Sheena
-
‘మిషన్ దివ్యాస్త్ర’ని విజయవంతం చేసిన 'దివ్యపుత్రి'!
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు కూడా. ఈ అగ్ని-5 క్షిపణి విజయవంతం వెనకు ఉన్న మహిళ మన హైదరాబాద్ డీఆర్డీవోలో పనిచేస్తున్న ల్యాబరేటరీ శాస్త్రవేత్త. ఇంతకుమునుపు ఇలాంటి క్షిపణి వ్యవస్థలపై పనిచేసి 'అగ్ని పుత్రి'గా పేరుగాంచిన టెస్సీ థామస్ అడుగుజాడల్లో వచ్చిన మరో శక్తిమంతమైన 'దివ్యపుత్రి' ఈమె!. ఈ 'మిషన్ దివ్యాస్త్ర' ప్రాజెక్టుకు దేశంలోని మన హైదరాబాద్ క్షిపణి కాంప్లెక్స్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త షీనా రాణీ నాయకత్వం వహించారు. ఆమె 1999 నుంచి ఈ అగ్నిక్షిపణి వ్యవస్థలపై పనిచేస్తున్నారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికతతో కూడిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించి ఈ ఏడాదికి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కి కీర్తి కీరిటంగా నిలిచారు షీనా రాణి. అందువల్ల ఆమెను భారత రక్షణ పరిశోధన సంస్థ ఆమెను 'దివ్యపుత్రి'గా అభివర్ణించింది. ఆమె చాలమటుకు ఈ అగ్ని సీరిస్ క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిండంతో షీనా రాణిని 'పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ'గా పిలుస్తారు. ఈ 57 ఏళ్ల షీనా రాణి హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీలో శాస్త్రవేత్త. ఆమె తిరువనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత విక్రమ సారాభాయ స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)లో ఎనిమిదేళ్లు పనిచేసింది. 1998లో పోఖ్రాన్ అణు పరీక్ష తర్వాత ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించడానికి డీఆర్డీవోలో చేరారు. ఇక 1999 నుంచి షీనా రాణి మొత్తం అగ్ని శ్రేణి క్షిపణులు ప్రయోగ నియంత్రణ వ్యవస్థలపై పని చేశారు. అయితే ఆమె కెరీర్లో మంచి తోడ్పాటునందిచింది. క్లిష్టతరమైన కాలంలో డీఆర్డీవోకి నాయకత్వం వహించిన డాక్టర్ అవినాష్ చందర్ అని చెప్పుకొచ్చారు. ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇష్టపడతారు. అదే తనకు ఈ అగ్ని క్షిపణి కార్యక్రమం పట్ల అంకితభావంతో ఎలా పనిచేయాలనేది నేర్పించిందని వివరించింది. ఇక ఆమె భర్త పీఎస్ఆర్ఎస్ శాస్త్రీ డీఆర్డీవోలో క్షిపణులపై పనిచేశారు. 2019లో ఇస్రో ప్రయోగించిన కౌటిల్య ఉపగ్రహానికి ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. ఈ 'మిషన్ దివ్వాస్త్ర' పేరుతో ప్రయోగించిన విమాన పరీక్షను ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించారు. ఈ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’కి.. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది. ఎంఐఆర్వీ సాంకేతికత కలిగిన ఈ ఒక్క క్షిపణి ఒకేసారి అనేక అణు వార్హెడ్లను మోహరించి, వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిలో ఉన్న ఒకటికి మించిన వార్హెడ్ల కారణంగా శత్రు దేశాల మిసైల్ డిఫెన్ వ్యవస్థలను ఏమార్చడంతో పాటు వాటి ఖండాంతర క్షిపణి విధ్వంస దాడులను తట్టుకుని లక్ష్యాన్ని ఛేదించేగలదు. ఈ క్షిఫణిని స్వదేశీయంగా ఎంఐఆర్వీ సాంకేతికతో అభివృద్ధి చేసి భారతదేశం.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన చేరింది. అంతేగాదు ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కల్పించడం లక్ష్యఛేదన కచ్చితత్వంతో జరిగేలా చూడటం ఈ అగ్ని 5 క్షిపణి ప్రత్యేకత. (చదవండి: నర్సు వెయిట్ లాస్ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో జస్ట్ ఒక్క ఏడాదిలోనే..) -
వినోదం.. సందేశం
కన్నడ రైజింగ్ స్టార్ యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. ప్రకాష్‌రాజ్, తులసి ముఖ్య పాత్రలు చేశారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘భాగ్యనగరం’ పేరుతో సంతోష్ కుమార్ అక్టోబర్ 5న తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ముందు ఓ మంచి డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా ‘భాగ్యనగరం’ సినిమా విడుదల చేస్తున్నా. మా బ్యానర్‌కి ఈ చిత్రం చక్కని శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందిన ఈ చిత్రం కన్నడలో కంటే తెలుగులో పెద్ద విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. డ్యాన్సింగ్ సెన్సేషన్ ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేశారు’’ అన్నారు. ‘‘యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి దుష్పరిణామాలను ఎత్తి చూపుతూ.. ఆలోచన రేకెత్తించే చిత్రం ‘భాగ్యనగరం’. ఇలాంటి మంచి సినిమాను పంపిణీ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్.రావు. -
నలుగురు యువకుల కథ
మాదక ద్రవ్యాలు, మద్యపానం బారిన పడి నలుగురు యువకులు తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భాగ్యనగరం’. యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని సంతోష్ కుమార్ ‘భాగ్యనగరం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. ఓ డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనతో ఈ సినిమా విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ ఆలోచన రేకెత్తించేదే ఈ చిత్రం. మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్ రావు. -
కృష్ణదేవరాయల హారం కహానీ
కౌశిక్ బాబు, వరుణ్ సందేశ్, వితికా షేరు, షీనా (బిందాస్ ఫేమ్) ప్రధాన తారలుగా రూపొందిన సినిమా ‘రాయల హారం’. కర్రి బాలాజీ దర్శకత్వంలో శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై జి.ఎల్.బి శ్రీనివాస్–నూకల లక్ష్మణ సంతోష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘శ్రీకృష్ణదేవరాయుల కాలంనాటి ఓ హారం ప్రధానాంశంగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యమిస్తూ వినోదాన్ని మేళవించాం. కృష్ణదేవరాయలుగా కౌశిక్ బాబు పాత్ర అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే ఫస్ట్ లుక్, ఆడియో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ముక్తార్ ఖాన్, ధనరాజ్, ఫిష్ వెంకట్, చక్రవర్తి తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: కర్ణ, సంగీతం: శ్రీవత్స–మీనాక్షీ–నాగరాజు–ప్రణవ్, సమర్పణ: ఎం.ఏ.చౌదరి. -
ఇంద్రాణికి ఉరి శిక్ష విధించండి!
షీనా బోరా తండ్రి సిద్ధార్థ్ దాస్ ముంబై/కోల్‌కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు సహజీవనం చేశానని దాస్ చెప్పారు. తన కూతురు షీనా హత్య వార్త విని ఎంతో వేదన చెందానన్నారు. షీనాను ఇంద్రాణే హత్య చేసుంటే, ఆమెకు ఉరి శిక్ష విధించాల్సిందేనన్నారు. ఇంద్రాణికి మొదట్నుంచి డబ్బు పట్ల వ్యామోహం ఎక్కువేనని, తన మధ్య తరగతి ఆర్థిక స్థాయి భరించలేకే తనను వదిలి వెళ్లిపోయి ఉండొచ్చన్నారు. కోల్‌కతాలో సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడుతూ.. 1989 తరువాత ఇంద్రాణితో సంబంధాలు తెగిపోయాయని, తన కూతురు షీనాతో మాత్రం ఆమె పదోతరగతిలో ఉండగా ఒకసారి మాట్లాడానన్నారు. మీడియా ద్వారానే షీనా హత్య విషయం తెలిసిందని, ముంబై పోలీసులు తనను సంప్రదించలేదని, దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పారు. పిల్లలను ఇంద్రాణి తల్లిదండ్రులు చూసుకునేవారని, పిల్లల సంరక్షణ బాధ్యతను తనకివ్వడానికి వారు ఒప్పుకోలేదన్నారు. ఇంద్రాణి ఈ హత్య చేశారని నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు నేటి సమాజంలో ఎవరు ఎవర్నైనా హత్య చేయొచ్చన్నారు. కాగా, ఇంద్రాణి, ఆమె కుమారుడు మిఖైల్ బోరాల డీఎన్ఏతో పోల్చి చూసే ఉద్దేశంతో మహారాష్ర్టలోని అడవిలో షీనా బోరా మృతదేహాన్ని తగలబెట్టిన చోట పోలీసులు స్వాధీనం చేసుకున్న అస్థిపంజర అవశేషాలను ముంబైలోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించారు. -
షీనా బోరా హత్యకు కారణాలు నాకు తెలుసు!
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ పాత్ర గురించి మరిన్ని విషయాలు బయటపెడతానంటున్నాడు కొడుకు మిఖైల్ బోరా. తన సోదరిని తల్లి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలుసంటున్నాడు. అయితే పోలీసుల ముందు తల్లి నేరాన్ని ఒప్పకోకపోతే మాత్రం తాను మాత్రం సాక్షిగా మారతానని తెలిపాడు. 'నా సోదరిని తల్లే హత్య చేసిందని నేను నమ్ముతున్నా. అందుకు సంబంధించి పూర్తి కారణాలు నాకు తెలుసు. ఒక కారణం అయితే కాదు. చాలా కారణాలే ఉన్నాయి. ఆమె నేరాన్ని అంగీకరించని పక్షంలో.. నేను ఏది చేయాల్సిన అవసరం వస్తుందో అది కచ్చితంగా చేస్తా.ఆగస్టు 31 వరకూ ఇంద్రాణికి పోలీస్ కస్టడీ విధించారు. వారి విచారణలో నేరాన్ని ఒప్పుకోకపోతే మాత్రం ఆ హత్య గల కారణాలను చెబుతా'అని మిఖైల్ బోరా తెలిపాడు. 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని బుధవారం అరెస్టు చేశారు. స్టార్ ఇండియా 2002లో స్టార్ ఇండియా సీఈఓగా పీటర్ ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే ఆమెకు సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని పీటర్ దగ్గర దాచింది. అనంతరం చోటు చేసుకున్నపరిణామాలు కూతురు షీనా బోరా హత్యకు దారి తీశాయి. ఆ విషయాన్ని దాచి పెట్టిన ఇంద్రాణి.. షీనా అమెరికాకు వెళ్లినట్లు అందర్నీనమ్మించింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. -
‘గడ్డం గ్యాంగ్’సినిమా వర్కింగ్ స్టిల్స్
-
'గడ్డం గ్యాంగ్' ఆడియో ఆవిష్కరణ
-
సరికొత్త లుక్‌తో...
రాజశేఖర్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘గడ్డం గ్యాంగ్’. షీనా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పి.సంతోష్ దర్శకుడు. జీవితా రాజశేఖర్ నిర్మాత. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి జీవిత మాట్లాడుతూ -‘‘తమిళంలో విజయవంతమైన ‘సూదు కవ్వమ్’ చిత్రం ఈ సినిమాకు మాతృక. తెలుగు నేటివిటికీ కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన రాజశేఖర్ కెరీర్లో ఈ గడ్డం దాస్ పాత్ర సరికొత్తగా అనిపిస్తుంది. లుక్ పరంగా ఇంతకు ముందు కనిపించని రీతిలో రాజశేఖర్ కనిపిస్తారు. సంగీత దర్శకుడు అచ్చు స్వరాలందించడంతో పాటు, ఈ సినిమా ద్వారా నటునిగా కూడా పరిచయం అవుతున్నారు. వచ్చే నెల తొలి వారంలో పాటల్ని, అదే నెలలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: డేమిల్ జేవియర్ ఎడ్వర్డ్స్, నిర్మాణం: శివాని శివాత్మిక మూవీస్. -
నువ్వేనా బంగారం మూవీ స్టిల్స్
-
నువ్వే నా బంగారం పాటలు
‘‘కొడుకులు, కూతుళ్లకన్నా.. మనవళ్లు, మనవరాళ్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోనే తన మనవడి కోసం కృష్ణంరాజు ఈ సినిమా తీశాడు. ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయి. ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసి, ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేలా చేయండి’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. సాయికృష్ణ, షీనా జంటగా రామ్‌వెంకీ దర్శకత్వంలో పేరిచర్ల కృష్ణంరాజు నిర్మించిన చిత్రం ‘నువ్వే నా బంగారం’. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను దాసరి ఆవిష్కరించి వీవీ వినాయక్‌కి ఇచ్చారు. ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయని, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని వినాయక్ అన్నారు. ఈ తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నానని నిర్మాత చెప్పారు. యూత్, ఫ్యామిలీకి నచ్చే అంశాలతో ఈ సినిమా చేశామని, ఫీల్ గుడ్ మూవీ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, వి.సాగర్, సుమన్, బెల్లంకొండ సురేష్, వాసు తదితరులు పాల్గొన్నారు. -
నువ్వే నా బంగారం...
సాయికృష్ణ, షీనా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వే నా బంగారం’. రామ్‌వెంకీ దర్శకుడు. పేరిచర్ల కృష్ణంరాజు నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘తల్లిదండ్రులను అమితంగా ప్రేమించే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే పర్యవసానం ఎలా ఉంటుంది? వారి ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? అనేది ఈ చిత్ర కథ. రెండు కుటుంబాల మధ్య సాగే అందమైన ప్రేమకథ ఇది. నిషా కొఠారీపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఈ చిత్రానికి హైలైట్. మంచి కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. విజయం సాధిస్తామని మా నమ్మకం’’ అని దర్శకుడు చెప్పారు. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా హీరోహీరోయిన్లు సాయికృష్ణ, షీనా, సంగీత దర్శకుడు యాజమాన్యతో పాటు చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.