razole
-
జనసేనకు షాక్: వైఎస్సార్సీపీలో చేరిన బొంతు రాజేశ్వర రావు
-
రాజోలులో పవన్ కళ్యాణ్ కు ఎదురు దెబ్బ..
-
నారా భువనేశ్వరి సమక్షంలో టీడీపీలో వర్గ విభేదాలు
సాక్షి, కోనసీమ జిల్లా: నారా భువనేశ్వరి సమక్షంలో రాజోలు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నారా భువనేశ్వరి పర్యటనలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది.రాజోలు మండలం శివకోడులో నారా భువనేశ్వరిని కలవడానికి తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల రాగా, ఆమెను లోపలికి రానివ్వకుండా గొల్లపల్లి సూర్యారావు వర్గీయులు తోసేశారు. ఇటీవల రాజోలులో జరిగిన లోకేష్ పాదయాత్ర లో సర్పంచ్ రత్నమాల ప్లెక్సీలను గొల్లపల్లి వర్గం చించేశారు. అప్పట్లో టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
సామాజిక సాధికారత సీఎం జగన్ వల్లే సాధ్యం: రాజోలు వైఎస్ఆర్సీపీ నేతలు
-
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్ బయటకు వస్తుంది. గ్యాస్ లీక్‌తో మంటలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు(ఓఎన్జీసీ) సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలలను ఆర్పడంతోపాటు బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి మూడు వైపులా మూసేసిన ఓఎన్జీసీ ఆన్ షోర్ బావులు ఉన్నాయి. అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: అదుర్స్.. సిరి ధాన్యాల టిఫిన్స్.. తింటే లాభాలేంటో తెలుసా? -
చెల్లుబోయిన శ్రీనివాస్ పై ధ్వజమెత్తిన గొల్లపల్లి శ్రీనివాస్
-
Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే బిక్కిన మృతి
సాక్షి, రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిక్కిన గోపాలకృష్ణారావు (83) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం తాటిపాకలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రాజోలు నుంచి అప్పటి దేవదాయ శాఖ మంత్రి రామలింగరాజుపై పోటీ చేసి గోపాలకృష్ణారావు గెలుపొందారు. అగ్రికల్చరల్ బీఎస్సీ చదివిన ఆయన తాటిపాక గ్రామంలోనే ఉంటూ వ్యవసాయంపై ఆసక్తి చూపుతూ పలు పంటలు పండించేవారు. 1950వ దశకంలో తాటిపాక సర్పంచ్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గోపాలకృష్ణారావు మృతి పట్ల రాజోలు ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరు కృష్ణంరాజు, మానేపల్లి అయ్యాజీ వేమా, పాముల రాజేశ్వరీదేవి సంతాపం వ్యక్తం చేశారు. -
రాజోలు నియోజకవర్గం లో పర్యటించిన బొంతు రాజేశ్వరరావు
-
జనసేన ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
సాక్షి, తూర్పుగోదావరి : రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావుకు, రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు హోకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
పవన్ అభిమానుల ఓవర్‌యాక్షన్
సాక్షి, రాజోలు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజోలు నియోజక వర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఈ ఉదయం పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. (చదవండి: ‘పావలా కల్యాణ్’ అంటూ ట్వీట్ చేసిన హీరోయిన్) -
రాపాక అరెస్ట్.. రాజోలులో హైడ్రామా
సాక్షి, రాజోలు(తూర్పు గోదావరి): జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాక రాజోలులో హైడ్రామా నెలకొంది. రాపాక పోలీసులకు లొంగిపోయిన వెంటనే జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యే మద్దతుదారులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ బయట బైఠాయించారు. అనంతరం రాపాకను రాజోలు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. పోలీసులు ఎంత వారించినా వారు వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాపక తన మద్దతుదారులతో కలిసి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు . దీంతో కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు చివరికి ఎమ్మెల్యేను కోర్టుకు తరలించారు. ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: ‘బాధ్యతా రహితంగా జనసేన ఎమ్మెల్యే తీరు’ పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే -
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే
సాక్షి, తూర్పు గోదావరి : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. రాజోలు నియోజకర్గం మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో రాపాకతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాపాక ఏ1గా ఉన్నారు. మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి : పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే ‘బాధ్యతా రహితంగా జనసేన ఎమ్మెల్యే తీరు’ -
ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు
సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ స్థాయిలో సొమ్ములు వసూలు చేసి ఓ మోసగాడు పరారైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. బాధితుల కథనంప్రకారం.. రాజోలు మండలం మలికిపల్లి గ్రామానికి చెందిన జోగి శ్రీనివాసరావు అనే వ్యక్తి జిల్లాలో అనేక మందితోపాటు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరుద్యోగులను వలలో వేసుకొని వారికి మాయమాటలు చెప్పి కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా మోసపోయిన వారు సుమారు 50 మంది వరకు ఉంటారని, రూ.1.80 కోట్లమేర స్వాహా చేసి నిందితుడు ఉడాయించాడని బాధితులు లాలాచెరువుకు చెందిన ఎం.శివ ప్రసాద్, కాతేరు గ్రామానికి చెందిన టి.హేమల రావు, నక్కా జయరాజు, కాకుల పాటి వీరేష్ కుమార్ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు ఎర ఈ వ్యవహారంలో మధ్యవర్తులు పంపన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నిరుద్యోగులకు ఎరవేసి జోగి శ్రీనివాసరావు రెండో భార్య అయిన ఆళ్లపు మంగ అకౌంట్లో నిరుద్యోగుల నుంచి నగదు వేయించుకుని మరో రెండు, మూడు రోజుల్లో ఉద్యోగానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని నమ్మించి అనంతరం కనిపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. నిందితుడు హైదరాబాద్‌కు పరారైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. -
ఇదీ చంద్రబాబు తెలివి : వైఎస్ షర్మిల
సాక్షి, తూర్పుగోదావరి : గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 600లకు పైగా హామీలు తుంగలో తొక్కిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అని ఓ పుస్తకాన్ని తయారు చేసి మరోసారి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. కొత్త మేనిఫెస్టోలో 50 శాతం మేర గత ఐదేళ్లలో ఇచ్చిన వాగ్ధానాలను, మరో 50 శాతం వైఎస్సార్ సీపీ మేనిఫోస్టోలని హామీలను కాపీ కొట్టారని ఆరోపించారు. కనీసం పాత మేనిపెస్టోను పార్టీ వెబ్సైట్లో పెట్టే ధేర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు.ప్రతిపక్ష పార్టీ హామీలను కాఫీకొట్టి తమ మేనిఫోస్టోలో చేర్చుకోవడమే చంద్రబాబు నాయుడు తెలివితేటలని ఎద్దేవా చేశారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. గత 40 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో.. ఈ ఐదేళ్లలో అంత అవినీతి జరిగిందన్నారు. రాఫ్ట్రాన్ని చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ దోచుకుతిన్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టేసి ఇప్పుడు మీ భవిష్యత్ - నా బాధ్యత’ అంటూ వస్తున్నారని విమర్శించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. అవినీతి పాలన పోవాలంటే, రైతే రాజు కావాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వరరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి అనురాధను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభలో ఆమె ఇంకా ఏమన్నారంటే.. అది వైఎస్సార్ రికార్డు రాజోలు నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఆంధ్రరాఫ్ట్రానికి కేవలం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి. ఇలాంటి పథకాలు తేవాలని, ఇలా అమలు చేసి చూపాలని ఓ మాదిరిగా నిలిచారు. ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించేలా పరిపాలన అందించారు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చందబాబు గారు. వెన్నుపోటుకు, అవినీతికి, అబద్దానికి మారు పేరు చంద్రబాబు నాయుడు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. కమీషన్ కోసం పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం? ఇది అమానుషం కాదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. కానీ కమిషన్ మింగొచ్చనని చంద్రబాబు ఆ ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. నిజానికి ఇది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కానీ కమీషన్ కోసం చంద్రబాబు తీసుకున్నారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. పాత మేనిఫెస్టోను వెబ్సైట్లో పెట్టే ధైర్యం లేదు గత ఎన్నికల్లో 600లకు పైగా హామీలను ఇచ్చారు. అవన్ని పాతిపెట్టారు. కనీసం ఆ పాత మేనిఫెస్టోను వెబ్సైట్లో పెట్టే ధైర్యం కూడా చేయలేదు.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అని కొత్త పుస్తకాన్ని తయారు చేశారు. నమ్ముతారా? నమ్మకండి బైబై బాబు అని చెప్పండి. ఆ మేనిఫెస్టోలో ఈ ఐదేళ్లలో వాళ్లు తీర్చని వాగ్ధానాలు మళ్లీ పెట్టారు. మరో 50శాతం వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలను కాపీ కొట్టారు. ఇది చంద్రబాబు తెలిపితేటలు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? అమరావతి.. నాకు అనుభవం ఉందని, హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే కడతా అన్నారు. ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. ఎవరికొచ్చింది జాబు? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చెశారు. ఈ పప్పుగారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగు రాదు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఎప్పుడు ఎలా మాట మారుస్తారో ఆయనకే తెలియదు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. కానీ హోదా తేలేకపోయారు. గత ఎన్నికల ముందు హోదా అన్నారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్నారు. తర్వత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమి అంటారో అతనికే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడు ఒక్కమాట కాదు. అందుకే రెండు వేళ్లు చూపించుకుంటూ తిరుగుతారు. దానికి అర్థం ఏంటంటే నాకు రెండు నాలుకు ఉన్నాయి. నాది రెండు నాలుక ధోరణి అని అర్ధం. అంటే చంద్రబాబు ఎప్పుడు ఎలా మాట మారుస్తారో ఆయనకే తెలియదు. రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది. జగన్ సింగిల్‌గానే వస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోదా కోసం చేయని పోరాటం లేదు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అఖరికి వైఎస్సార్సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చెయించారు. చంద్రబాబు ఇవాళ యూటర్న్ తీసుకొని హోదా అంటున్నాడు అంటే దానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా? కానీ చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పరు. నిజాలు మాట్లాడే దమ్ములేదు. చంద్రబాబు నెత్తి మీద శాపం ఉందట. ఏ రోజు అయితే చంద్రబాబు నిజాలు మాట్లాడుతాడో ఆ రోజు తల వేయ్యి ముక్కలు అవుతాయట. అందుకే చంద్రబాబు నిజం మాట్లాడరు. పొత్తులు పెట్టుకున్నది చంద్రబాబు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి సింగింల్గానే బంపర్ మెజారిటితో గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేనను, కేజ్రీవాల్‌ను, మమతా, ఫరూక్ అబ్దుల్లా దేవగౌడ.. ఇలా ఎవరు తోడు వస్తే వాళ్లను గుంపుగా వేసుకొని తిరుగుతున్నారు నక్క చంద్రబాబు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని పాతాళంలోకి చంద్రబాబు హయంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అజయ్ కలాం చెబుతున్నారు.. 40 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో ఈ ఐదేళ్లలో చంద్రబాబు అంత అవినీతి చేశారట. ఏమైంది ఆ డబ్బంతా? తండ్రి కొడుకులు కలిసి మింగేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టేసి ఇప్పుడు మీ భవిష్యత్ - నా బాధ్యత’ అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్ భవిష్యత్ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? ఈ ఐదేళ్లు లోకేష్ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలట. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తే మీ భవిష్యత్ నాశనం చేస్తారు. జాగ్రత్త.. ఈ నారాసుర రాక్షసులను నమ్మి మోసపోకండి. రాజేశ్వరరావు, అనురాధలను భారీ మెజారిటీతో గెలిపించండి ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వరరావు, అమలాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి అనురాధను భారీ మెజారీటీతో గెలిపించండి.మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
194వ రోజు ముగిసిన పాదయాత్ర
-
ఆర్థిక ఇబ్బందులు తాళలేక డిగ్రీ విద్యార్థిని మృతి
పాశర్లపూడి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య రాజోలు : ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తలెత్తున్న గొడవలతో మనస్తాపానికి గురై కడలి గ్రామానికి చెందిన అప్పారి భవాని (19) పాశర్లపూడి వైనతేయ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భవాని మామిడికుదురు దీప్తి కళాశాలలో బీఏ చదువుతోంది. శనివారం ఉదయం కళాశాలకు వెళ్లిన భవాని పాశర్లపూడి వెళ్లి బోడసకుర్రు వంతెన మీద నుంచి గోదావరిలో దూకింది. దీంతో స్థానికులు భవాని కళాశాల గుర్తింపు కార్డు ద్వారా కళాశాలకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. భవాని మృతదేహాన్ని వెలికి తీసి రాజోలు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. భవాని తండ్రి సత్యనారాయణ, తల్లి మహలక్ష్మి ఆర్థిక ఇబ్బందుల వల్ల తరచూ గొడవ పడుతుండేవారని, దీంతో భవాని మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై వివరించారు. -
చదువుకున్న బడి కన్నతల్లి
మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామయ్య ముగిసిన శతాబ్ది ఉత్సవాలు రాజోలు : చదువుకున్న బడి కన్నతల్లి వంటిదని కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య అన్నారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో చదువుకున్న రోజులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కన్నతల్లిని, చదువుకున్న పాఠశాలను ఎవరూ మర్చిపోవద్దన్నారు. చదువుకున్న స్నేహితులను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బుల్లిరామయ్యను సత్కరించారు. ఉత్సవాలకు వచ్చిన పూర్వ విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన ఆయనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలు నిర్వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు హెచ్ఎంలుగా పనిచేసిన వారితోపాటు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులను సత్కరించారు. చదువుకున్న రోజులు తిరిగిరావు : దర్శకుడు సుకుమార్ చిన్నతనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకున్న రోజులు తిరిగిరావని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. నాటి జ్ఞాపకాలు తీపిగుర్తులుగా నిలిచిపోతాయన్నారు. పూర్వపు రోజులే మంచివని, ప్రస్తుతం బిజీ జీవితాలతో పిల్లలతో గడపలేకపోతున్నారన్నారు. ఉత్సవాలకు విచ్చేసిన స్నేహితులతో ఆయన గడిపారు. తనకు విద్య నేర్పిన మద్దుల రాధాకృష్ణ, సోమయాజులు మాస్టార్లను సుకుమార్ సత్కరించారు. అనంతరం సుకుమార్‌ను ఉత్సవ కమిటీ సత్కరించింది. రాజోలు అంటే అభిమానం : సినీ నటి హేమ పుట్టిన పెరిగిన రాజోలు అంటే అభిమానమని సినీ నటి హేమ అన్నారు. ఈఉత్సవాలకు ఆమె కుటుంబ సభ్యులతో సహ వచ్చారు. పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. వారికి ఇబ్బందులు వస్తే అండగా నిలుస్తాన్నారు. ఉత్సవాలకు విచ్చేసిన హేమను ఉత్సవ కమిటీ సత్కరించింది. -
మంచి నడవడి అలవర్చండి
గురుశిష్యుల అనుబంధం పెరగాలి డిప్యూటీ సీఎం చినరాజప్ప వైభవంగా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం పూర్వ విద్యార్థులకు సత్కారం రాజోలు : విద్యార్థులకు మంచి నడవడి అలవర్చి వారిని మహోన్నతులుగా తీర్చిదిద్దాలని తద్వారా గురు శిష్యుల మధ్య అనుబంధం బలపడుతుందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం రాజోలు బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన డిప్యూటీ సీఎం చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత కూర్మా నరసింహారావు దంపతులు శంఖాన్ని పూరించి ఉత్సవాలకు స్వాగతం పలికారు. రాజప్ప మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల రాకతో విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్న మైందన్నారు. తాము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలే కీలకంగా నిలిచాయన్నారు. 50 ఏళ్ల క్రితం ఉన్న గురుశిష్యుల అనుబంధం ఇప్పుడు కనిపించడం లేదన్నారు. గురు శిష్యుల మధ్య ప్రేమానురాగాలు పెంచాలన్నారు. గతంలో వార్షికోత్సవాలు నిర్వహించేవారని ప్రస్తుతం ఆ సంస్కృతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ‘నేను’ అని స్వార్థం చూపకుండా ‘మన సమాజం’ అనే భావన అందరిలో కలిగినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ ఎంతో మంది బాలుర ఉన్నత పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులు శతాబ్ది ఉత్సవాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. సినీనటి హేమ మాట్లాడుతూ చదువును మధ్యలో ఆపకుండా ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలన్నారు. తొలుత ఎమ్మెల్యే సూర్యారావు జాతీయ, పాఠశాల పతాకాలను ఆవిష్కరించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవ స్థూపం ఆవిష్కరించారు. రూ.32.50 లక్షలతో శతాబ్ది భవన విభాగం పనులకు శంకుస్థాపన చేశారు. ‘శతాబ్ది శార్వాణి’ ఆవిష్కరణ డిప్యూటీ సీఎం చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ రాంబాబులు ‘శతాబ్ది శార్వాణి’ సంచికను ఆవిష్కరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని జబర్దస్త్ టీం కామెడీ షో, వై.రామ్మోహనరావు మ్యాజిక్ షో, పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీనియర్ పూర్వ విద్యార్థులు నున్న నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది వెంపరాల గోపాలకృష్ణ, కేశవరావు, మాధవరావు, కొండేపూడి వెంకట్రావు, కొమ్ముల సత్యనారాయణ స్వామి, ఆరుమిల్లి సుబ్బారావు, యర్రాప్రగడ రామకృష్ణ తదితరులను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ అనచూరి సునీత, సర్పంచ్ మట్టా కృష్ణకుమారి, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు పొన్నాడ హనుమంతరావు, అధ్యక్షుడు కోళ్ల వెంకన్న, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు ముదునూరి అక్కిరాజు, కన్వీనర్ పామర్తి రమణ, ప్రధాన కార్యదర్శి పొన్నాడ సూర్యారావు, కోశాధికారి కాసు శ్రీను, ఉత్సవాల ప్రచార కర్త దారపురెడ్డి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి కళ్లెదుటే తండ్రి దుర్మణం
రాజోలు : మోటార్‌సైకిల్ అదుపుతప్పిన ప్రమాదంలో రాజోలుకు చెందిన గెడ్డం బాలాజీబాబు(36) మంగళవారం మృతి చెందాడు. అతని కుమారుడు అభిషేక్‌బాబుకు స్వల్పగాయాలయ్యాయి. రాజోలు పోలీస్క్వార్టర్స్ సమీపంలో హోటల్ నిర్వహించుకునే బాలాజీబాబు తన ఆరేళ్లు అభిషేక్‌బాబుతో కలసి మోటార్‌సైకిల్‌పై సొంత ఊరు పాశర్లపూడికి బయలుదేరారు. తమతో పాటు ప్లాస్టిక్ టేబుల్ విడిభాగాలుగా చేసి తీసుకువెళ్తున్నారు. టేబుల్ పైభాగాన్ని మోటార్‌సైకిల్ హ్యాండిల్‌పై పెట్టుకుని బాలాజీబాబు నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో మోటార్‌సైకిల్ వేగానికి ఎదురు గాలి తోడుకావడంతో టేబుల్‌పై భాగం ఒక్కసారిగా బాలాజీబాబు ముఖం మీదకు ఎగిరింది. దీంతో ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో మోటార్‌సైకిల్ అదుపు తప్పి పాంచాల రేవును వేగంగా ఢీ కొట్టింది. బాలాజీబాబు ఎగిరి కొండాలమ్మ ఆలయం గోడపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. వెనుక కూర్చున్న కుమారుడు అభిషేక్‌బాబుకు స్వల్పగాయాలయ్యాయి. తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు 108 అంబులె¯Œ్సకు సమాచారం ఇచ్చారు. అంబులె¯Œ్స వచ్చే లోగా బాలాజీ బాబు కన్నుమూశాడు. కుమారుడిని స్థానికులు మోటర్‌సైకిల్‌పై రాజోలు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలాజీబాబుకు భార్య, కుమారుడు, ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నారు. చిన్నాన్న గెడ్డం శాంతమూర్తి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మణరావు చెప్పారు. -
మాదే కదా రేపు.. అందుకు సాక్ష్యం ఈ కూరుపు..
కొత్త సంవత్సరం వస్తోందంటేనే బోలెడు సందడి, సంబరం. కంటికి కనబడని కాలం చుట్టూ కోటి కలలు, ఆశలు. శనివారం అర్ధరాత్రి కాలిడనున్న ‘2017’ సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు కడలి గ్రామంలోని నలంద పాఠశాల విద్యార్థులు. శుక్రవారం 270 మంది విద్యార్థులు ‘2017’ సంఖ్య ఆకృతి వచ్చేలా కూర్చుండగా, మరో130 మంది విద్యార్థులు వారి చుట్టూ వలయంలా నిలుచున్నారు. కరస్పాండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. ఎంపీపీ అనచూరి సునీత, కడలి, ములికిపల్లి సర్పంచ్‌లు వడి సత్యం, అనచూరి రామపురుషోత్తం, న్యాయవాది అప్పారి హరిబాబు విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు. –కడలి (రాజోలు) -
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
గొంతు నులిమి హత్య ప్రియుడితో కలసి ఘాతుకం రాజోలు : ఒక చర్చి నిర్వహణ విషయంలో తలెత్తిన వివాదంలో ఒక మహిళ తన ప్రియుడితో కలసి మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన కందికట్ల ఇమ్మానియేలు(53)ను గొంతు నులిమి హత్య చేశారు. హత్యకు పాల్పడ్డ అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల గ్లోరీ అలియాస్ నక్కా గ్లోరి, ఆమె ప్రియుడు విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన నల్లి జ్యోతిప్రసాద్‌లను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య, సీఐ క్రిస్టోఫర్ రాజోలు సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్టోబరు 8వ తేదీన ఇమ్మానియేల్ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు మలికిపురం పోలీస్‌స్టేçÙ¯Œలో ఫిర్యాదు చేశారు. ఇమ్మానియేల్ కనిపించకపోవడంపై గ్లోరీ, ఆమె ప్రియుడు జ్యోతిప్రసాద్లపై వారు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో లక్కవరం కేర్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్న జ్యోతిప్రసాద్ చాలా తెలివిగా వ్యవహరించి మృతదేహాన్ని సర్జికల్ వేస్ట్ మెటీరియల్ కాల్చే స్థలంలో వేసి స్పిరిట్ వినియోగించి ప్రియురాలు గ్లోరితో కలసి కాల్చివేశాడని డీఎస్పీ వివరించారు. ఇమ్మానియేల్‌కు వచ్చిన ఫో¯ŒS కాల్స్ ఆధారంగా విచారణ చేయగా చివరిగా ఇమ్మానియేల్‌కు జ్యోతిప్రసాద్ ఫో¯ŒS చేయడంతో అతనిపై నిఘా పెట్టామని ఆయన తెలిపారు. ఇమ్మానియేల్ కనిపించకుండా పోయిన రోజే కత్తిమండలోని మామిడితోట సమీపంలో అతనిని హత్యచేసి గ్లోరీ, జ్యోతిప్రసాద్లు స్కూటర్‌పై లక్కవరంలోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చి మృతదేహాన్ని కాల్చివేశారని ఆయన తెలిపారు. నిందితులు ఇరువురిని రాజోలు కోర్టులో హాజరు పర్చామని డీఎస్పీ అంకయ్య తెలిపారు. -
హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుండెపోటు కారణమంటున్న వైద్యుడు l ఒత్తిడి వల్లే చనిపోయిందంటున్న ప్రజా సంఘాలు రాజోలు : రాజోలు గురుకుల కళాశాల ఇంటర్మీడియేట్ ఫస్టియర్ విద్యార్థిని గోడ రాణి (17) గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. స్టడీ అవర్ కోసం విద్యార్థినులంతా నిద్రలేచినప్పటికీ రాణి నిద్ర లేవలేదు. దీంతో తోటి విద్యార్థినులు కోట ప్రశాంతి , గురజ శిరీషలు కంగారుపడి అటెండర్ ఇంజేటి వరలక్షి్మకి సమాచారం అందించారు. వారంతా రాణిని రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ సర్వూప్ విద్యార్థిని రాణి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటు కారణమని అభిప్రాయపడ్డారు. విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మత్తి జ్యోత్స్న సుజ్ఞానవల్లి మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాజోలు సీఐ క్రిషో్టఫర్ తెలిపారు.రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితమే ఇంటికి.. నాలుగు రోజుల క్రితమే రాణి ఇంటికి వచ్చిందని ఆమె తండ్రి వెంకటేశ్వరరావు భోరున విలపించాడు. ఆస్పత్రి వద్ద ఉన్న కుమార్తె మృతదేహం వద్ద కుçప్పకూలిపోయాడు. కుమార్తెను కళాశాలలో చేర్పించాక తన భార్య ధనలక్ష్మి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిందని, భార్యకు ఏం సమాధానం చెప్పాలంటూ విలపించాడు. వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు ఏసీ మెకానిక్, చిన్న కుమారుడు ఐదో తరగతి చదువుతున్నాడు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
రాజోలు : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన మేడిచర్ల నాగభూషణాన్ని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జీవీ కృష్ణారావు విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన నాగభూషణం జిల్లాలోని రాజోలు, నగరం, అమలాపురం, మలికిపురం, రావులపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో పలు చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి వచ్చిన అతడు మళ్లీ చోరీల బాట పట్టాడు. రాజోలు, మలికిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదు సవర్ల బంగారం, రూ.10 వేల నగదు చోరీ చేశాడు. శివకోడులోని ఒక బ్రాందీషాపు వద్ద నాగభూషణాన్ని పోలీసులు పట్టుకుని రాజోలు కోర్టులో హాజరుపర్చారు. అమలాపురం డీఎస్పీ అంకయ్య పర్యవేక్షణలో సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎస్సై లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేశారు. కేసు పురోగతిని సాధించేందుకు కృషి చేసిన ట్రైనీ ఎస్సై అజయ్‌బాబు, సర్కిల్ క్రైం హెచ్‌సీ బొక్కా శ్రీనివాస్, పీసీలు డి.శివకుమార్, డి.రమేష్‌బాబు, ఎ.జయరామ్‌ను సీఐ అభినందించారు. వీరిని రివార్డులకు సిఫారసు చేస్తానన్నారు. -
సైబర్ నేరాల విచారణకు ప్రత్యేక కేంద్రాలు
రాజోలు : మితిమీరుతున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు, వాటిని త్వరితగతిన విచారణ చేసేందుకు అన్ని జిల్లా పోలీసు కేంద్రాల్లో సైబర్ నేరాల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు. రాజోలులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలను పరిశోధన చేసేందుకు కొన్ని జిల్లాల్లోనే ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అన్ని జిల్లాల్లో సైబర్ నేరాల పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దశలవారీగా సబ్ డివిజన్ స్థాయిలో డీఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో నూతనంగా వచ్చిన మార్పుల మేరకు కేసులను వేగంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. చట్టంలో మార్పులను సామాన్య ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ దొంగతనాలు, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులను తగ్గించడంతో పాటు చోరీసొత్తు రికవరీపై పోలీసు శాఖ దృష్టి సారించిందని వివరించారు. పోలీసు భవన సముదాయాల నిర్మాణాలపై ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. పోలీసు స్టేషన్ నూతన భవనం ప్రారంభం అంబాజీపేట : ఏజెన్సీతో పాటు జిల్లాలోని ఇతర మండలాల్లోనూ దశలవారీగా పోలీసు స్టేషన్ భవనాలు నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. అంబాజీపేటలో పోలీసు శాఖ గృహ నిర్మాణ సంస్థ నిధులు రూ.68 లక్షలతో నిర్మించిన పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని హోం మంత్రి, డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసు క్వార్టర్ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ర్ట విభజన తర్వాత విలీన మండలాల కారణంగా సిబ్బందిని ఆయా ప్రాంతాలకు బదిలీ చేశామని, త్వరలో నోటిఫికేషన్ ద్వారా పోలీసు సిబ్బందిని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అమలాపురం గడియార స్థంభం సెంటర్లో ఉన్న దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన భవనం శిథిలావస్థకు చేరిందని, అందులో ఉన్న సర్కిల్ ఆఫీసుకు నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. -
ఆటో-ఆర్టీసీ బస్సు ఢీ
రాజోలు : ఆటో-ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్‌తోపాటు నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. శుక్రవారం శివకోడు కోనవారి గ్రూపు సమీపంలో ఉన్న చర్చి వద్ద ఆటో-బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సఖినేటిపల్లి రత్నాలపేటకు చెందిన గొల్ల రత్నకుమారి (35) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో లో ఉన్న తెన్నేటి దీనమ్మ, పమ్మి ఏస్తేరు, కొల్లాబత్తుల దీవెన, కొల్లాబత్తుల శ్రీలక్ష్మి గాయపడ్డారు. శ్రీలక్ష్మి తలకు బలమైన గాయం కావడంతో అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలిం చారు. గాయపడ్డ ఆటో డ్రైవర్ కొండేటి ముత్యాలు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సై లక్ష్మణరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం డిపోకి చెందిన బస్సు అమలాపురం వెళ్తుంది. రాజోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన సఖినేటిపల్లి రత్నాలపేట వాసులు నేరుగా అదే ప్రాంతానికి చెందిన కొండేటి ముత్యాలు ఆటోను కిరాయికి మాట్లాడుకున్నారు. ఆ ఆటోలో రాజోలు నుంచి సఖినేటిపల్లి బయలుదేరారు. శివకోడు కోనవారి గ్రూపు వద్దకు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న భీమవరం - అమలాపురం బస్సును ఆటో ఢీ కొంది. ఆటోను వేగంగా నడుపుతున్న వికలాంగుడైన డ్రైవర్ ముత్యాలు దానిని అదుపు చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రత్నకుమారి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న తెన్నేటి దీనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.