గిద్దలూరు (ప్రకాశం జిల్లా): ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఎంపాలెంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన లక్ష్మయ్య (35), రాణి (30) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున పనులకు వెళ్లే తొందరలో ఉతికిన బట్టలను ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు రాణి విద్యుదాఘాతానికి గురైంది.
అప్పుడే నిద్రలేచిన భర్త ఇది గమనించి భార్యను రక్షించాలనే తొందరలో వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. దీంతో భార్యభర్తలిద్దరూ విద్యుదాఘాతానికి బలయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన దంపతులకు ఆరేళ్ల కుమారుడున్నట్లు సమాచారం.
విద్యుదాఘాతంతో దంపతుల మృతి
Published Thu, Jul 16 2015 7:03 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement
Advertisement