laxmaiah
-
ప్రజారోగ్యంపై పట్టింపు ఏది?
భారతదేశం కరోనా దెబ్బకు విలవిలలాడిపోవడానికి ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపు చాలా తక్కువగా ఉండటం కూడా కారణమే. పైగా కేంద్రం, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభు త్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థను, మనకు ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. మరోవైపున కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవడమా? మన పొరుగున ఉన్న చైనా, మనకన్నా అధిక జనాభా ఉన్న దేశం.. మలేరియా రహితదేశంగా మారిపోయింది. బుధవారం అంటే నిన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ప్రకటించిన 40 దేశాల్లో చైనా చేరిపోయింది. అంతేకాకుండా, మనకన్నా చిన్నదేశం, అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న శ్రీలంక కూడా మలేరియా రహిత దేశమైపోయింది. సెప్టెంబర్ 5, 2016న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇట్లా 40 దేశాలు తమ గడ్డమీదినుంచి మలేరియాను తరిమి కొట్టాయి. ఇవేకాక అల్జీ రియా, మారిషస్, జోర్డాన్, లిబియా, మొరాకో, అల్బేనియా నుంచి బ్రిటన్ దాకా యూరప్ దేశాల్లో చాలా మలేరియా నుంచి విముక్తి అయ్యాయి. అంతేకాకుండా, దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, జమైకా, క్యూబా, ఉరుగ్వే లాంటి దేశాలు ఈ జాబితాలో చేరి పోయాయి. కానీ మనదేశంలో మాత్రం ఇంకా మలేరియా విలయ తాండవం చేస్తూనే ఉంది. మారుమూల ప్రాంతాలైన అడవుల్లో నివసించే ఆదివాసులు ప్రతి సంవత్సరం లెక్కలకు అందనంత మంది మలేరియా ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు. రాబోయే పది సంవత్సరాలలో భారత్‌ని మలేరియా రహితదేశంగా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేసి నట్టు చెబుతున్నారు. అయితే మనదేశంలో ఉన్న ఆదివాసుల జీవన పరిస్థితులు, స్థితిగతులను పరిశీలిస్తే ఇది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం రాక మానదు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొనసాగుతున్న వ్యత్యాసాలు ప్రజల ఆరోగ్య స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి. మలేరియాతోపాటు, మరొక ముఖ్యమైన సమస్య క్షయ వ్యాధి. ఇది కూడా ప్రజలలో చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇండియా క్షయ వ్యాధి నివేదిక–2020 ప్రకారం 26.9 లక్షల కేసులు నమోదు కాగా, 79,144 మంది మరణించారు. 2019లో 24.04 లక్షల కేసులు నమోదు అయ్యాయి. అంటే 2019 కన్నా 2020లో 14 శాతం అధి కంగా కేసులు నమోదయ్యాయి. అయితే అనధికార లెక్కలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో అంటే 2025 నాటికి టి.బి. రహిత దేశంగా భారతదేశాన్ని తయారుచేస్తామని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రతి సంవత్సరం సరాసరి 4,36,000 మంది టి.బి. వల్ల మరణి స్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 2019లో పదిలక్షల 40వేల మంది క్షయవల్ల మరణిస్తే, మొత్తంగా 20 లక్షల 64 వేలమంది ఆ వ్యాధి బారిన పడ్డారు. ఇందులో మహిళలు 34శాతం కాగా, 59శాతం పురుషులు, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో అధిక సంఖ్యలో క్షయవ్యాధి బారిన పడుతున్నారు. క్షయవ్యాధిలో ఇండియా, మొదటిస్థానంలో ఉండగా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా దేశాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. దీనితోపాటు పోషకాహార లోపం మరొక ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రజలు అనారోగ్యం పాలు కావడానికి 50 శాతం వరకు పోషకాహార లోపమే ప్రధాన కారణమనే విషయాన్ని న్యూట్రిషన్ వరల్డ్–2020 నివేదిక బయటపెట్టింది. పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉంటోందనీ, దాదాపు 50 శాతం మంది పిల్లల్లో ఎముకల ఎదుగుదల లేదని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో కూడా ఆదివాసీ, దళితుల శాతం అధికం. పోషకాహార లోపంతోపాటు, రక్తహీనత కూడా వీరిలో అధికం. ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. దళితుల్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 48 శాతం దళితుల్లోని బాల, బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉండగా, కరోనాలాంటి వ్యాధి ప్రబలితే ఎటు వంటి పరిస్థితులను మనం చవిచూశామో తెలుసు. ఇంకా కరోనా ప్రభావం ఎంత దుష్ప్రభావాన్ని మిగిల్చిందో, మిగులుస్తుందో లెక్కలు తేలాల్సి ఉంది. అంతేకాకుండా, జీవనశైలి మీద ఆధారపడిన మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల వల్ల కరోనా బారిన పడిన వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి లెక్కలు లేవు. ఇవన్నీపోనూ.