ఇదీ చంద్రబాబు తెలివి : వైఎస్‌ షర్మిల | YS Sharmila Speech In Razole Public Meeting | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ హామీలను బాబు కాపీ కొట్టారు : షర్మిల

Published Sun, Apr 7 2019 1:02 PM | Last Updated on Sun, Apr 7 2019 1:39 PM

YS Sharmila Speech In Razole Public Meeting - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 600లకు పైగా హామీలు తుంగలో తొక్కిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అని ఓ పుస్తకాన్ని తయారు చేసి మరోసారి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని  వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల విమర్శించారు. కొత్త మేనిఫెస్టోలో 50 శాతం మేర గత ఐదేళ్లలో ఇచ్చిన వాగ్ధానాలను, మరో 50 శాతం వైఎస్సార్‌ సీపీ మేనిఫోస్టోలని హామీలను కాపీ కొట్టారని ఆరోపించారు. కనీసం పాత మేనిపెస్టోను పార్టీ వెబ్‌సైట్‌లో పెట్టే ధేర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు.ప్రతిపక్ష పార్టీ హామీలను కాఫీకొట్టి తమ మేనిఫోస్టోలో చేర్చుకోవడమే చంద్రబాబు నాయుడు తెలివితేటలని ఎద్దేవా చేశారు.

బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. గత 40 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో.. ఈ ఐదేళ్లలో అంత అవినీతి జరిగిందన్నారు. రాఫ్ట్రాన్ని చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ దోచుకుతిన్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టేసి ఇప్పుడు మీ భవిష్యత్‌ - నా బాధ్యత’  అంటూ వస్తున్నారని విమర్శించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ నాశనం అవుతుందన్నారు. అవినీతి పాలన పోవాలంటే, రైతే రాజు కావాలంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కావాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వరరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి అనురాధను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభలో ఆమె ఇంకా ఏమన్నారంటే..

అది వైఎస్సార్‌ రికార్డు
రాజోలు నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఆంధ్రరాఫ్ట్రానికి కేవలం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి. ఇలాంటి పథకాలు తేవాలని, ఇలా అమలు చేసి చూపాలని ఓ మాదిరిగా నిలిచారు.  ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించేలా పరిపాలన అందించారు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది.
ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చందబాబు గారు. వెన్నుపోటుకు, అవినీతికి, అబద్దానికి మారు పేరు చంద్రబాబు నాయుడు.  రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.  ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం​ మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు.

కమీషన్‌ కోసం పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారు
ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం? ఇది అమానుషం కాదా. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. కానీ కమిషన్‌ మింగొచ్చనని చంద్రబాబు ఆ ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. నిజానికి ఇది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కానీ కమీషన్‌ కోసం చంద్రబాబు తీసుకున్నారు.  మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా?  చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు.

పాత మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో పెట్టే ధైర్యం లేదు
గత ఎన్నికల్లో 600లకు పైగా హామీలను ఇచ్చారు. అవన్ని పాతిపెట్టారు. కనీసం ఆ పాత మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో పెట్టే ధైర్యం కూడా చేయలేదు.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అని కొత్త పుస్తకాన్ని తయారు చేశారు. నమ్ముతారా? నమ్మకండి బైబై బాబు అని చెప్పండి. ఆ మేనిఫెస్టోలో ఈ ఐదేళ్లలో వాళ్లు తీర్చని వాగ్ధానాలు మళ్లీ పెట్టారు. మరో 50శాతం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీలను కాపీ కొట్టారు. ఇది చంద్రబాబు తెలిపితేటలు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారా. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి.

ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా?
అమరావతి.. నాకు అనుభవం ఉందని, హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే కడతా అన్నారు. ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్‌ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి.

ఎవరికొచ్చింది జాబు?
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చెశారు. ఈ పప్పుగారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగు రాదు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.

ఎప్పుడు ఎలా మాట మారుస్తారో ఆయనకే తెలియదు
ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. కానీ హోదా తేలేకపోయారు. గత ఎన్నికల ముందు హోదా అన్నారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్నారు. తర్వత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమి అంటారో అతనికే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నారు.  ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడు ఒక్కమాట కాదు. అందుకే రెండు వేళ్లు చూపించుకుంటూ తిరుగుతారు. దానికి అర్థం ఏంటంటే నాకు రెండు నాలుకు ఉన్నాయి. నాది రెండు నాలుక ధోరణి అని అర్ధం. అంటే చంద్రబాబు ఎప్పుడు ఎలా మాట మారుస్తారో ఆయనకే తెలియదు. రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది.

జగన్‌ సింగిల్‌గానే వస్తున్నారు
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హోదా కోసం చేయని పోరాటం లేదు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అఖరికి వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చెయించారు. చంద్రబాబు ఇవాళ యూటర్న్‌ తీసుకొని హోదా అంటున్నాడు అంటే దానికి కారణం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాదా? కానీ చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పరు. నిజాలు మాట్లాడే దమ్ములేదు.  చంద్రబాబు నెత్తి మీద శాపం ఉందట. ఏ రోజు అయితే చంద్రబాబు నిజాలు మాట్లాడుతాడో ఆ రోజు తల వేయ్యి ముక్కలు అవుతాయట. అందుకే చంద్రబాబు నిజం మాట్లాడరు. పొత్తులు పెట్టుకున్నది చంద్రబాబు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్‌ గానే వస్తుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి సింగింల్‌గానే బంపర్‌ మెజారిటితో గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహం సింగిల్‌ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌, జనసేనను, కేజ్రీవాల్‌ను, మమతా, ఫరూక్‌ అబ్దుల్లా దేవగౌడ.. ఇలా ఎవరు తోడు వస్తే వాళ్లను గుంపుగా వేసుకొని తిరుగుతున్నారు నక్క చంద్రబాబు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు.

ఐదేళ్లలో రాష్ట్రాన్ని పాతాళంలోకి 
చంద్రబాబు హయంలో చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన అజయ్‌ కలాం చెబుతున్నారు.. 40 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో ఈ ఐదేళ్లలో చంద్రబాబు అంత అవినీతి చేశారట. ఏమైంది ఆ డబ్బంతా? తండ్రి కొడుకులు కలిసి మింగేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టేసి ఇప్పుడు మీ భవిష్యత్‌ - నా బాధ్యత’  అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్‌ భవిష్యత్‌ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? ఈ ఐదేళ్లు లోకేష్‌ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్‌ నా బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలట. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తే మీ భవిష్యత్‌ నాశనం చేస్తారు. జాగ్రత్త.. ఈ నారాసుర రాక్షసులను నమ్మి మోసపోకండి.

రాజేశ్వరరావు, అనురాధలను  భారీ మెజారిటీతో గెలిపించండి
ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు.  గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. రాజోలు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వరరావు, అమలాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి అనురాధను భారీ మెజారీటీతో గెలిపించండి.మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement