![Rajolu Jana Sena Social Media Posts Against TDP MLC Candidate Viral](/styles/webp/s3/article_images/2025/02/17/Rajolu-Jana-Sena-Social.jpg.webp?itok=naeeDjNt)
అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు.
సోషల్ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’..
‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.
జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్‌ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.
రాజశేఖర్ నేపథ్యం..
ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు.
ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి
Comments
Please login to add a commentAdd a comment