పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలిస్తున్న మహిళ ఆటోలోనే ప్రసవించింది.
పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలిస్తున్న మహిళ ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన భువనగిరిలో గురువారం చోటు చేసుకుంది. వెలిగొండ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన కొమ్ము రాణి(30)పురిటి నొప్పులతో బాధ పడుతుండటంతో స్థానికులు ఆటోలో భువనగిరికి ఏరియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలోనే ప్రసవించింది. పండంటి మగ బిడ్డకు జన్మన్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.