నువ్వే నా బంగారం...
నువ్వే నా బంగారం...
Published Wed, Oct 9 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
సాయికృష్ణ, షీనా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వే నా బంగారం’. రామ్‌వెంకీ దర్శకుడు. పేరిచర్ల కృష్ణంరాజు నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
‘‘తల్లిదండ్రులను అమితంగా ప్రేమించే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే పర్యవసానం ఎలా ఉంటుంది? వారి ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? అనేది ఈ చిత్ర కథ. రెండు కుటుంబాల మధ్య సాగే అందమైన ప్రేమకథ ఇది. నిషా కొఠారీపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఈ చిత్రానికి హైలైట్. మంచి కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం.
విజయం సాధిస్తామని మా నమ్మకం’’ అని దర్శకుడు చెప్పారు. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా హీరోహీరోయిన్లు సాయికృష్ణ, షీనా, సంగీత దర్శకుడు యాజమాన్యతో పాటు చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement