కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మయ్య మృతి
రామన్నపేట
రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్ము లక్ష్మయ్య బుధవారంరాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మండల, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ కార్యదర్శిగా వివిధహోదాల్లో పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. సంజీవయ్యనగర్ ప్రధానకూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు.
లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు
కొమ్ము లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అభివృద్ధికి లక్ష్మయ్య చేసినõ Üవలను స్మరించుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంచిరాజు శరత్‌చందర్, మందడి రవీందర్‌రెడ్డి, నీల దయాకర్, బత్తుల శంకరయ్య, బద్దుల రవి, మన్సూర్‌అలీ, రాం శివకుమార్, బండమీది స్వామి, మేకల మల్లయ్య, బొడ్డు అల్లయ్య, గొరిగె నర్సింహ, మిర్యాల మల్లేశం, ఎండీ జమీరుద్దిన్, దోమల సతీష్, చిట్టిమాల యాదయ్య, దొమ్మాటి లింగారెడ్డి, నాగు అంజనేయులు ఉన్నారు.
ఎమ్మెల్యే వీరేశం నివాళులు
ఎమ్మెల్యే వేముల వీరేశం, లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు జినుకల ప్రభాకర్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.