రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు కూడా. ఈ అగ్ని-5 క్షిపణి విజయవంతం వెనకు ఉన్న మహిళ మన హైదరాబాద్ డీఆర్‌డీవోలో పనిచేస్తున్న ల్యాబరేటరీ శాస్త్రవేత్త. ఇంతకుమునుపు ఇలాంటి క్షిపణి వ్యవస్థలపై పనిచేసి 'అగ్ని పుత్రి'గా పేరుగాంచిన టెస్సీ థామస్ అడుగుజాడల్లో వచ్చిన మరో శక్తిమంతమైన 'దివ్యపుత్రి' ఈమె!.
ఈ 'మిషన్ దివ్యాస్త్ర' ప్రాజెక్టుకు దేశంలోని మన హైదరాబాద్ క్షిపణి కాంప్లెక్స్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త షీనా రాణీ నాయకత్వం వహించారు. ఆమె 1999 నుంచి ఈ అగ్నిక్షిపణి వ్యవస్థలపై పనిచేస్తున్నారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వీ) సాంకేతికతతో కూడిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించి ఈ ఏడాదికి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కి కీర్తి కీరిటంగా నిలిచారు షీనా రాణి. అందువల్ల ఆమెను భారత రక్షణ పరిశోధన సంస్థ ఆమెను 'దివ్యపుత్రి'గా అభివర్ణించింది.
ఆమె చాలమటుకు ఈ అగ్ని సీరిస్ క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిండంతో షీనా రాణిని 'పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ'గా పిలుస్తారు. ఈ 57 ఏళ్ల షీనా రాణి హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) అడ్వాన్స్‌డ్ సిస్టమ్ లాబొరేటరీలో శాస్త్రవేత్త. ఆమె తిరువనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత విక్రమ సారాభాయ స్పేస్ సెంటర్(వీఎస్‌ఎస్‌సీ)లో ఎనిమిదేళ్లు పనిచేసింది. 1998లో పోఖ్రాన్ అణు పరీక్ష తర్వాత ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించడానికి డీఆర్‌డీవోలో చేరారు.
ఇక 1999 నుంచి షీనా రాణి మొత్తం అగ్ని శ్రేణి క్షిపణులు ప్రయోగ నియంత్రణ వ్యవస్థలపై పని చేశారు. అయితే ఆమె కెరీర్‌లో మంచి తోడ్పాటునందిచింది. క్లిష్టతరమైన కాలంలో డీఆర్‌డీవోకి నాయకత్వం వహించిన డాక్టర్ అవినాష్ చందర్ అని చెప్పుకొచ్చారు. ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇష్టపడతారు. అదే తనకు ఈ అగ్ని క్షిపణి కార్యక్రమం పట్ల అంకితభావంతో ఎలా పనిచేయాలనేది నేర్పించిందని వివరించింది. ఇక ఆమె భర్త పీఎస్‌ఆర్‌ఎస్ శాస్త్రీ డీఆర్‌డీవోలో క్షిపణులపై పనిచేశారు. 2019లో ఇస్రో ప్రయోగించిన కౌటిల్య ఉపగ్రహానికి ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు.
ఈ 'మిషన్ దివ్వాస్త్ర' పేరుతో ప్రయోగించిన విమాన పరీక్షను ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించారు. ఈ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’కి.. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది. ఎంఐఆర్‌వీ సాంకేతికత కలిగిన ఈ ఒక్క క్షిపణి ఒకేసారి అనేక అణు వార్‌హెడ్‌లను మోహరించి, వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో లక్ష్యాలను చేధించగలదు.
ఈ క్షిపణిలో ఉన్న ఒకటికి మించిన వార్‌హెడ్ల కారణంగా శత్రు దేశాల మిసైల్ డిఫెన్ వ్యవస్థలను ఏమార్చడంతో పాటు వాటి ఖండాంతర క్షిపణి విధ్వంస దాడులను తట్టుకుని లక్ష్యాన్ని ఛేదించేగలదు. ఈ క్షిఫణిని స్వదేశీయంగా ఎంఐఆర్‌వీ సాంకేతికతో అభివృద్ధి చేసి భారతదేశం.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన చేరింది. అంతేగాదు ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కల్పించడం లక్ష్యఛేదన కచ్చితత్వంతో జరిగేలా చూడటం ఈ అగ్ని 5 క్షిపణి ప్రత్యేకత.
(చదవండి: నర్సు వెయిట్ లాస్ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్‌ర్‌సైజ్‌తో జస్ట్ ఒక్క ఏడాదిలోనే..)
Comments
Please login to add a commentAdd a comment