breaking news
ONGC gas
-
కోనసీమ గుండెల్లో బ్లో అవుట్ మంటలు (ఫోటోలు)
-
ఇరుసుమండ గ్యాస్ లీక్.. తగ్గుముఖం పట్టిన బ్లోఔట్ మంటలు
సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఔట్ మంటలు తగ్గుముఖం పట్టాయి. ఓఎన్జీసీ సిబ్బంది నిరంతర ప్రయత్నాలతో మంటలు చాలావరకు అదుపులోకి వచ్చాయి.మూడు వైపులా నీటిని వెదజల్లే విధంగా ప్రత్యేకంగా వాటర్ అంబరిల్లా ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికతతో మంటలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదనంగా మరో పైప్‌ను అమర్చుతూ మంటలను మరింత త్వరగా పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. మరోవైపు బ్లోఔట్ ప్రభావంతో గ్రామంలోని వందలాది కొబ్బరి చెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంటలతో అనేక చెట్లు దగ్ధమయ్యాయి. నాట్లు వేయడానికి సిద్ధంగా ఉంచిన వరి పొలాల్లో నీరు ఇంకిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరుసు మండ గ్రామంలో జరిగిన బ్లోఔట్ ఘటన స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున భయాందోళన కలిగించినా.. ఓఎన్జిసి సిబ్బంది చర్యలతో మంటలు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించింది. పంటలు, చెట్లు దెబ్బతిన్నా, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నిన్న మధ్యాహ్నం ఓఎన్జీసీ గ్యాస్ లీకై.. సోమవారం మధ్యాహ్నం నుంచి ఓఎన్జీసీ గ్యాస్ లీకైనప్పటికీ.. బావిలో చోటు చేసుకున్న బ్లో అవుట్ మంటలు రెండో రోజు కొనసాగాయి. దీంతో ఇరుసుమండ సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బావి నుండి భారీగా లీక్ అవుతున్న గ్యాస్ ఎగిసి పడుతూ మంటలు విస్తరించాయి. ఈ ఘటనతో గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలు భయంతో ఇళ్లలోనే తలదాచుకున్నారు. గంటల కొద్ది సమయం గడుస్తున్నప్పటికీ ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ అదుపులోకి రాలేదు. దీంతో ఢిల్లీ నుండి ఓఎన్జిసి నిపుణుల బృందం రంగంలోకి దిగింది. వాటర్ అంబరిల్లా సాంకేతికతతో నాలుగు వైపుల నుండి నీళ్లు విరజిమ్మి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇందుకు అవసరమైన పైప్లైన్లు, మిషనరీలను నరసాపురం నుండి తరలించారు.16 గంటలకుపైగా నిరంతరంగా మంటలు ఎగిసి పడుతున్న ఈ ఘటనతో ఇరుసుమండ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా సమీప ప్రాంతాల వారు కూడా ఆందోళన చెందారు. నిపుణుల బృందం రాకతో మంటలు అదుపులోకి రావడంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. Fire at an ONGC well in Andhra Pradesh's Konaseema continues to rage a day after a gas leak here led to massive evacuations from three villages within a four-km radius on Monday. No deaths or casualties have been reported so far.According to a press release from the Konaseema… pic.twitter.com/dux5wJw2bC— Vani Mehrotra (@vani_mehrotra) January 6, 2026 -
కోనసీమ జిల్లాలో ONGC గ్యాస్ లీక్.. మరో 24 గంటలు ఆందోళన
సాక్షి,ఇరుసుమండ: కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్‌లీకేజీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్యాస్లీకేజీపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. లీకైన గ్యాస్‌ను అదుపు చేసేందుకు మరో 24 గంటల సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. 1993 నుంచి ఆపరేషన్‌లో ఉన్న వెల్‌లో ఈ బ్లో అవుట్ చోటుచేసుకుంది. 2024లో ‘డీప్’ అనే కంపెనీకి సబ్ లీజ్ ఇచ్చారు. 2,500 మీటర్ల లోతులో ఒక లేయర్లో ఎక్స్‌ప్లోరేషన్ ప్రయత్నం జరుగుతుండగా, అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ తన్నుకొచ్చింది. ఒక గంట పాటు గ్యాస్ మాత్రమే బయటికి వచ్చింది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. వెల్‌లో 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల భద్రత కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓఎన్జిసి ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. వెల్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకోవడానికి కనీసం మరో 24 గంటలు పట్టే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.A explosion occurred at the border of Lakkavaram Irusumanda villages in Malikipuram mandal, Konaseema. Large quantities of gas are gushing out from an ONGC pipeline, spreading like a thick fog for nearly a kilometer.The incident has triggered panic and fear among local… pic.twitter.com/nvHarm2xmn— Sowmith Yakkati (@YakkatiSowmith) January 5, 2026ఇరుసుమండ బ్లో అవుట్ పై ఓఎన్జిసి ప్రకటన చేసింది. ‘గ్యాస్ లీక్ ఘటనలో ఎవరూ చనిపోలేదు, ఎవరికి గాయాలు కాలేదు. రిమోట్ ఏరియాలో ఎలాంటి నివాస ప్రాంతాలు లేవు. గ్యాస్ లీక్ ప్రాంతంలో కూలింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ టీములను మొబలైజ్ చేశాం. పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే గ్యాస్ బావిని మూసివేస్తాం.అంతర్జాతీయ నిపుణులతో సమన్వయం చేసుకొని, అధునాతన వ్యవస్థతో నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓఎన్జిసి సీనియర్ మేనేజ్మెంట్ సాంకేతిక ని పనులు పరిస్థితిని నిషితంగా అంచనా వేస్తున్నారు. అవసరమైన అదనపు పరికరాలు నర్సాపురం సహా ఇతర ప్రాంతాల నుంచి పంపిస్తున్నాము’అని తెలిపింది. -
కోనసీమలో ONGC గ్యాస్ లీక్ తగలబడుతున్న పొలాలు
-
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
-
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్ బయటకు వస్తుంది. గ్యాస్ లీక్‌తో మంటలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు(ఓఎన్జీసీ) సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలలను ఆర్పడంతోపాటు బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి మూడు వైపులా మూసేసిన ఓఎన్జీసీ ఆన్ షోర్ బావులు ఉన్నాయి. అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: అదుర్స్.. సిరి ధాన్యాల టిఫిన్స్.. తింటే లాభాలేంటో తెలుసా? -
ఓఎన్జీసీ గ్యాస్‌పై ధరల పరిమితి
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల పరిమితిని తేల్చేందుకు ఏర్పాటైన కిరీట్ పారిఖ్ కమిటీ తన సిఫారసులను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వరంగ సంస్థల పురాతన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజవాయువుపై ధరల పరిమితిని సూచించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీనివల్ల సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఉత్పత్తి పరంగా క్లిష్టమైన క్షేత్రాల విషయంలో ఎటువంటి మార్పుల్లేకుండా ప్రస్తుత ధరల విధానానికే మొగ్గు చూపించనుంది. అంతిమంగా వినియోగదారుడికి సహేతుక ధర ఉండేలా సిఫారసులు ఇవ్వాలని ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం గతంలో కోరడం గమనార్హం. పాత కాలం నాటి గ్యాస్ క్షేత్రాలను ఎక్కువగా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా నిర్వహిస్తున్నాయి. వీటికి సంబంధించి వ్యయాలను ఇప్పటికే ఈ సంస్థలు రికవరీ చేసుకుని ఉంటాయన్న ఉద్దేశ్యంతో ధరల పరిమితికి కమిటీ మొగ్గు చూపించనుంది. అలాగే, కిరీట్ పారిఖ్ కమిటీ కనీస ధర, గరిష్ట ధరలను కూడా సిఫారసు చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా ధరలు ఉత్పత్తి రేటు కంటే దిగువకు పడిపోకుండా చూడొచ్చన్నది ఉద్దేశ్యంగా ఉంది. గ్యాస్ ధరలు సుమారు 70 శాతం మేర పెరిగి మిలియన్ బ్రిటిష్ ధర్మ యూనిట్‌కు 8.57 డాలర్లకు చేరడం తెలిసిందే. -
ఆర్ ఐఎల్ అదనపు వ్యయాల రికవరీకి బ్రేక్!
♦ కేజీ బేసిన్‌పై కాగ్ నివేదిక ♦ ఆచితూచి వ్యవహరించాలని సూచన న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్ డీ6 గ్యాస్ బ్లాక్‌లో 1.6 బిలియన్ డాలర్ల అదనపు వ్యయాల రికవరీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజాగా బ్రేక్ వేసింది. బ్లాక్ నుంచి ఆయిల్, గ్యాస్ విక్రయం ద్వారా అదనపు వ్యయాల రికవరీకి అంగీకరించరాదని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తన తాజా నివేదికలో పేర్కొంది. డిస్కవరీ ధ్రువీకరణకు జరిపిన పరీక్షలకు సంబంధించి డిమాండ్ చేస్తున్న అదనపు వ్యయ రికవరీల విషయాన్ని కూలంకషంగా పునఃపరిశీలించాలని సూచించింది. ఓఎన్జీసీ గ్యాస్ ఫ్లోపైనా దృష్టి... ముకేశ్ అంబానీ సంస్థ నియంత్రణలోని తూర్పు ఆఫ్‌షోర్ ఫీల్డ్స్‌లోకి ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ ఫ్లోయింగ్ విషయాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. 2015 నవంబర్ డీగోల్యర్ అండ్ మెక్‌నాటన్ (డీఅండ్‌ఎం) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ సమస్యపై తదుపరి చర్యల సిఫారసుకు జస్టిస్ ఏపీ షా నేతృత్వంలో ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఒకవేళ డీఅండ్‌ఎం నివేదికను ప్రభుత్వం ఆమోదించి ఓఎన్జీసీకి పరిహారం చెల్లించాలని ఆర్ఐఎల్ను ఆదేశిస్తే.. కేజీ బేసిన్లో వ్యాపారం, లాభాలు ఇతర లావాదేవీల ఈ ప్రభావం ఉంటుందని కూడా కాగ్ విశ్లేషించింది. -
ఖరీఫ్ ఎరువుకు గ్యాస్ దెబ్బ
నగరం పేలుడుతో మూతపడ్డ ఓఎన్జీసీ బావులు.. నిలిచిన గ్యాస్ సరఫరా గ్యాస్ సరఫరా లేక ఎరువులు, విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తికి 20 రోజులుగా బ్రేక్ ఒక్క నాగార్జున కర్మాగారంలోనే నిలిచిపోయిన రోజుకు 5,000 టన్నుల ఉత్పత్తి ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా6 రాష్ట్రాలకు ఆగిన యూరియా సరఫరా ఆగస్టు వరకు విదేశీ యూరియా దిగుమతులు రావడం కష్టమే.. దిగుమతి చేసుకున్న ఎరువులతో కేంద్రంపై పెరగనున్న భారం ఈ ఖరీఫ్‌లో వ్యవసాయానికి యూరియా కటకట తప్పదు: యూరియా సంస్థలు విద్యుత్ ప్లాంట్లకూ గ్యాస్ కొరత దెబ్బ - 750 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్ కాకినాడ: కృష్ణా - గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ గ్యాస్ బావులు మూతపడటంతో.. గ్యాస్ సరఫరా లేక ఎరువుల ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఫలితంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి ఎరువులకు తీవ్ర కొరత ఎదురుకానుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని నగరం గ్రామంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) గ్యాస్ పైపులైన్ పేలుడుతో సహజ వాయువు ఉత్పత్తి చేసే సుమారు 70 ఓఎన్జీసీ బావులు మూతపడి మూడు వారాలైంది. దాంతో సహజ వాయువు సరఫరా నిలిచిపోయి, గ్యాస్‌పై ఆధారపడ్డ విద్యుత్, ఎరువుల ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. బావుల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదని పైపులైన్ల నాణ్యతపై సర్వే చేస్తున్న ‘ఇంజనీర్స్ ఇండియా’ అభిప్రాయపడుతోంది. గ్యాస్ సరఫరా లేక ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్స్ మూమెంట్స్ ఆర్డర్ ఆధారంగా జరగాల్సిన యూరియా సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో యూరియా అవసరాల్లో దాదాపు సగం యూరియా కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం తీరుస్తుంటుంది. గ్యాస్ సరఫరా లేక యూరియా ఉత్పత్తి నిలిచిపోగా మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా కూడా ఆగస్టు నెలాఖరు వరకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఖరీఫ్‌లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్‌ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్‌ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది. మూతపడ్డ పవర్ ప్లాంట్లు... గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ఖరీఫ్‌లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్‌ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్‌ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది. మూతపడ్డ పవర్ ప్లాంట్లు: గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


