శాంతిసరోవర్ ప్రాంగణంలో మినీ బస్సును లాగుతున్న రాణిరైక్వార్
రాయదుర్గం: ఎప్పటికైనా విమానాన్ని నా జుట్టుతో లాగుతా..అదే నా లక్ష్యం.. అని చెబుతున్నారు గిన్నిస్ రికార్డు సాధించిన రాణిరైక్వార్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 37ఏళ్ల యువతి తన జుట్టుతో ఇంతవరకు జీపు, మినీబస్సు,ట్రక్, కంటైనర్, డబుల్‌డెక్కర్ బస్సు, ట్రైన్ ఇంజన్ లాగి శభాష్ అనిపించుకున్నారు. జుట్టుతో భారీ వాహనాలు లాగుతూ దేశంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఆమె గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్ సంస్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
♦ ఇప్పటి వరకు 100 టన్నుల లోపు భారీ వాహనాలు జుట్టుతో లాగా.. ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొడితే దాన్ని కూడా బద్దలు కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తా. ఎప్పటికైనా విమానాన్ని లాగాలనేది నా లక్ష్యం. ఆ సమయం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానన్నారు.
♦ యువతలో చైతన్యం తీసుకురావడానికి బ్రహ్మకుమారీస్ çసంస్థ సభ్యురాలిగా పనా వంతు కృషిచేస్తున్నానన్నారు. నా 10వ ఏటనే బ్రహ్మకుమారీస్ సంస్థలో చేరా. ఆ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. ఇక్కడే ఎన్నో నేర్చుకున్నా. ప్రస్తుతం భోపాల్‌లోని బ్రహ్మకుమారీస్ సంస్థలో ఉంటున్నా.
♦ చిన్నతనం నుంచి ఏదో సాధించాలనే తపన ఎక్కువగా ఉండేది. ఇంట్లో ఏ పనీ చేసేదాన్ని కాదు. అందరితో పోట్లాడేదాన్ని. మాఇంట్లోని పెద్ద వారు ఎన్నో నేర్పించారు. నాలో శక్తిని గుర్తించేలా చేసుకోవడానికి కూరగాయల ట్రాలీలో మొదట 10 నుంచి 25 ఇటుకలను పెట్టి జుట్టతో లాగేదాన్ని. అది విజయవంతం కావడం, పేపర్లో ఫోటో వేయడంతో ఉత్సాహం పెరిగింది.
♦ ఆ తర్వాత జీపు, మినీబస్సు, డబుల్ డెక్కర్, ట్రక్, రైల్ ఇంజన్, భారీ ట్రాలీపై 200 మందిని కూర్చోబెట్టి జుట్టుతో లాగా.
♦ నాలో ఎలాంటి అతీతవక్తులు లేవు. అలా అని జుట్టుకు ఏదో రాసుకోవడం లేదు. అందరిలాగే నేనూ కొబ్బరినూనె రాసుకుంటా. వాహనాలు లాగే ముందు ఎలాంటి ప్రాక్లీస్ చేయను. ఇది దేవుడిచ్చిన బలం. మెడిటేషన్ చేసి ఆతర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా.
రాణి రైక్వార్ గురించి...
గ్రామం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాక్లోర్‌గ్రామం
తల్లిదండ్రులు : ఎంఎల్ రైక్వార్, రుక్మిణి, ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు
♦ వయస్సు–37 ఏళ్ళు
♦ 1993లో బ్రహ్మకుమారీస్ సంస్థలో చేరిక
♦ 16వ ఏటనే కూరగాయల ట్రాలీలో పది నుంచి 25 వరకు ఇటుకలతో జుట్టుతో లాగడంతో ప్రారంభం
♦ ఆ తర్వాత జీపు, మినీబస్సు,ట్రక్, కంటైనర్, డబుల్‌డెక్కర్ బస్సు, ట్రైన్ ఇంజన్ లాగడం
మినీ బస్సును జుట్టుతో లాగిన రాణి
గచ్చిబౌలి శాంతిసరోవర్ ప్రాంగణంలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియం ముందున్న ఖాళీ స్థలంలో రాణిరైక్వార్ తన జుట్టుతో మినీ బస్సును లాగి ఆశ్చర్యపరిచారు. మినీ బస్సు ముందుబాగాన్ని తాళ్ళతో కట్టి, వాటిని ఆమె తన జుట్టుకు కట్టుకొని బస్సును ముందుకు లాగడంతో ప్రత్యక్షంగా చూస్తన్న వారు చప్పట్లతో అభినందనలు
తెలిపారు.
రికార్డుల వివరాలు...
♦ 2007లో కొరియాలోని ఓ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో డబుల్‌డెక్కర్ బస్ లాగడం
♦ 2008లో 8 టన్నుల ట్రక్‌నుజుట్టుతో లాగడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు
♦ 2012లో గిన్నిస్ వరల్డ్ రికార్డు– కలర్స్ చానల్ షో ద్వారా భారీకంటైనర్‌పై 200 మంది కూర్చునగా జుట్టుతో 90 అడుగుల దూరం లాగిన రికార్డు
♦ 2019లో లండన్‌లో బ్రిటీష్ పార్లమెంట్ ద్వారా ఎనర్జిటిక్‌విమెన్ ఆఫ్ ఇండియా అవార్డు స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment