ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత ప్రేక్షకుడు థియేటర్స్‌కి వెళ్లడం తగ్గించాడు. సినిమాలో స్పెషల్ కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్‌కి వెళ్లడం లేదు. అందుకే రిలీజ్‌కు ముందే కొత్త కొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని చిన్న చిత్రాలు బాగున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో థియేటర్‌లో ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి స్పందన లభిస్తుంది.
అందుకే కొంతమంది చిన్న నిర్మాతలు ఓటీటీ కోసమే సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఓటీటీ సంస్థలు కూడా అన్ని సినిమాలను కొనడం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్‌లో మోస్తరుగా ఆడినా కూడా ఓటీటీకి అమ్ముడు పోవడం లేదు. అందుకే కొన్ని సినిమాలను డైరెక్టుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారు.
ఫ్రీగా ‘మిస్టరీ’
తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా "మిస్టరీ". సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను య్యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. నేటి(జనవరి 13) నుంచి ఈ సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు, ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజులకి ఓటీటీలోకి వచ్చేసింది. తన సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తల్లాడ సాయికృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘మిస్టరీ’ కథేంటి?
ఒక మర్డర్ జరగడం, అసలు ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు. ఒక గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని, సినిమా చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారని సాయికృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment