కవి సమాజ మార్గనిర్దేశకుడు
కరీంనగర్ కల్చరల్ : సమాజానికి మార్గ నిర్దేశనం చేసే శక్తి కవికి తన రచనల ద్వారా ఉందని ‘నేటి నిజం’ పత్రిక సంపాదకులు బైస దేవదాసు అన్నారు. కవి, రచయిత, సాహితీ విమర్శకుడు దాస్యం సేనాధిపతి రాసిన ‘అవలోకనం’ సమీక్షా వ్యాసాల గ్రంథాన్ని ఆదివారం ఫిలింభవన్‌లో ఆవిష్కరించారు. దేవదాసు మాట్లాడుతూ కవి తన రచనల ద్వారా జీవిస్తూ సమాజాన్ని జీవింపచేస్తాడన్నారు. కవులు, రచయితలు సమాజహితం కోసం రచనలు చేయాలన్నారు. సాహితీవేత్తలు కేఎస్.అనంతాచార్య, గండ్ర లక్ష్మణరావు, పోరెడ్డి రంగయ్య, గాజోజు నాగభూషణం, మాడిశెట్టి గోపాల్, దయాకర్, బీవీఎన్ స్వామి, ఇస్రత్‌సుల్తానా పాల్గొన్నారు.