శివాలి జోహ్ర
పటాన్‌చెరు: బీటెక్ చదివిన శివాలి జోహ్ర అనే యువతి పదమూడో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె తల్లి కవిత, తండ్రి అనిల్ శ్రీవాస్తవ కూడా ఈ రికార్డుల్లో పాలుపంచుకున్నారు. చేతితో రూపొందించిన 2,200 క్విల్లింగ్ డాల్స్‌ను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పి తాజాగా పదమూడో గిన్నిస్ సాధించింది. ఇప్పటివరకు 13 గిన్నిస్ రికార్డులు, 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, 4 యూనిక్ వరల్డ్ రికార్డులను ఈ కుటుంబం సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఒకే కుటుంబం ఇన్ని గిన్నిస్ రికార్డులు సాధించడం కూడా ఓ విశేషం.
ఇంతకు ముందు శివాలి కుటుంబం హ్యాండ్‌మేడ్ పేపర్‌తో రూపొందించిన 1,251 విభిన్న బొమ్మలను కొలువుతీర్చి తొలి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత 7,011 విభిన్న కాగితం పువ్వులను ప్రదర్శించి రెండో రికార్డు, 2,111 విభిన్న బొమ్మలు, 3,501 ఆరెగామి (కాగితం) వేల్స్, 2,100 ఆరెగామి పెంగ్విన్స్, 6,132 ఆరెగామి సిట్రస్ (నిమ్మతొన)లు, 6,100 ఆరెగామి వేల్స్, 2,500 ఆరెగామి పెంగి్వన్స్, 1,451 ఆరెగామి మాఘీలు, 2,200 క్విల్లింగ్ డాల్స్, 9,200 ఆరెగామి ఫిష్, 1,998 ఆరెగామి మాఘీ లీమ్‌లను ప్రదర్శనకు ఉంచి రికార్డులను సొంతం చేసుకుంది.
(చదవండి: బుల్లి వాక్యూమ్ క్లీనర్.. గిన్నీస్ రికార్డుల్లోకి)
Comments
Please login to add a commentAdd a comment