కొమ్ములక్ష్మయ్య సేవలు మరువలేనివి
రామన్నపేట
నిమ్నవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్ము లక్ష్మయ్య అందించిన సేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శనివారం కొమ్ము లక్ష్మయ్య దశదినకర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. లక్ష్మయ్య ఆశయాల సాధన దిశగా పార్టీ పనిచేస్తుందని చెప్పారు. అనంతరం లక్ష్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్‌పంతులు, మాజీఎంపీపీ నీల దయాకర్, నాయకులు సాల్వేరు అశోక్, బత్తుల శంకరయ్య, బండమీది స్వామి, అయ్యాడపు నర్సిరెడ్డి, కొమ్ము శ్రీకాంత్, బొడ్డు శంకరయ్య, వడ్డె భూపాల్‌రెడ్డి, కె.సైదులు, అరవింద్, వివిధపార్టీల నాయకులు పాల్గొన్నారు.