చిన్నారి కళ్లెదుటే తండ్రి దుర్మణం | Road | Sakshi
Sakshi News home page

చిన్నారి కళ్లెదుటే తండ్రి దుర్మణం

Published Tue, Jan 24 2017 11:49 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

Road

రాజోలు :
మోటార్‌సైకిల్‌ అదుపుతప్పిన ప్రమాదంలో రాజోలుకు చెందిన గెడ్డం బాలాజీబాబు(36) మంగళవారం మృతి చెందాడు. అతని కుమారుడు అభిషేక్‌బాబుకు స్వల్పగాయాలయ్యాయి. రాజోలు పోలీస్‌క్వార్టర్స్‌ సమీపంలో హోటల్‌ నిర్వహించుకునే బాలాజీబాబు తన ఆరేళ్లు అభిషేక్‌బాబుతో కలసి మోటార్‌సైకిల్‌పై సొంత ఊరు పాశర్లపూడికి బయలుదేరారు. తమతో పాటు ప్లాస్టిక్‌ టేబుల్‌ విడిభాగాలుగా చేసి తీసుకువెళ్తున్నారు. టేబుల్‌ పైభాగాన్ని మోటార్‌సైకిల్‌ హ్యాండిల్‌పై పెట్టుకుని బాలాజీబాబు నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో మోటార్‌సైకిల్‌ వేగానికి ఎదురు గాలి తోడుకావడంతో టేబుల్‌పై భాగం ఒక్కసారిగా బాలాజీబాబు ముఖం మీదకు ఎగిరింది. దీంతో ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో మోటార్‌సైకిల్‌ అదుపు తప్పి పాంచాల రేవును వేగంగా ఢీ కొట్టింది. బాలాజీబాబు ఎగిరి కొండాలమ్మ ఆలయం గోడపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. వెనుక కూర్చున్న కుమారుడు అభిషేక్‌బాబుకు స్వల్పగాయాలయ్యాయి. తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు 108 అంబులె¯Œ్సకు సమాచారం ఇచ్చారు. అంబులె¯Œ్స వచ్చే లోగా బాలాజీ బాబు కన్నుమూశాడు. కుమారుడిని స్థానికులు మోటర్‌సైకిల్‌పై రాజోలు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలాజీబాబుకు భార్య, కుమారుడు, ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నారు. చిన్నాన్న గెడ్డం శాంతమూర్తి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement