సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్ బయటకు వస్తుంది. గ్యాస్ లీక్‌తో మంటలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు(ఓఎన్జీసీ) సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలలను ఆర్పడంతోపాటు బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి మూడు వైపులా మూసేసిన ఓఎన్జీసీ ఆన్ షోర్ బావులు ఉన్నాయి. అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: అదుర్స్.. సిరి ధాన్యాల టిఫిన్స్.. తింటే లాభాలేంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment