సరికొత్త లుక్‌తో... | Rajasekhar's Gaddam Gang Movie First Look | Sakshi
Sakshi News home page

సరికొత్త లుక్‌తో...

Published Fri, Oct 24 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

సరికొత్త లుక్‌తో...

సరికొత్త లుక్‌తో...

రాజశేఖర్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘గడ్డం గ్యాంగ్’. షీనా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పి.సంతోష్ దర్శకుడు. జీవితా రాజశేఖర్ నిర్మాత. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి జీవిత మాట్లాడుతూ -‘‘తమిళంలో విజయవంతమైన ‘సూదు కవ్వమ్’ చిత్రం ఈ సినిమాకు మాతృక. తెలుగు నేటివిటికీ కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన రాజశేఖర్ కెరీర్‌లో ఈ గడ్డం దాస్ పాత్ర సరికొత్తగా అనిపిస్తుంది. లుక్ పరంగా ఇంతకు ముందు కనిపించని రీతిలో రాజశేఖర్ కనిపిస్తారు. సంగీత దర్శకుడు అచ్చు స్వరాలందించడంతో పాటు, ఈ సినిమా ద్వారా నటునిగా కూడా పరిచయం అవుతున్నారు. వచ్చే నెల తొలి వారంలో పాటల్ని, అదే నెలలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: డేమిల్ జేవియర్ ఎడ్వర్డ్స్, నిర్మాణం: శివాని శివాత్మిక మూవీస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement