
కర్ణాటక: కోచ్ భార్య మహిళా అథ్లెట్‌పై దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బిందురాణి అనే అథ్లెట్ ప్రాక్టీస్ కోసం కంఠీరవ స్టేడియం వెళ్లారు. అక్కడ శ్వేత అనే మహిళ బిందురాణిని నోటికొచ్చినట్లు తిట్టి చేయి చేసుకున్నారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కోచ్‌ల గ్రూప్‌లో ప్రైవేట్ కార్యక్రమం వీడియోను బిందు షేర్ చేసిందని, తప్పుడు వీడియోను షేర్ చేస్తావా అంటూ కోచ్ యతీశ్ భార్య శ్వేత దాడి చేసినట్లు తెలిసింది. ఆమైపె తాను అథ్లెటెక్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బిందురాణి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment