- గొంతు నులిమి హత్య
- ప్రియుడితో కలసి ఘాతుకం
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
Published Thu, Dec 15 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
రాజోలు :
ఒక చర్చి నిర్వహణ విషయంలో తలెత్తిన వివాదంలో ఒక మహిళ తన ప్రియుడితో కలసి మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన కందికట్ల ఇమ్మానియేలు(53)ను గొంతు నులిమి హత్య చేశారు. హత్యకు పాల్పడ్డ అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల గ్లోరీ అలియాస్ నక్కా గ్లోరి, ఆమె ప్రియుడు విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన నల్లి జ్యోతిప్రసాద్‌లను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య, సీఐ క్రిస్టోఫర్ రాజోలు సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్టోబరు 8వ తేదీన ఇమ్మానియేల్ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు మలికిపురం పోలీస్‌స్టేçÙ¯Œలో ఫిర్యాదు చేశారు. ఇమ్మానియేల్ కనిపించకపోవడంపై గ్లోరీ, ఆమె ప్రియుడు జ్యోతిప్రసాద్‌లపై వారు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో లక్కవరం కేర్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్న జ్యోతిప్రసాద్ చాలా తెలివిగా వ్యవహరించి మృతదేహాన్ని సర్జికల్ వేస్ట్ మెటీరియల్ కాల్చే స్థలంలో వేసి స్పిరిట్ వినియోగించి ప్రియురాలు గ్లోరితో కలసి కాల్చివేశాడని డీఎస్పీ వివరించారు. ఇమ్మానియేల్‌కు వచ్చిన ఫో¯ŒS కాల్స్ ఆధారంగా విచారణ చేయగా చివరిగా ఇమ్మానియేల్‌కు జ్యోతిప్రసాద్ ఫో¯ŒS చేయడంతో అతనిపై నిఘా పెట్టామని ఆయన తెలిపారు. ఇమ్మానియేల్ కనిపించకుండా పోయిన రోజే కత్తిమండలోని మామిడితోట సమీపంలో అతనిని హత్యచేసి గ్లోరీ, జ్యోతిప్రసాద్‌లు స్కూటర్‌పై లక్కవరంలోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చి మృతదేహాన్ని కాల్చివేశారని ఆయన తెలిపారు. నిందితులు ఇరువురిని రాజోలు కోర్టులో హాజరు పర్చామని డీఎస్పీ అంకయ్య తెలిపారు.
Advertisement
Advertisement