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల ఆరోగ్య సమస్యను ప్రాధాన్యత లేని సమస్యగా చూస్తున్నాయి. ఇది తీవ్రంగా కలచివేసే సమస్య. మనం రోజురోజుకూ ఎంతో పురోగమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఎటువంటి దూరదృష్టి లేదు. ప్రజల ప్రాణాలు, భద్రత, ఇతర సమస్యల కేంద్రంగా ఈ అంశాన్ని ఆలో చించడం మానేశాం. మన ఆరోగ్య సూచికలన్నీ ప్రపంచ దేశాలన్నింటిలో తిరోగామి స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం మనకు ఒక కచ్చితమైన ఆరోగ్య విధానం లేదు. పేరుకు హెల్త్ పాలసీలు తయారు చేసుకుంటాం. కానీ అది కూడా ఎక్కడో పాత కాలమైతే అల్మారాలో, ఇప్పుడైతే కంప్యూటర్ సర్వర్‌లో దాగి ఉంటుంది. అటువంటిదే 2017 జాతీయ హెల్త్ పాలసీ, అంతకుముందు రెండుసార్లు హెల్త్ పాలసీలు తయారు చేశారు. కానీ అవి ఆచరణకు నోచుకోలేదు. 2017లో రూపొందించిన పాలసీ కూడా అటువంటిదే. అందులో అన్ని సాంకేతికపరమైన సమస్యలే తప్ప, ఎక్కడా నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. పైగా ఆ నివేదికలోనే చెప్పిన విషయం విస్మయం కలిగించక మానదు. ‘కొంతమంది ఆరోగ్య విషయాన్ని, ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని అంటున్నారు. కానీ, మన దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపా యాలు అటువంటి స్థితిలో లేవు’ అని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు స్థూల జాతీయోత్పత్తిలో 1.26 శాతంగా ఉందని, అది 2.5 శాతం పెరిగితే తప్ప ఎటువంటి నూతన సౌకర్యాలు సాధ్యంకావని తేల్చిచెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలు మనకన్నా అదనంగా ఆరోగ్యంమీద ఖర్చు పెడుతున్నాయి. అమెరికా 17 శాతం, బ్రెజిల్ 9.2 శాతం, డెన్మార్క్ 10.1 శాతం, కెనడా 10.7 శాతం జాతీయ స్థూల ఉత్పత్తిలో ఖర్చు చేస్తున్నాయి. కాబట్టే ఆ దేశాలు ఆరోగ్య రంగంలో వచ్చే ఎటు వంటి సమస్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి. భారత్ కరోనా దెబ్బకు విలవిలలాడి పోవడానికి ఈ బడ్జెట్ లేమి కూడా కారణం. కేంద్ర, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభుత్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవ స్థను, మన మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. అంతేకాకుండా, హెల్త్ పాలసీ–2017 స్థానంలో మరొక సమ గ్రమైన, నూతనమైన ఆరోగ్య విధానం రూపకల్పన చేసుకోవాలి. అందులో చాలా స్పష్టంగా కేంద్ర, రాష్ట్రాల విధులను, బాధ్యతలను ప్రత్యేకంగా పేర్కొనాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనాను దృష్టిలో పెట్టుకొని, ఇకపై ప్రజల మీద భారం వేయకుండా ప్రభు త్వమే ఆరోగ్య బాధ్యతను వహించాలి. సార్వజనీన ఆరోగ్య రక్షణకు అంటే ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యాన్ని అందించే విధానాన్ని తయారు చేసుకోవాలి. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవ డమా? మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
‘ప్రణయ్ పేరుతో నిరభ్యంతర చట్టం’
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు అరికట్టడానికి నిర్భయ చట్టం తెచ్చినట్లే కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న వారి భద్రత కోసం నిరభ్యంతర చట్టాన్ని ప్రణయ్ పేరుతో తీసుకురావాలని కుల అసమానత నిర్మూలనా పోరాట సమితి(కేఎఎన్‌పీఎస్) వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ బండారి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. పెరుమాళ్ల ప్రణయ్ తొలి వర్థంతి కార్యక్రమం మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కుల అహంకారం కారణంగా మరణించిన పలువురికి నివాళులర్పించారు. సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మయ్య అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ.. కులాంతర వివాహం చేసుకున్న వారిపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టాలన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కులాంతర ప్రేమ వివాహాన్ని సహించలేని అమృత తండ్రి మారుతిరావు సుఫారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడని, ఈ దారుణ ఘటన జరిగి సెప్టెంబర్ 14 నాటికి ఏడాది గడిచిందని తెలిపారు. ప్రణయ్ వర్ధంతి సందర్భంగా పోరాట సమితిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి కొమ్ము సురేందర్, కందిక కోమల, పూజ, గుమ్మడి రత్నం, శివబి.యాదయ్య, చక్రవర్తి, దేవా, లక్ష్మయ్య, గోవింద్, లక్ష్మణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
కొమ్ములక్ష్మయ్య సేవలు మరువలేనివి
రామన్నపేట నిమ్నవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్ము లక్ష్మయ్య అందించిన సేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శనివారం కొమ్ము లక్ష్మయ్య దశదినకర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. లక్ష్మయ్య ఆశయాల సాధన దిశగా పార్టీ పనిచేస్తుందని చెప్పారు. అనంతరం లక్ష్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్‌పంతులు, మాజీఎంపీపీ నీల దయాకర్, నాయకులు సాల్వేరు అశోక్, బత్తుల శంకరయ్య, బండమీది స్వామి, అయ్యాడపు నర్సిరెడ్డి, కొమ్ము శ్రీకాంత్, బొడ్డు శంకరయ్య, వడ్డె భూపాల్‌రెడ్డి, కె.సైదులు, అరవింద్, వివిధపార్టీల నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మయ్య మృతి
రామన్నపేట రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్ము లక్ష్మయ్య బుధవారంరాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మండల, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ కార్యదర్శిగా వివిధహోదాల్లో పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. సంజీవయ్యనగర్ ప్రధానకూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు కొమ్ము లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అభివృద్ధికి లక్ష్మయ్య చేసినõ Üవలను స్మరించుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంచిరాజు శరత్చందర్, మందడి రవీందర్‌రెడ్డి, నీల దయాకర్, బత్తుల శంకరయ్య, బద్దుల రవి, మన్సూర్‌అలీ, రాం శివకుమార్, బండమీది స్వామి, మేకల మల్లయ్య, బొడ్డు అల్లయ్య, గొరిగె నర్సింహ, మిర్యాల మల్లేశం, ఎండీ జమీరుద్దిన్, దోమల సతీష్, చిట్టిమాల యాదయ్య, దొమ్మాటి లింగారెడ్డి, నాగు అంజనేయులు ఉన్నారు. ఎమ్మెల్యే వీరేశం నివాళులు ఎమ్మెల్యే వేముల వీరేశం, లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు జినుకల ప్రభాకర్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మయ్య మృతి
రామన్నపేట రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్ము లక్ష్మయ్య బుధవారంరాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మండల, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ కార్యదర్శిగా వివిధహోదాల్లో పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. సంజీవయ్యనగర్ ప్రధానకూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు కొమ్ము లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అభివృద్ధికి లక్ష్మయ్య చేసినõ Üవలను స్మరించుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంచిరాజు శరత్చందర్, మందడి రవీందర్‌రెడ్డి, నీల దయాకర్, బత్తుల శంకరయ్య, బద్దుల రవి, మన్సూర్‌అలీ, రాం శివకుమార్, బండమీది స్వామి, మేకల మల్లయ్య, బొడ్డు అల్లయ్య, గొరిగె నర్సింహ, మిర్యాల మల్లేశం, ఎండీ జమీరుద్దిన్, దోమల సతీష్, చిట్టిమాల యాదయ్య, దొమ్మాటి లింగారెడ్డి, నాగు అంజనేయులు ఉన్నారు. ఎమ్మెల్యే వీరేశం నివాళులు ఎమ్మెల్యే వేముల వీరేశం, లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు జినుకల ప్రభాకర్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో దంపతుల మృతి
గిద్దలూరు (ప్రకాశం జిల్లా): ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఎంపాలెంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన లక్ష్మయ్య (35), రాణి (30) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున పనులకు వెళ్లే తొందరలో ఉతికిన బట్టలను ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు రాణి విద్యుదాఘాతానికి గురైంది. అప్పుడే నిద్రలేచిన భర్త ఇది గమనించి భార్యను రక్షించాలనే తొందరలో వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. దీంతో భార్యభర్తలిద్దరూ విద్యుదాఘాతానికి బలయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన దంపతులకు ఆరేళ్ల కుమారుడున్నట్లు సమాచారం. -
మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి
తూప్రాన్: మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి జరిగింది. చెరువులో కొలతలు తీస్తున్న కూలీ విద్యుదాఘాతానికి గుైరె మరణించాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పాలాట గ్రామానికి చెందిన చాకలి మంచె లక్ష్మయ్య (45) కూలీ. లింగారెడ్డిపేట పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో కొలతలు తీయడానికి బుధవారం కూలీగా వచ్చాడు. ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు ప్రారంభించారు. చెరువు మత్తడిపై నిలబడి సిల్వర్‌తో తయారు చేసిన స్కేల్‌ను పట్టుకుని ఉండగా పైనే ఉన్న 33/11 విద్యుత్ వైరు తగిలి స్పృహ కోల్పోయాడు. చెరువు కాంట్రాక్టర్ కడపాల రాజు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇంద్రతో పాటు మరికొందరు కలసి 108లో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు. అయితే, ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తూప్రాన్ ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. -
లారీ ఢీ కొని వ్యక్తి మృతి
గూడూరు(నెల్లూరు జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా గూడూరు మండలం పోడ్‌పాలెం సర్కిల్ సమీపంలో జరిగింది. వివరాలు.. గూడూరు మండలం రాణిపేట గ్రామానికి చెందిన బండి లక్ష్మయ్య (65) వాటర్ ప్లాంట్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వేగంగా వస్తున్న లారీ తన టీవీఎస్ ఎక్సైల్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.