devadasu
-
శిశువు ప్రాణం తీశారు
సాక్షి ,బొమ్మలసత్రం(కర్నూలు): నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన శిశువు ప్రాణం తీసింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డ మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చెన్నమ్మకు నెలలు నిండటంతో భర్త దేవదాసు కాన్పు కోసం సోమవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆమెకు పరీక్షలు నిర్వహించి బిడ్డ ఆరోగ్యం బాగుందని రాత్రిలోగా కాన్పు చేస్తామని చెప్పారు. రాత్రంతా చూసినా పురిటి నొప్పులు రాలేదు. ఉదయం కాల కృత్యాలు తీర్చుకునేందుకు చెన్నమ్మ బాత్రూంకు వెళ్లగా అందులో నీరులేదు. దీంతో ఆమె మెట్లు దిగి కింద అవుట్ పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్‌కు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడే కాన్పు కావడంతో సిబ్బంది తల్లీబిడ్డను కాన్పుల వార్డుకు తరలించారు. అయితే, డ్యూటీలో ఉండాల్సిన వైద్యురాలు ముందుగానే ఇంటికి వెళ్లిపోయింది. దీంతో చికిత్స అందించే వారు ఎవరూ లేక ఉమ్ము నీరు తాగిన పసిబిడ్డ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. వైద్యులే మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని చెన్నమ్మ, దేవదాసు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాన్పు సమయంలో విధులు నిర్వహించాల్సిన వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో చికిత్స అందలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మూడేళ్ల క్రితం చెన్నమ్మ మొదటి కాన్పు కోసం 108లో వస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవమైంది. ఆసుపత్రికి బిడ్డను తీసుకునే వచ్చేలోగా మృతిచెందినట్లు ఆ దంపతులు గుర్తుచేసుకుని బోరున విలపించారు. వైద్యురాలిపై విచారణకు ఆదేశించాం డ్యూటీలో వైద్యురాలు లేక పోవటంతో బిడ్డ మృతి చెందినట్లు అందిన ఫిర్యాదు నేపథ్యంలో డాక్టర్‌పై విచారణకు ఆదేశించాం. వైద్యురాలు నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –విజయ్‌కుమార్, సూపరింటెండెంట్ -
‘దేవదాస్’ బ్యూటీ రష్మిక మందన్న
-
దాసు.. ఏంటి సంగతి
దేవ (నాగార్జున) డాన్. దాసు (నాని) డాక్టర్. డాన్కీ, డాక్టర్‌కీ స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిశారు. దేవ మందు తాగేందుకు సిద్ధం అవుతుంటే దాసు కూడా గ్లాస్ పట్టుకొచ్చి ‘నాక్కూడా’ అంటూ సైగ చేశాడు. దాసు గ్లాసులో మందు పోసిన దేవ అందులోకి ‘సోడా కావాలా? వాటర్ కావాలా?’ అని అడిగి వాటికోసం వెనక్కి తిరుగుతాడు. అంతలోపే దాసు ఆత్రంగా గ్లాసులోని మద్యం తాగేసి మిన్నకుండిపోతాడు. మళ్లీ మందు పోసిన దేవ ‘సోడా కావాలా? వాటర్ కావాలా? అంటుండగానే మరో గ్లాసు మద్యం తాగేస్తూ దొరికిపోతాడు దాసు. అప్పుడు.. ‘దాసు.. ఏంటి సంగతి’ అని దేవ ప్రశ్నిస్తాడు. ఇదీ ‘దేవదాసు’ చిత్రం టీజర్లో కనిపించిన సరదా సన్నివేశం. నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ ‘దేవదాసు’. రష్మికా మండన్న, ఆకాంక్షా సింగ్ కథానాయికలు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘‘ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 27న చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: సి. ధర్మరాజు, కెమెరా: శ్యామ్ దత్ సైనూద్దీన్, సంగీతం: మణిశర్మ. -
సీనియర్ గాయని కె రాణి కన్నుమూత
-
టాలీవుడ్‌కు మరో షాక్.. గాయని మృతి
దేవవాసు సినిమాలో ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’ అంటూ విషాదగీతాన్ని ఆలపించి తెలుగు ప్రేక్షకులతో కంటతడి పెట్టించిన సీనియర్ గాయని కె రాణి (75) కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రాణి.. హైదరాబాద్, కళ్యాణ్ నగర్‌లోని తన కుమార్తె విజయ నివాసంలో శుక్రవారం రాత్రి తొమ్మది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. శ్రీలంక జాతీయగీతాన్ని ఆలపించి అరుదైన ఘనత సాధించిన్న రాణి తొమ్మిదేళ్ల వయసులోనే సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగులో దాదాపు 500లకు పైగా పాటలను ఆలపించారు. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ,బెంగాలీ, సిన్హలా, ఉజ్జెక్ తదితర భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. రూపవతి సినిమాతో తెలుగులో తన కెరీర్‌ను మొదలు పెట్టిన రాణి.. బాటసారి, జయసింహ, ధర్మదేవత, లవకుశ తదితర సూపర్‌హిట్ చిత్రాల్లో పాటలు పాడారు. జాతీయ కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ ఆమెను ‘ఇన్నిసాయ్ రాణి’ అంటూ కీర్తించారు.1951లో గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకున్న తరువాత సినీ సంగీతానికి దూరమయ్యారు. సర్వేపల్లి రాధకృష్ణగారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్లో ప్రదర్శన ఇచ్చిన ఘనత కూడా కె.రాణి సొంతం. ఆమె మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
టాలీవుడ్లో మరో ‘దేవదాసు’?
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగార్జునకు సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా నానికి జోడీగా రష్మికా మందన యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65 శాతానికి పైగా పూర్తయ్యింది. నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించనున్న ఈ సినిమాకు దేవదాసు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్లో దేవదాసు పేరుతో మూడు సినిమాలు వచ్చాయి. దేవదాస్ నవల ఆధారంగా ఏఎన్నార్, కృష్ణలుదేవదాసు పేరుతో సినిమాలు చేశారు. ఈ జనరేషన్లో రామ్ హీరోగా వైవీయస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు సినిమా రూపొందింది. ఇప్పుడు మరోసారి నాగార్జున, నానిల మల్టీస్టారర్‌కు దేవదాసు టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ టైటిల్ పై అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
స్వర్గంలో దేవదాస్
స్వర్గంలోని ‘హెవెన్స్టార్ లెవెన్స్టార్ పార్క్’ అది. పార్క్‌లో ఒక మూల బెంచీపై కూర్చొని ఎత్తిన సీసా దించకుండా చాలా సిన్సియర్‌గా మందు కొడుతున్నాడు దేవదాస్. అటువైపుగా వచ్చిన పార్వతి దేవదాస్‌ను చూసింది. ‘‘దేవదాను చూసి ఎన్ని దశాబ్దాలైందో!’’ అనుకుంటూ బెంచీ వెనక్కి వెళ్లి దేవదాస్ కళ్లు మూసి...‘‘దేవదా... నేనెవరో చెప్పుకో చూద్దాం’’ అని చిలిపిగా అడిగింది.‘‘నువ్వెవ్వరో చెప్పుకోలేనుగానీ... నువ్వు చేపలపులుసుతో భోజనం చేశావని మాత్రం చెప్పగలను. చేతులను మంచి సోప్‌తో కడుక్కొని ఉండాల్సింది’’ అన్నాడు దేవదాస్.‘‘నేను ఏ పులుసుతో తింటే నీకేంగానీ...నేనెవరో చెప్పుకోచూద్దాం?’’ మరోసారి అడిగింది పార్వతి.‘‘మందు కొడితే అద్దంలో నన్ను నేనే గుర్తు పట్టలేను. అలాంటిది ఈ సమయంలో వెనక నుంచి వచ్చి కళ్లు మూస్తే ఎలా గుర్తు పట్టగలను?’’ అన్నాడు దేవదాస్. ఇక లాభం లేదనుకొని అతని ముందుకు వచ్చి నిల్చుంది పార్వతి.‘‘పారూ...నువ్వా!!’’ ఆశ్చర్యానందాలతో అరిచాడు దేవదాస్. తమ చిన్నప్పటి విషయాలను గుర్తు తెచ్చుకొని ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు.‘‘దేవదా... ఇంకా మందు కొడుతూనే ఉన్నావా! నన్ను మరిచిపోవడం కష్టంగా ఉందా?’’ సానుభూతిగా అడిగింది పార్వతి.‘‘పిచ్చి పారూ....అప్పుడెప్పుడో సెవెంటీస్లోనే నిన్ను మరిచిపోయాను. కానీ మందును మాత్రం మరవలేకపోతున్నాను’’ అన్నాడు దేవదాస్.‘‘నన్ను మరిచిపోయినందుకు బాధ పడటం లేదు. ఈ కాల కూట విషాన్ని తాగుతున్నందుకు మాత్రం బాధ పడుతున్నాను. నా కోసం మందు మానలేవా?’’‘‘ఈరోజు నుంచే మానేస్తున్నాను’’ ఖాళీ అయిన సీసాను ముళ్లపొదల్లోకి విసురుతూ అన్నాడు దేవదాస్.‘‘దేవదా...నేనంటే ఎంత ప్రేమ నీకు?’’ పొంగిపోయింది పార్వతి.‘‘ ప్రేమ కాదు... మలేరియా దోమ కాదు....నీ కోసం కాదు...ఆ మేనక కోసం మానేస్తున్నాను’’ అన్నాడు దేవదాస్. ‘‘మేనక కోసమా!!!’’ నలుదిక్కులూ అదిరేలా ఆశ్చర్యపోయింది పార్వతి.‘‘ఈ స్వర్గానికొచ్చాక తిలోత్తమతో త్రీ టైమ్స్ లవ్‌లో పడ్డాను. ఎప్పటిలాగే బ్రేకప్! ఇక పొరపాటున కూడా లవ్‌లో పడొద్దని డిసైడైపోయాను. అనుకున్నావు అని ఆగవు కొన్ని...అని ఎవరో అన్నట్లు.... విధివశాత్తు మళ్లీ ప్రేమలో పడిపోయాను. అదేలా జరిగిందంటే...ఒక రోజు నేను ఈ పార్క్‌లో కూర్చొని ఏమీ తోచక...‘కళ్లు కళ్లు ప్లస్సు /వాళ్లు వీళ్లు మైనస్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చ్వేషన్’ పాట పాడుకుంటున్నాను. అప్పుడే ఇటు వైపుగా వచ్చిన మేనక, తనను చూసే నేను పాడుతున్నట్లు టెంప్టయిపోయింది.‘‘మీకు అంతగా నచ్చానా!’’ అంటూ నా దగ్గరకు వచ్చి సిగ్గుపడిపోయింది.‘‘యా!’’ అని చిన్న అబద్ధం ఆడాను. అలా మేనక ప్రేమలో పడిపోయాను.‘‘మేనూ...నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడిగాను.‘‘తప్పకుండా. కానీ మీరు ముందు ఈ మందు కొట్టడం మానేయాలి’’ అని షరతు పెట్టింది.‘‘ఆరోజు ప్రేమ కోసమే మందు కొట్టాను. ఈరోజు ప్రేమ కోసమే మానేస్తున్నాను. ఇక ముందు నైన్టీ ఎమ్.ఎల్ కూడా తీసుకొను’’ అని మాట ఇచ్చాను. ఇదే చివరిరోజు. ఇక ఎప్పుడూ మందు ముట్టను. ఎల్లుండి వాలెంటెన్స్ డే రోజు మా పెళ్లి ఘనంగా జరగనుంది. మన పొరుగు రాష్ట్రమైన నరకం నుంచి కూడా మా పెళ్లి చూడటానికి చాలామంది వస్తున్నారు’’ ఆనందంగా అన్నాడు దేవదాస్.‘‘ఈరోజు గొప్ప శుభవార్త విన్నాను. తప్పకుండా నీ పెళ్లికి వస్తాను’’ అని చీరకొంగుతో ఆనంద భాష్పాలు తుడుచుకుంది పార్వతి.దేవదాస్ తన చేతికి ఉన్న వాచ్ చూసుకుంటూ... ‘‘పారూ... నా పెళ్లిలో కలుద్దాం’’ అని కోటు జేబులో రెండు చేతులను దూర్చి ‘ఒక మేనక కోసం.... టక్ టక్ టక్.... తిరిగాను స్వర్గం... లక్ లక్ లక్’’ అని పాడుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు.ఆరోజు వాలెంటెన్స్ డే. కొత్త పట్టుచీర కట్టుకొని ‘షాన్పారేషాన్’ ఫంక్షన్‌హాల్‌కు వెళ్లింది పారు. అక్కడ ఒక పురుగు కూడా లేదు. వెంటనే అక్కడి నుంచి ‘హెవెన్స్టార్ లెవెన్స్టార్’ పార్క్‌కు వెళ్లింది. పార్క్‌లో ఒక మూల కూర్చొని మందుకొడుతున్నాడు దేవదాస్. ‘‘పెళ్లని చెప్పావు... ఇక్కడున్నావేమిటి?’’ అడిగింది పార్వతి.‘‘ఇంకెక్కడి పెళ్లి... క్యాన్సిల్ అయింది. అంతా ఆ తండ్రీకొడుకులే చేశారు’’ ఆవేదనగా అన్నాడు దేవదాస్.‘‘వాళ్లెవరు?’’ ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.‘‘పృథ్వీరాజ్ కపూర్... ఆయన సన్ రాజ్‌కపూర్. ఏదో ఫంక్షన్లో రాజ్‌కపూర్ మేనకను చూసి పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టాడట. అప్పుడు పృథ్వీరాజ్‌కపూర్ మేనక తల్లి దగ్గరకు వెళ్లి ‘ఎలాగైనా సరే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి’ అని మ్యానేజ్ చేశాడు. ఆ మహాతల్లి ఓకే చెప్పింది. మా లవ్వులో నిప్పులు పోసింది’’ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు దేవదాస్.‘‘అసలు మేనక ఎలా ఒప్పుకుంది?’’ ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.‘‘ఆరోజు నువ్వు మీ నాన్న మాట కాదనలేక...నన్ను కాదన్నావు... ఈరోజు పారు వాళ్ల అమ్మ మాట కాదనలేక నన్ను కాదనుకుంది.... అంతే తేడా.... ఒక డాడీ, ఒక మమ్మీ నా జీవితాన్ని ఖాళీసీసా చేసేశారు! వోడ్కా మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇక ప్రేమ జోలికి ఎప్పుడూ వెళ్లను’’ నిర్వేదంగా అంటూ సిగరెట్ వెలిగించి పాట అందుకున్నాడు దేవదాస్...‘పారు లేదు/ పప్పు చారు లేదు/ మేను లేదు వాటర్క్యాను లేదూ/ వెలుతురే లేదు’ఆ సమయంలోనే అటువైపుగా వస్తున్న రంభను చూసి సడన్‌గా పాట మార్చాడు దేవదాస్.‘కళ్లు కళ్లు ప్లస్సు/ వాళ్లు వీళ్లు మైనస్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చ్వేషన్’... అని పాడటం మొదలు పెట్టాడు.‘‘మీకు అంతగా నచ్చానా!’’ సిగ్గుతో మెలికలు తిరిగింది రంభ.‘పిచ్చ పిచ్చగా నచ్చావు’ అన్నాడు దేవదాస్.పారు బిత్తర పోయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయింది! – యాకుబ్ పాషా -
కవి సమాజ మార్గనిర్దేశకుడు
కరీంనగర్ కల్చరల్ : సమాజానికి మార్గ నిర్దేశనం చేసే శక్తి కవికి తన రచనల ద్వారా ఉందని ‘నేటి నిజం’ పత్రిక సంపాదకులు బైస దేవదాసు అన్నారు. కవి, రచయిత, సాహితీ విమర్శకుడు దాస్యం సేనాధిపతి రాసిన ‘అవలోకనం’ సమీక్షా వ్యాసాల గ్రంథాన్ని ఆదివారం ఫిలింభవన్‌లో ఆవిష్కరించారు. దేవదాసు మాట్లాడుతూ కవి తన రచనల ద్వారా జీవిస్తూ సమాజాన్ని జీవింపచేస్తాడన్నారు. కవులు, రచయితలు సమాజహితం కోసం రచనలు చేయాలన్నారు. సాహితీవేత్తలు కేఎస్.అనంతాచార్య, గండ్ర లక్ష్మణరావు, పోరెడ్డి రంగయ్య, గాజోజు నాగభూషణం, మాడిశెట్టి గోపాల్, దయాకర్, బీవీఎన్ స్వామి, ఇస్రత్‌సుల్తానా పాల్గొన్నారు. -
దేవదాసు అయ్యేదెవరు?