప్రేమ కూడా ఉంటుందా?
సాక్షి, న్యూఢిల్లీ : ఎంతటి అందమైన ముఖమైన యాసిడ్ పోస్తే ఎంత అందవికారంగా, వికతంగా మారుతుందో ఎవరైనా ఊహించలరు. యాసిడ్ దాడికి గురైనా బాధితులను ఇక ప్రత్యక్షంగా చూస్తే అందవికారం ఎంత వికృతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అలాంటి బాధితులను ప్రత్యక్షంగా చూడాలంటే గుండె ఎంతో దిటువుగా ఉండాలి. గుండెలో ఎంతో నిబ్బరం ఉండాలి. యాసిడ్ దాడి బాధితుల పట్ల ఎంత సానుభూతి ఉన్నా వారైనా బాధితుల వంక ఒక్కసారి చూస్తే అబ్బా! అంటూ ముఖం తిప్పేసుకుంటాం. మరోసారి అటువైపు చూడాలంటే మన ముఖం అష్ట వంకరలు తిరగడమే కాకుండా కడుపులో కూడా దేవేస్తుంది. ఓ యాసిడ్ దాడిలో ముఖమంతా వికృతంగా మారిన 26 ఏళ్ల బాధితురాలు ప్రమోదిని రౌల్‌ను సరోజ్ కుమార్ సాహు చూసి అందరిలాగే ముందుగా సానుభూతి చూపించారు. కాలిన గాయాలతో కాళ్లన్ని తొడల వరకు చీము పట్టి పడకకే పరిమితమైన రౌల్ లేచి నడిచేందుకు మరో నాలుగేళ్లు పడుతుందని వైద్యులు చెప్పినప్పుడు పిచ్చిదానిలా ఏడుస్తున్న ఆమె తల్లిని చూసి చలించి పోయారు. మనవంతు కర్తవ్యం నిర్వర్తిస్తే మనకళ్లముందే అమ్మాయి ఆశ్చర్యంగా కోలుకుంటుందని ఆ తల్లికి హితబోధ చేశారు. రెండు కళ్లుకూడా కనించక జీవితమంతా చీకటైందని తల్లి ఒడిలో తలపెట్టుకు ఏడుస్తున్న రౌల్‌ను కూడా తన శక్తిమేరకు ఓదార్చారు. అంగవైకల్యాన్నీ, మొత్తంగా జీవితాన్నే ఓ చాలెంజ్‌గా తీసుకొని నిలబడాలని మనోధైర్యాన్ని నూరిపోశారు. ప్రమోదిని రౌల్ త్వరగా కోలుకునేలా చేయడం కోసం సరోజ్ కుమార్ తాను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆస్పత్రిలో ఆమె పడక పక్కనే కూర్చొని ఆమెకు జీవితం పట్ల ఓ అందమైన భావం కలిగేలా కబుర్లు చెబుతూ వచ్చారు. ఇలా ఆయన మూడున్నర ఏళ్లపాటు అందించిన సేవలు ఫలించి ఆమె ఇప్పుడు తన కాళ్లమై నడవగలుగుతున్నారు. గత సెప్టెంబర్‌లో ఎడమ కంటికి ఆపరేషన్ కూడా చేయడంతో కొద్దిగా ఆమెకు చూపు కూడా వచ్చింది. ఇప్పటికీ ఆమె ముఖానికి ఐదు సర్జరీలు అయ్యాయి. మరో నాలుగు సర్జరీలు అవసరం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కంటి చూపు కొద్దిగా రావడంతో ఆమె తన ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు ధైర్యం చేశారు. సరోజ్ కుమార్ ఇచ్చిన స్ఫూర్తితో కూడదీసుకున్న మనోధైర్యం ఒక్క సారిగా పగిలిన అద్దం వలే ముక్కలయింది. కుప్పకూలిపోయారు. ఇంత వికారంగా ఉన్న తనను ఎందుకు ప్రేమిస్తున్నావని ప్రశ్నించారు. వద్దంటూ బతిమాలారు. తోటి మనిషి పట్ల సానుభూతి, ప్రేమ ఉండడం సహజమన్నారు. ప్రేమకు చిహ్నమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్దకు రౌల్‌ను తీసుకెళ్లినప్పుడు (2016, జనవరి 14న) చేసిన బాసల గురించి గుర్తు చేశారు. మొదట్లో సానుభూతి మాత్రమే ఉండేదని, ఇప్పుడు అది బలమైన ప్రేమగా మారిందని సరోజ్ కుమార్ సాహు చెప్పారు. అయినా ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. జీవితాన్ని నిలబెట్టిన ఓ వ్యక్తి జీవితాన్ని తాను నాశనం చేయలేనని చెప్పారు. అయినా ఆమెకు నచ్చచెప్పిన సరోజ్, ఒడిశాలో ఒంటరైన తన తల్లితో ఇంతకాలం జీవిస్తూ వచ్చిన రౌల్‌ను తదుపరి చికిత్స కోసం తన వెంట ఢిల్లీ తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి ఏడాదిపాటు ఒకే ఇంటి కప్పు కింద జీవిస్తున్నారు. ఇప్పుడు వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘అసలు నా జీవితంలో ఇంత ఔన్నత్యం కలిగిన వ్యక్తిని నేను చూడడం ఇదే మొదటిసారి. నేను 15వ ఏట పదో తరగతి చదువుతున్నప్పుడు నాపై ఓ 28 ఏళ్ల యువకుడు యాసిడ్ దాడి చేశాడు. అప్పటి నుంచి మగాళ్లంటే మృగాళ్లగా ఊహించుకొని ద్వేషం పెంచుకున్నాను. నేను అప్పుడు ఎంతో అందంగా ఉండేదాన్ని. అందుకనే మా అమ్మ నన్ను రాణి అని పిలిచేది. అందుకనే ఆ యువకుడు నా వెంట పడ్డాడు. నేను ఛీత్కరించడంతో నా అందంపై పగబట్టి యాసిడ్ దాడి జరిపాడు. దాడి జరిగిన తర్వాత నాలుగు నెలల పాటు ఒడిశా ఆస్పత్రి ఐసీయులో ఉన్నాను. నాలుగేళ్లపాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అంటే, 2014, మార్చి నెలలో ఓ నర్సును చూడడం కోసం వచ్చిన సరోజ్‌తో పరిచయం అయింది. మొదట్లో ఆయన నన్ను చూసి చూడనట్లు వెళ్లిపోయేవారు. ఓ రోజున మా అమ్మ, నేను ఏడుస్తున్నప్పుడు తానే చొరవ తీసుకొని మమ్మల్ని ఓదార్చారు. 2016, జనవరిలో నన్ను తాజ్‌మహల్ తీసుకెళ్లినప్పుడు పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. నేను ఒప్పుకోకున్నా ఒప్పించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానన్న ఆనందం నాకు జీవితం పట్ల రెట్టింపు ధైర్యాన్ని ఇస్తోంది’ అని రౌల్ తన కథను క్లుప్తంగా వివరించారు. దాదాపు 11 ఏళ్ల క్రితం రౌల్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఆమెకు చిన్పప్పుడే తండ్రి చనిపోవడంతో ఛాన్వ్ ఫౌండేషన్‌లో పనిచేస్తున్న ఆమె తల్లి ఆమెను పెంచింది. పదవ తరగతిలోనే ఆమెపై యాసిడ్ జరగడంతో చదువు అంతటితోనే ఆగిపోయింది. ఛాన్వ్ ఫౌండేషన్ అందించిన ఆర్థిక సహాయంతో ఆమె ఇంతకాలం ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయంచుకున్నారు. ఇప్పుడు ఆమెకు ఢిల్లీలో అయ్యే వైద్య ఖర్చులను సరోజ్ కుమార్ ఎక్కడి నుంచి తెస్తారో ఆయనకే తెలియాలి. చేస్తున్న ఉపకారాన్ని చెప్పుకునే మనస్తత్వం కాదు ఆయనది. యాసిడ్ దాడితో మృగాళ్లను మగాళ్లుగా పిలుస్తున్న సమాజంలో మంచి మనస్తత్వంతో నిజమైన మగాడిగా ముందుకొచ్చి సరోజ్ కుమార్ మృగాళ్లకూడా కనువిప్పు కలిగిస్తున్నారు. -
ఇంటికి వెళ్లను.. నన్ను చంపేస్తారు..
►రోజుకు 16 గంటలు పనిచేస్తున్నా ►అమ్మానాన్నలు చిత్రహింసలు పెడుతున్నారు ►పోలీసులను ఆశ్రయించిన బాలిక అమీర్‌పేట: మా అమ్మానాన్నలు రోజుకు నాతో 16 గంటలు పనిచేయిస్తున్నారు..ఒళ్లు హూనమైపోతోంది.. వెళ్లకపోతే చిత్రహింసలు పెడుతున్నారు..నన్ను చంపేస్తారు’ అంటూ ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సొంత తల్లి, సవతి తండ్రి బాలికతో వెట్టిచాకిరీ చేయిస్తూ వచ్చే సంపాదనను దర్జాగా ఖర్చుచేస్తున్నారు. బడికి వెళ్లాల్సిన బాలిక భారంగా బతుకులాగుతోంది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. రాజమండ్రికి చెందిన పుష్ప బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనుక నివాసముంటోంది. భర్తను వదిలిపెట్టిన ఆమె అంకిరెడ్డి అనే వ్యక్తితో జీవనం సాగిస్తోంది. మొదటి భర్త కూతురు అయిన రాణి (11)కూడా వారితోపాటే ఉంటోంది. తల్లిదండ్రులు బాలిక చదువు మాన్పించి ఒక ఇంటర్నెట్ సెంటర్, రెండు హాస్టళ్లలో పనిచేయిస్తున్నారు. దాదాపు రోజుకు 16 గంటలపాటు వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.అలా వచ్చే నాలుగు వేల రూపాయలను సైతం తీసుకుని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తాను పనికి వెళ్లనని రాణి చెప్పింది. ఆగ్రహించిన తల్లి, సవతితండ్రి ఇనుప కత్తెరతో ఎడమ కన్నుపై తీవ్రంగా దాడిచేశారు. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ బాధలు భరించలేక నేరుగా ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తల్లి పుష్ప, సవతి తండ్రి వలన తనకు ప్రాణభయముందని, వారితో ఉండనని పోలీసులను వేడుకుంది. అయితే ఈ విషయంపై పోలీసులు ఆదివారం రాజీ కుదిర్చి బాలికను తల్లి, హాస్టల్ నిర్వాహకులతో పంపినట్లు తెలిసింది. రాజీ చేయడమేమిటి: బాలల హక్కుల సంఘం తనకు ప్రాణభయం ఉందని బాలిక కన్నీరు పెట్టుకున్నా తల్లితో రాజీ కుదిర్చి తిరిగి పంపించడం ఏమిటని బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షురాలు అనురాధరావు మాట్లాడుతూ వెంటనే బాలికను రక్షణ కల్పించి తల్లి,సవతి తండ్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. చాకిరి చేయించుకున్న ఇంటర్నెట్, çహాస్టల్స్ నిర్వాహకులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శిశుసంక్షేశాఖ అధికారులకు సమాచారమిచ్చాం బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై ధర్యాప్తు జరుపుతున్నామని ,చిత్రహింసలు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపారు. స్త్రీశిçశుసంక్షేమశాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. -
అడవిలో యువతి సజీవదహనం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి సమీపంలోని అడవిలో ఓ యువతిని సజీవదహనం చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జాకారం గ్రామానికి చెందిన ఎస్తి రాణి(18)గా గుర్తించారు. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆమె అదృశ్యమైంది. బుధవారం సజీవదహనమై కనిపించింది. పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
హైదరాబాద్‌కు రాణి రుద్రమదేవి పయనం
జీవకళ ఉట్టిపడుతున్న శిల్పం రాజ్‌కుమార్ శిల్పశాలలో రూపకల్పన కొత్తపేట : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో నెలకొల్పేందుకు రాణి రుద్రమదేవి విగ్రహాన్ని కొత్తపేట నుంచి బుధవారం తరలించారు. హైదరాబాద్ మాదాపూర్ సమీపంలోని కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. రుద్రమదేవి విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్‌కు కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అప్పగించింది. దీంతో వుడయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విగ్రహాన్ని రూపొందించారు. రుద్రమదేవి విగ్రహం ద్వారా ‘ఆచార్య’ పురస్కారం తాను రుద్రమదేవి విగ్రహాన్ని తొలిసారి 2004లో వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి తయారు చేశానని శిల్పి రాజ్‌కుమార్ తెలిపారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అప్పటి గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే ద్వారా ’ఆచార్య’ గౌరవ పురస్కారాన్ని ఆ యూనివర్సిటీ తనకు అందజేసిందని చెప్పారు. తరువాత రుద్రమదేవి పరిపాలన సాగించిన వరంగల్ కోట వద్ద, 2005లో వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నెలకొల్పిన విగ్రహాలను తానే రూపొందించానన్నారు. ఇది నాల్గవ విగ్రహమన్నారు. సజీవ శిల్పాల రూపశిల్పి రాజ్‌కుమార్ తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజ్‌కుమార్ నెలకొల్పిన విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయని కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి వి.ఎస్.ఆర్.గాంధీ అభినందించారు. తెలంగాణలో రాజ్‌కుమార్ తయారు చేసిన రుద్రమదేవి, జయశంకర్, చాకలి ఐలమ్మ తదితరుల అనేక విగ్రహాలు పరిశీలించిన తరువాత ఈ విగ్రహం బాధ్యతను ఆయనకే అప్పగించామన్నారు.77.15 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంతానికి 2012లో కాకతీయ హిల్స్‌గా నామకరణం చేశామని తెలిపారు. ముఖద్వారంలో 72 అడుగులు వెడల్పు, 24 అడుగులు ఎత్తులో ఆర్చ్ నిర్మించామని, అక్కడే ఈ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ఈ నెలలోనే విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
సంతానం కోసం వెళితే దారుణం..
-
సంతానం కోసం వెళితే దారుణం..
చైతన్యపురి: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ ప్రాణంపైకి తెచ్చింది... సంతానం కోసం శస్త్ర చికిత్స చేసిన వైద్యుల పుణ్యమా అని ఆమె వెంటిలేటర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. చైతన్యపురి ఠాణా పరిధిలో ఈ ఘటన జరి గింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త కథనం ప్రకారం... నల్ల గొండ జిల్లా చౌటుప్పల్‌లో సాయిజ్యోతి ఆసుపత్రి డాక్టర్ సుమన్ కల్యాణ్‌కు 2007లో సాయిజ్యోతి (36) తో పెళ్లైంది. ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు సాయిజ్యోతి చూసుకుంటోంది. వీరికి సంతానం కలగకపోవడంతో నాగోలు చౌరస్తాలోని సృజన సంతాన సాఫల్య కేంద్రం వైద్యులు సౌజన్య, రాణి, శ్రీశైలేష్ విఠల్‌లను సంప్రదించారు. చిన్నపాటి శస్త్ర చికిత్స చేస్తే సంతానం కలుగుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఈనెల 12వ తేదీ సాయంత్రం సాయిజ్యోతి, సుమన్్ దంపతులు సృజన ఆసుపత్రికి వెళ్లారు. ఆపరేషన్ కు ముందు వైద్యు లు స్వప్న, శ్రీకాంత్‌లు సాయిజ్యోతికి అనస్థీషియా (మత్తు) ఇచ్చారు. శస్త్ర చికిత్స ప్రారంభించిన వైద్యులు సాయిజ్యోతి పరిస్థితి విషమించినట్టు గుర్తించారు. అదే రోజు రాత్రి ఓమ్నీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు తమ వల్ల కాదని చెప్పడంతో 13వ తేదీన ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఫిట్స్ రావడంతో సాయిజ్యోతి పరిస్థితి విషమంగా మారడం తో వెంటిలేటర్ అమర్చారు. రెండు వారాలుగా చికిత్స చేస్తున్నా.. ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో భర్త సుమన్ కల్యాణ్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి వైద్యులు సృజన, శ్రీ శైలేష్ విఠల్, రాణి, అనస్థీషియా వైద్యులు స్వప్న, శ్రీకాంత్‌ల నిర్లక్ష్యం వల్లే తన భార్య ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణంపైకి వచ్చిందని సుమన్ కల్యాన్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నడుచుకుంటూ వెళ్లిన తన భార్యను స్పృహలేని స్థితిలో మరో ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరికి ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామన్నారు. కాగా దీనిపై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరేందుకు ప్రయ త్నించగా వారు అందుబాటులోకి రాలేదు. -
భర్తే హత్య చేశాడు..
{పమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం పోలీసు విచారణలో నేరం అంగీకారం నిందితుడి అరెస్టు జగ్గయ్యపేట : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కేసులో భర్త గిడుగు వెంకట నారాయణను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు బుధవారం తెలిపారు. వివరాలు.. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన వెంకట నారాయణకు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మునగోటి రాణితో 45 రోజుల క్రితం వివాహమైంది. నల్గొండ జిల్లా మేళ్లచెర్వు గ్రామానికి బంధువుల ఇంటి ఈ నెల 8న వెళ్లారు. తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా పట్టణంలోని బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైందని వెంకట నారాయణ భార్య రాణిని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. అయితే ప్రభుత్వ వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వివరించారు. దర్యాప్తులో భాగంగా భర్త వెంకట నారాయణ జాతీయ రహదారిపై ఫుడ్‌ప్లాజా వద్ద ఉన్నట్లు సమాచారం రావటంతో సిబ్బంది వెళ్లి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అతనిని విచారించగా నిత్యం తన భార్య అనుమానిస్తుండేదని దీంతో తరచు గోడవ పడేదని ఈ క్రమంలోనే బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా బైపాస్ రోడ్డులోని పొలాల్లోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు నేరం అంగీకరించినట్లు చెప్పారు. పైగా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా నారాయణ ప్రయత్నించాడన్నారు. అరెస్ట్ చేసిన నారాయణను పేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
పెళ్లయిన 45 రోజులకే..
యువతి అనుమానాస్పద మృతి భర్తే హత్య చేశాడంటున్న బంధువులు పోలీసుల అదుపులో మృతురాలి భర్త జగ్గయ్యపేట : తల్లి ప్రేమకు నోచుకోకున్నా అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తెకు ఆ తండ్రి ఘనంగా వివాహం చేశాడు. కుమార్తె జీవితం బావుంటుందని రాజధాని ప్రాంతంలో అరెకరం పొలం లాంఛనంగా ఇచ్చాడు. అయితే పెళ్లయిన 45 రోజులకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో కన్నతండ్రి భోరున విలపించాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.... పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన జిడుగు వెంకట నారాయణకు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మునగోటి రాణి (18)తో 45 రోజుల క్రితం వివాహమైంది. నూతన దంపతులు బుధవారం ఉదయం నల్గొండ జిల్లా మేళ్లచెరువు గ్రామంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. రాత్రి సమయంలో తిరిగి పెనుగంచిప్రోలు బయలుదేరారు. అయితే జగ్గయ్యపేట బైపాస్ రోడ్డులో తన ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై రాణి గాయపడిందంటూ ఆమెను తన స్నేహితుడి సాయంతో వెంకటనారాయణ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో రెండు వైపుల బంధువులకు వెంకటనారాయణే సమాచారం ఇచ్చాడు. రాణి తండ్రి మునగోటి ప్రసాద్, పెదనాన్న దేవరకొండ బ్రహ్మం హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి నిర్జీవంగా పడివున్న రాణిని చూసి భోరున విలపించారు. ఆమె మెడపై ఉరివేసినట్టు కమిలిన గుర్తు ఉండటంతో భర్తే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడంటూ రాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.ఎల్.రావు, అదనపు ఎస్ఐ వి.వి.రావు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. నందిగామ డీఎస్పీ ఉమా మహేశ్వరరావు గురువారం ఉదయం రాణి మృతదేహాన్ని పరిశీలించి బంధువులను అడిగి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. భర్తే హత్య చేశాడు.. ఒక్కగానొక్క కూతురువి.. తల్లి లేకపోయినప్పటికీ అల్లారుముద్దుగా పెంచుకున్నా.. సంసారం బావుంటుందని బంధువుకే ఇచ్చి పెళ్లిచేస్తే కాళ్ల పారాణి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండిపోయాయా తల్లీ అంటూ రాణి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తెను భర్తే హత్య చేశాడని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాణి భర్త వెంకట నారాయణ పోలీసుల అదుపులో ఉన్నాడు. భార్య మృతికి తానే కారణమని పోలీసుల ముందు ఒప్పుకున్నాడని సమాచారం. -
ఆటోలో గర్భిణి ప్రసవం
పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలిస్తున్న మహిళ ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన భువనగిరిలో గురువారం చోటు చేసుకుంది. వెలిగొండ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన కొమ్ము రాణి(30)పురిటి నొప్పులతో బాధ పడుతుండటంతో స్థానికులు ఆటోలో భువనగిరికి ఏరియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలోనే ప్రసవించింది. పండంటి మగ బిడ్డకు జన్మన్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
మదనపల్లె: బస్సుల్లో ప్రయాణిస్తున్నవారితో పరిచయం చేసుకొని చాకచక్యంగా వారి వద్ద నుంచి బ్యాగులను దొంగలించడంతో పాటు బంగారు దుకాణాలకు కొనుగోలు దారులుగా వెళ్లి యజమాని దృష్టి మరల్చి చోరీలను పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు శనివారం వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కలికిరి గ్రామానికి చెందిన రాణి(30) మంగమ్మ(50) అనే ఇద్దరు మహిళలు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
ఆ నటి క్షేమమేనట
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ , ఆదిత్య చోప్రా భార్య రాణి ముఖర్జీ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. రాణి ఇటీవల దీపావళి సంబరాల సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో జరిగిన వేడుకల్లో రాణి ముఖర్జీ తీవ్రంగా అలసిపోయి, కళ్లు తిరిగి పడిపోయారనే వార్తలు బాలీవుడ్ లో షికారు చేశాయి. దీనిపై ఆమె ప్రతినిధి స్పందిస్తూ... ప్రస్తుతం రాణీ ముఖర్జీ క్షేమంగానే ఉన్నారని, అంతా బాగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణ అవసరమన్నారు. ఆమెకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యుల సలహాపై గురువారం వరకు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారన్నారు. కాగా కుచ్ కుచ్ హోతా హై హీరోయిన్ గత ఏడాది దర్శకుడు ఆదిత్య చోప్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాణి ముఖర్జీ గర్భవతి. 2016 జనవరిలో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. -
ఇద్దరు కి'లేడీ'ల అరెస్ట్..!
చిత్తూరు అర్బన్: ప్రయాణికుల్లా బస్సుల్లో రాకపోకలు సాగిస్తూ అదను చూసి పక్కవారి ఆభరణాలను కొట్టేయడం.. ఆ డబ్బుతో జల్సాలు చేయడం వృత్తిగా ఎంచుకున్న ఇద్దరు యువతుల్ని చిత్తూరు టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం మైసూరు సిటీలోని ఎరగనహళ్లికి చెందిన టీఆర్.చిన్నమ్మ అలియాస్ ఆష, రాణి, శివపుత్రుడు అలియాస్ శివ ముగ్గురూ దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నారు. పుంగనూరు, చిత్తూరు, తిరుపతి రైల్వే స్టేషన్లలో పలు చోరీలకు పాల్పడ్డారు. బస్టాపులు, రైల్వే స్టేషన్లు, బస్సుల్లో రద్దీగా ఉన్న ప్రయాణికుల హ్యాండ్ బ్యాగులు కత్తిరించి చోరీలు చేయడం, నిద్రపోతున్న వారి బంగారు ఆభరణాలు దొంగిలించడంలో వీరు దిట్ట. గురువారం నగరంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు. ఇప్పటి వరకు పలు చోరీలకు పాల్పడి కూడబెట్టిన 200 గ్రాముల బంగారాన్ని, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. -
విద్యుదాఘాతంతో దంపతుల మృతి
గిద్దలూరు (ప్రకాశం జిల్లా): ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఎంపాలెంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన లక్ష్మయ్య (35), రాణి (30) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున పనులకు వెళ్లే తొందరలో ఉతికిన బట్టలను ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు రాణి విద్యుదాఘాతానికి గురైంది. అప్పుడే నిద్రలేచిన భర్త ఇది గమనించి భార్యను రక్షించాలనే తొందరలో వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. దీంతో భార్యభర్తలిద్దరూ విద్యుదాఘాతానికి బలయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన దంపతులకు ఆరేళ్ల కుమారుడున్నట్లు సమాచారం. -
ఇంటి ముందు పడుకుంటే...
హిసార్: హర్యానాలోని హిసార్‌లో గురువారం రాత్రి దారుణం జరిగింది. కొడుకుతో పాటు ఇంటిముందు నిద్రిస్తున్న ఓ 45 ఏళ్ల మహిళపై కారు ఎక్కించడంతో ఇద్దరూ చనిపోయారు. పెహల్వాన్ చౌక్ ప్రాంతంలో తన ఇంటి ముందు రాణి, ఆమె కొడుకు వివేక్ పడుకున్నారు. పొరుగున ఉండే జస్ దీప్ సంధూ వారిపై తన ఎస్‌యూవీని ఎక్కించేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో పాటు బాధితులు ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో సందూ కారునే అక్కడే వదిలేసి పారిపోయాడు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను శవపరీక్షకు పంపించారు. -
అమ్మతనం..
చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఈమె పేరు ఇస్లావతుల రాణి. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం చుండ్రుపట్ల గ్రామానికి చెందిన రాణి ఏలూరులోని ఎస్‌పీడీబీటీ కాలేజీలో శనివారం సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె భర్త కూడా డీఎస్సీ పరీక్ష రాస్తుండటంతో బిడ్డను చూసే వారు లేక తనతో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చింది. మరోవైపు టీచర్ నియామకాలకు (డీఎస్సీ-2014) సంబంధించి శనివారం నిర్వహించిన పరీక్షకు 88.66 శాత ం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎస్జీటీ ప్రశ్నపత్రంలో చైల్డ్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు అభ్యర్థులను బాగా తికమకపెట్టాయి. - నేడు మదర్స్ డే -
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
ఇంద్రవెల్లి : పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతురాలి బంధువులు మృతదేహంతో ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం..మృత్యురాలు సుర్నార్ రాణి (25)కి గత మూడేళ్ల క్రితం చంద్రపూర్ జిల్లా హెర్వ గ్రామానికి చెందిన సుర్నార్ చంద్రకాంత్‌తో వివాహమైంది. రెండేళ్లుగా సంసారం సాఫీగా సాగగా, అదనపు కట్నం కోసం భర్త చిత్రహింసలు పెట్టేవాడు. 20 రోజుల క్రితం ఆమెను శారీరకంగా హింసించి, గర్భవతి అని కూడా చూడకుండా కొట్టడంతో అనారోగ్యానికి గురైంది. దీంతో భర్తే హర్కపూర్ అంద్‌గూడలోని తల్లిగారి ఇంటికి తీసుకెళ్లి వదిలేశాడు. తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. భర్త కొట్టిన దెబ్బలకు కడుపుల్లో బిడ్డ మృతి చెందింది. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ సుర్‌నార్‌రాణి బుధవారం మృతి చెందింది. కాగా ఆమెను హింసించిన భర్తపై చర్యలు తీసుకోవాలని 20 రోజుల క్రితమే స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు స్పందించలేదని వారు కుటుంబీకులు ఆరోపించారు. రాణి మృతి కారణమైన భర్త చంద్రకాంత్ వచ్చే వరకు ఆందోళన విరవించేదిలేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వరులు, సీఐ స్వామి అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. మృత్యురాలి భర్త, అత్త, మామలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కూడా అక్కడికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. అనంతరం మృత్యురాల తండ్రి డెప్‌కుండే కేశవ్ ఫిర్యాదు మేరకు తహశీల్దార్ చిత్రు, డీఎస్పీ, సీఐ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి శవ పరీక్ష నిమ్మిత్తం రిమ్స్‌కు తరలించారు. మృత్యురాలికి రెండేళ్ల కుమారుడు మహేశ్ (2)ఉన్నారు. దీంతో హర్కపూర్‌లో కొత్త సంవత్సరం రోజే విషాధచాయలు అములుకున్నాయి. -
ప్రేమ పెళ్లి చేసుకుందని సోదరి గొంతు కోశారు
ఒంగోలు: ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో సోదరిని చంపేం దుకు అన్నలు ప్రయత్నించారు. ఈ దారుణం ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం జరిగింది. మద్దిపాడు మండలం రాచవారిపాలేనికి చెందిన కూచిపూడి ఇమ్మానియేలు(23), రాణి (21) ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఇరువైపులా పెద్దలకు ఇష్టం లేదు. ఇద్దరూ ఒంగోలులోని పులి వెంకటరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాణి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ. రాణి ప్రేమపెళ్లి చేసుకోవడం నచ్చని ఆమె సోదరులు రాము, భాస్కర్, రత్తయ్య కలసి బుధవారం ఇంటికి వెళ్లి కత్తితో ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవటంతో వారు పారిపోయారు. అప్పటికే ఆమె గొంతుపై బలమైన గాయం కాగా స్థానికులు రాణిని ఆస్పత్రికి తరలించారు. -
‘సర్వే’పై సవాలక్ష అనుమానాలు!
చర్చావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేపై తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పలు అనుమానాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫిలింనగర్ ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా భవన్లో శుక్రవారం చర్చావేదికను నిర్వహించారు. స్థానిక ఇంటింటి సమగ్ర సర్వే క్లస్టర్ ఆఫీసర్లు మల్లెల గిరి, జయకృష్ణతో పాటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ లక్ష్మీబాయి, ఫిలింనగర్ 18 బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగరావుతో పాటు 32 స్వయం సహాయక బృందాల అధ్యక్షురాళ్లు ఇందులో పాల్గొన్నారు. పలు అనుమానాలను వ్యక్తం చేయగా... వాటిని అధికారులు నివృత్తి చేశారు. బంజారాహిల్స్: ఇంటింటి సర్వే నిమిత్తం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లు పూర్తి స్నేహభావంతో మెలుగుతూ వివరాలు నమోదు చేసుకోవడమే కాకుండా వారికి వచ్చే అపోహలు కూడా తొలగిస్తారని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరూ అందుబాటులో లేకపోయినా వారికి సంక్షేమ పథకాలు అందవని అంటున్నారని ప్రజ్వల గ్రూప్ అధ్యక్షురాలు సాంబమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. యజమాని సరైన వివరాలు ఇస్తే చాలని క్లస్టర్ ఆఫీసర్ జయకృష్ణ వెల్లడించారు. సర్వే చేసే ఎన్యూమరేటర్లు అణువనువూ సోదా చేస్తారని వదంతులు వినిపిస్తున్నాయని సరస్వతి మహిళా గ్రూప్ అధ్యక్షురాలు సుగుణ, మహాలక్ష్మి గ్రూప్ అధ్యక్షురాలు చంద్రమ్మ, గంగ గ్రూప్ అధ్యక్షురాలు పద్మమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకున్నామని రెక్కాడితో డొక్కాడని స్థితిలో ఉన్నామని ఈ పరిస్థితిలో తెల్లరేషన్ కార్డు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నామని ధనలక్ష్మి గ్రూపు అధ్యక్షురాలు ధనలక్ష్మి, కనకదుర్గ గ్రూప్ అధ్యక్షురాలు పద్మ, తేజస్విని గ్రూప్ అధ్యక్షురాలు గోవిందమ్మ, జ్యోతి గ్రూపు అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, కుందన గ్రూప్ అధ్యక్షురాలు కౌసల్య వాపోయారు. తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఎన్నడూ లేని విధంగా ఈ సర్వే ఏంటంటూ పలువురు మహిళలు దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతా నంబర్లు ఇస్తే ప్రమాదం కదా అని శ్రీ రాజరాజేశ్వరి గ్రూప్ అధ్యక్షురాలు రమ్య ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద వారిని వదిలేసి మాలాంటి వాళ్లను లక్ష్యంగా పెట్టుకుంటారా అని బీజేఆర్ నగర్ సమాఖ్య అధ్యక్షురాలు మల్లీశ్వరి, బసవతారకం నగర్ సమాఖ్య అధ్యక్షురాలు యాదీశ్వరి అన్నారు. బడుగులకు వేధింపులా? సర్వే రోజున కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ సర్వే ఎందుకో తెలియడం లేదు. మా కార్డులు తొలగిస్తారని భయంగా ఉంది. బడుగులను వేధించకుండా బడాబాబులను లక్ష్యంగా పెట్టుకుంటే మంచిది. - ఆర్.విజయరత్నం, శ్రీ రాజరాజేశ్వరి మహిళా గ్రూపు ఆందోళన వద్దు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితమైన సమాచారం ప్రజల నుంచి స్వీకరించడానికే సర్వే జరుగుతున్నది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్ అంచనా వేయడానికి సర్వే చేస్తున్నాం. - మల్లెల గిరి, సర్వే క్లస్టర్ అధికారి -
అంగన్వాడీలు..ఇక ఫుల్‌టైమ్
దోమ, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలు పూర్తి సమయం పనిచేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సైతం పెంచారు. కేంద్రం నుంచి వచ్చే 75శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 25శాతం నిధులతో నడుస్తున్న ఈ కేంద్రాలు ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సి ఉంది. పని వేళల్లో మార్పు చేసిన కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలను కూడా స్వల్పంగా పెంచారు. ఇప్పటివరకు కార్యకర్తలకు ఇస్తున్న రూ.3,700 వేతనాన్ని రూ4,200కు, ఆయాల ఇస్తున్న రూ.1,950 వేతనాన్ని రూ.2,200కు పెంచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,500 వరకు అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. పరిగి ప్రాజెక్టు పరిధిలో ఉన్న దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరు మండలాల్లో మొత్తం 230 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలను ప్రారంభించారు. అదనపు పనులు అంగన్వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేసిన ప్రభుత్వం ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు చేపడుతున్న పనులు, అందిస్తున్న సేవలలోనూ మార్పులు చేసింది. ఇప్పటివరకు అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించడం, పౌష్టికాహారం సరఫరా చేయడం, బాలింతలు, గర్భిణులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వడం, జనన, మరణాల సంఖ్యను నమోదు చేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, ఏఎన్ఎంలతో కలిసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, కుటుంబ వివరాల సేకరణ వంటి పనులు చేసేవారు. ఇకపై వారు సామాజిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఆయా గ్రామాల్లో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించేందుకు వీలుగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసే బాధ్యతను కూడా అంగన్వాడీ సిబ్బందికి అప్పగించింది. అంగ న్వాడీల ద్వారా ఇస్తున్న పౌష్టికాహార పంపిణీలోనూ కొంత మార్పు చేశారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఇప్పటివరకు వారానికి రెండు గుడ్లు ఇచ్చే వారు. ఇకపై వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. అంగన్వాడీల ఆగ్రహం పని వేళలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నామమాత్రంగా వేతనాలు పెంచిన ప్రభుత్వం తమతో వెట్టి చేయించుకోవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయమని తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో అంగన్వాడీలు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆదేశాలు జారీ చేశాం అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు కొనసాగించాలని ప్రభుత్వం ఇటీవలే జీఓ నెం.24 జారీ చేసింది. మారిన పనివేళలకు అనుగుణంగా కొనసాగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అయితే పలు కారణాలతో సిబ్బంది 4గంటల వరకు పనిచేయడానికి అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. - రాణి, అంగన్వాడీ సూపర్వైజర్, కుల్కచర్ల మండలం