దేవవాసు సినిమాలో ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’ అంటూ విషాదగీతాన్ని ఆలపించి తెలుగు ప్రేక్షకులతో కంటతడి పెట్టించిన సీనియర్ గాయని కె రాణి (75) కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రాణి.. హైదరాబాద్, కళ్యాణ్ నగర్‌లోని తన కుమార్తె విజయ నివాసంలో శుక్రవారం రాత్రి తొమ్మది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు