men dead
-
ఇనుపరాడ్డు గుచ్చుకుని..
జిల్లాలోని వేర్వేరు చోట్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. బనగానపల్లె మండలం పలుకూరులో విద్యుదాఘాతంతో ఒకరు, ఆదోని మండలం బైచిగేరి సమీపంలోని రాజానగర్ వద్ద లారీ ఢీకొని మరొకరు, పాములపాడు మండలం బానకచెర్ల వద్ద బైక్ అదుపు తప్పి ఇంకొకరు మృతి చెందారు. అలాగే జూపాడుబంగ్లాలో నీటిలో పడిన గొర్రెను రక్షించేందుకు వెళ్లి ఓ యువకుడు, కర్నూలు నగర శివారులో భారీయంత్రం మధ్య ఇరుక్కుని ఓ యువకుడు దుర్మరణం చెందారు. కల్లూరు : నగర శివారు భారత్ గ్యాస్‌కు ఎదురుగా ఉన్న జితేష్ ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు వివరాల మేరకు..లక్ష్మీపురం గ్రామానికి చెందిన సీతన్న, సోమేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు బోయ మండ్ల యల్లప్ప (22) ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం బాటిల్స్ మూతలు తయారుచేసే యంత్రం చెడిపోయింది. ఆ యంత్రానికి మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా యంత్రాన్ని బయటకు తరలిస్తుండగా ఎల్లప్ప ఉన్న వైపు యంత్రం ఒరిగిపోయి ముందుకు కదలింది. ఈక్రమంలో ఎల్లప్ప గోడకు యంత్రానికి మధ్య ఇరుక్కుపోయాడు. యంత్రానికి ఉన్న పొడవైన ఇనుప రాడ్ అతడి ఛాతిలోకి దిగింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతిచెందాడు. తోటి కార్మికులు వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, ఉలిందకొండ పోలీసులకు సమాచారం అందించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో.. ఆదోని టౌన్: ఆదోని మండలం బైచిగేరి సమీపంలోని రాజానగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ మేనేజర్ గోపీకృష్ణ(42) దుర్మరణం పాలయ్యాడు. తాలూకా ఎస్ఐ సునీల్‌కుమార్ వివరాల మేరకు.. పట్టణంలోని ఎల్‌ఐజీలో నివాసముంటున్న హెడీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ మేనేజర్ పని నిమిత్తం ఎమ్మిగనూరుకు బైక్‌పై బయలుదేరాడు. రాజానగర్ క్యాంప్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డు పక్కన పడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య అంజనా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గోపికృష్ణ భార్య, తల్లి, బంధువులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో.. బనగానపల్లెరూరల్ : పలుకూరులో విద్యుదాఘాతంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. అవుకు గ్రామానికి చెందిన ఎం.పాండురంగ(44)కు పలుకూరుకు చెందిన దస్తగిరమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. దస్తగిరిమ్మ తమ్ముడికి ఈనెల 23, 24 తేదీల్లో వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పాండురంగ భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు. మంగళవారం రాత్రి ఇంట్లో నీటి కోసం వినియోగించే విద్యుత్ మోటర్ ప్లగ్ తీసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. బావమరిది పెళ్లి చేసేందుకు వచ్చిన పాండురంగ ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబం, గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.నందివర్గం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్య దస్తగిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెను కాపాడేందుకు వెళ్లి.. జూపాడుబంగ్లా: నీటిగుంతలో పడిన గొర్రెను కాపాడేందుకు వెళ్లిన ఓ యవకుడు నీటిగుంతలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం జూపాడుబంగ్లాలో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన రహంతుల్లా, మైమున్ని దంపతులకు నలుగురు సంతానం. వారిలో రెండోవాడు షేక్ బషీర్ అహమ్మద్ (22) తండ్రితోపాటు గొర్రెలను మోపేందుకు వెళ్లేవాడు. ఉదయం జైన్ఇరిగేషన్ కంపెనీ పరిసరాల ప్రాంతాల్లోని బీడుపొలాల్లో మేతకోసం గొర్రెలను తీసుకెళ్లారు. దాహంతో ఓ గొర్రె కుంటలోని నీటిని తాగేందుకు వెళ్లి అందులో పడింది. గమనించిన బషీర్ అహమ్మద్ గొర్రెను కాపాడేందుకు కుంటలోకి దిగి నీటిలో మునిగి మృతి చెందాడు. గమనించిన తండ్రి రహంతుల్లా గ్రామస్తులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతుడికి ఆరు మాసాల క్రితం వివాహం కాగా భార్య మూడు నెలలు గర్భంతో ఉన్నట్లు బంధువులు తెలిపారు. కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్న బషీర్ అకాల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బైక్ అదుపు తప్పి.. పాములపాడు: మండలంలోని బానకచెర్ల– వేంపెంట మధ్య బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం, చాపలమడుగు గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్వర్లు(28) బావకు పక్షవాతం రావడంతో పొలం పనుల్లో సాయం చేసేందుకు రెండు నెలల క్రితం బానకచెర్ల వచ్చాడు. ఇటీవల పంట తొలగించి బానకచెర్ల– వేంపెంట మధ్య వీబీఆర్ కాలువపై మొక్కజొన్న ధాన్యం ఆరబోశారు. ధాన్యం వద్ద కాపాలా ఉండేందుకు వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి సమీప బంధువైన శ్రీనువాస్ బైక్‌ను తీసుకుని బయలుదేరాడు. కాలువ ర్యాంపు వద్ద మలుపులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్ఐ సుధాకరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి అనే రమణమ్మ అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
చికెన్ తినను అన్నందుకు దాడి
నాగోలు: వైన్‌షాప్‌లో ఏర్పడ్డ చిన్న వివాదం ఓ వ్యక్తిమృతికి దారితీసింది. డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ది వినాయక వైన్ షాపులో ఈ నెల 10న రాత్రి మద్యం తాగడానికి లింగోజిగూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌కు చెందిన అర్వపల్లి వెంకటేశ్వర్లు (45) వెళ్ళాడు. ఇతని పక్కనే మున్సిపల్ కాలనీకి చెందిన గజపాక హరిబాబు, వట్కూరి ఈశ్వర్‌గౌడ్, శ్రీధర్ మద్యం తాగుతున్నారు. తినుబండారాలు లేకుం డా వెంకటేశ్వర్లు మద్యం తాగుతుండగా చికెన్‌తినాలని ఒత్తిడి చేశారు. వెంకటేశ్వ ర్లు వద్దనడంతో వాగ్వాదం జరిగింది. దీంతో వెంకటేశ్వర్లను ఆ ముగ్గురు తోసివేయడంతో క్రిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం ఓమ్ని ఆసుపత్రికి తరలించి అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ ఈ నెల 14న మృతిచెందాడు. వెంకటేశ్వర్లు కొడుకు అర్వపల్లి గణేష్ సాయిరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు హరిబాబు, ఈశ్వర్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
లారీ డ్రైవర్ ఏమరుపాటు...
వ్యాన్ డ్రైవర్‌కు గ్రహపాటు రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి గండేపల్లి : డ్రైవర్ ఏమరపాటు వల్ల జరిగిన ప్రమాదంలో మరో వాహన డ్రైవర్ మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలివి...శుక్రవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ గండేపల్లి, మల్లేపల్లి గ్రామాల మధ్యకు వచ్చేసరికి డ్రైవర్ తన లారీని సడన్‌గా ఆపడంతో వెనకే వస్తున్న హైషర్ వ్యాన్ బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జయి డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు, సిబ్బంది ప్రసాద్, అచ్చిరాజు, ఇ.బి.రావు తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకుతీసి పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో అందుబాటులోకి వచ్చిన 108 అంబులెన్స్‌లోకి క్షతగాత్రుడిని మార్చి తరలించారు. మార్గమధ్యలోనే అతడు మృతి చెందాడు. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వాహనాల తనిఖీ అధికారులు ఉండటంతో హఠాత్తుగా గమనించిన డ్రైవర్ (ప్రమాదానికి కారణమైన లారీ) తన లారీని సడన్‌బ్రేక్ వేసి ఆపడంతో వెనుక వస్తున్న వ్యాన్ లారీని ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
కాకినాడ క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్‌ను చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. జీజీహెచ్ ఔట్‌పోస్ట్ పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం మండపేట మండలం డి. కేశవరం గ్రామానికి చెందిన మన్ని మణిరాజు (45) లారీ డ్రైవర్. అతను ఏప్రిల్ 29న రాజమహేంద్రవరం నుంచి కోకోకోలా డ్రింక్స్ లోడ్‌తో భద్రాచలం వెళుతుండగా బూర్గంపాడు వద్ద వేరే లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరచినట్టు ఔట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు. -
నదీపాయలో మునిగి యువకుడి మృతి
ప్రాణాలతో బయట పడ్డ మరో యువకుడు ∙ మృతుడు తుని వాసి పి.గన్నవరం : మండలంలోని చాకలిపాలెం శివారు కనకాయలంక (పశ్చిమ గోదావరి జిల్లా) కాజ్వే వద్ద గురువారం సాయంత్రం నదీపాయలో స్నానం చేస్తూ ఒక యువకుడు ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మేనమామ ఇంటికి వచ్చిన యువకుడు ఇలా మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన దాసరి ఆంజనేయులు కుటుంబం బుట్టలు, గంపలు అల్లి, వాటిని విక్రయిస్తూ జీవిస్తుంటుంది. మూడు నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక కాజ్వే వద్ద తాత్కాలిక గుడిసె నిర్మించుకుని బుట్టలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంజనేయులు బావ.. తుని పట్టణం కుమ్మరి లోవ ప్రాంతానికి చెందిన వారధి అప్పారావు, తన భార్య ముసలమ్మ, చిన్న కొడుకు అప్పలరాజు (18)తో కలిసి బావమరిదిని చూసేందుకు గురువారం ఉదయం ఇక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో ఆంజనేయులు కుమారుడు జా¯ŒSతో కలిసి అప్పలరాజు పక్కనే ఉన్న నదీ పాయలో స్నానం చేస్తున్నాడు. ఆప్రాంతం లోతుగా ఉందని, లోపలికి వెళ్లొద్దని జా¯ŒS హెచ్చరించినా వినకుండా అప్పలరాజు ముందుకు వెళ్లి నీటమునిగిపోయాడు. అతనిని రక్షించేంచే క్రమంలో జా¯ŒS కూడా మునిగిపోయి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. అప్పలరాజు మృతితో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. అప్పలరాజు తమను విడిచి ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదని తల్లి ముసలమ్మ కన్నీటి పర్యంతమైంది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఇదే ప్రాంతంలో వాడ్రేవుపల్లికి చెందిన ఐదుగురు యువకులు స్నానం చేస్తూ నీట ముగనడంతో స్థానికులు రక్షించినట్టు గ్రామస్తులు వివరించారు. -
చిన్నారి కళ్లెదుటే తండ్రి దుర్మణం
రాజోలు : మోటార్‌సైకిల్ అదుపుతప్పిన ప్రమాదంలో రాజోలుకు చెందిన గెడ్డం బాలాజీబాబు(36) మంగళవారం మృతి చెందాడు. అతని కుమారుడు అభిషేక్‌బాబుకు స్వల్పగాయాలయ్యాయి. రాజోలు పోలీస్క్వార్టర్స్ సమీపంలో హోటల్ నిర్వహించుకునే బాలాజీబాబు తన ఆరేళ్లు అభిషేక్‌బాబుతో కలసి మోటార్‌సైకిల్‌పై సొంత ఊరు పాశర్లపూడికి బయలుదేరారు. తమతో పాటు ప్లాస్టిక్ టేబుల్ విడిభాగాలుగా చేసి తీసుకువెళ్తున్నారు. టేబుల్ పైభాగాన్ని మోటార్‌సైకిల్ హ్యాండిల్‌పై పెట్టుకుని బాలాజీబాబు నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో మోటార్‌సైకిల్ వేగానికి ఎదురు గాలి తోడుకావడంతో టేబుల్‌పై భాగం ఒక్కసారిగా బాలాజీబాబు ముఖం మీదకు ఎగిరింది. దీంతో ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో మోటార్‌సైకిల్ అదుపు తప్పి పాంచాల రేవును వేగంగా ఢీ కొట్టింది. బాలాజీబాబు ఎగిరి కొండాలమ్మ ఆలయం గోడపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. వెనుక కూర్చున్న కుమారుడు అభిషేక్‌బాబుకు స్వల్పగాయాలయ్యాయి. తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు 108 అంబులె¯Œ్సకు సమాచారం ఇచ్చారు. అంబులె¯Œ్స వచ్చే లోగా బాలాజీ బాబు కన్నుమూశాడు. కుమారుడిని స్థానికులు మోటర్‌సైకిల్‌పై రాజోలు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలాజీబాబుకు భార్య, కుమారుడు, ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నారు. చిన్నాన్న గెడ్డం శాంతమూర్తి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మణరావు చెప్పారు. -
లాడ్జిలో యువకుడి ఆత్మహత్య
సామర్లకోట (పెద్దాపురం నియోజకవర్గం) : హైదరాబాద్‌లో తాపీ పనికి వెళ్లిన పెద్దాపురానికి చెందిన ఒక యువకుడు సామర్లకోట లాడ్జీలో శవమై కనపించాడు. పోలీసుల కథనం ప్రకారం పెద్దాపురం పాత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పద్మనాభ కాలనీకి చెందిన నకిన గోవిందు (19) సామర్లకోట రైల్వేస్టేçÙ¯ŒS ఎదురుగా ఉన్న విజయ లాడ్జిలో ఫ్యానుకు టవల్‌తో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మూడు నెలల క్రితం స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లాడన్నారు. అయితే ఈ నెల 14న లాడ్జీలో విశ్రాంతి తీసుకోవడానికి రూమ్ తీసుకున్నాడు. స్థానిక చిరునామా కోసం పెద్దాపురంలోని స్నేహితుడు యాదగరి సాయి గుర్తింపు కార్డుతో రూమ్ తీసుకున్నాడు. అదే రోజు సాయి వెళ్లిపోయినట్టు లాడ్జి గుమాస్తా పెదిరెడ్ల సత్యనారాయణ పోలీసులకు తెలిపారు. శని, ఆదివారాలు వరకూ వారిద్దరూ బయటకు వెళ్లారని లాడ్జి నిర్వాహకులు చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి గోవిందు బయటకు రాలేదు. సోమవారం ఉదయం బాయి తలుపు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు లాడ్జి నిర్వాహకులు సమాచారం అందజేశారు. లాడ్జీలో ఉన్న సమాచారం మేరకు సాయికి, గోవిందు తల్లిదండ్రులకు లాడ్జి గుమస్తా సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మహిళా ఎస్సై లక్షీ్మకాంతం రూము తలుపులను పగలుకొట్టగా గోవింద్ ఫ్యాను టవల్ బిగించి ఉరి పోసుకున్నట్టు గమనించారు. రూములో డైనింగ్ టైబుల్‌పై మద్యం గ్లాసు, తినుబండారాలు ఉన్నాయి. రూములో టీవీ ఆ¯ŒSలో ఉంది. పండుగకు రావాలని కోరితే శవమై కనిపించాడని గోవిందు తల్లి దుర్గ బోరున రోదించింది. కుమారునకు ఎటువంటి అప్పులు లేవని, ఎవరూ శత్రువులు కూడా లేరని, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియడం లేదని రోదిస్తూ తెలియజేసింది. తల్లి దుర్గ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్షీ్మకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీ : స్కూటరిస్టు మృతి
రంగంపేట (అనపర్తి నియోజకవర్గం) : రాళ్ల లోడు లారీ ఢీకొనడంతో సుజికి ఏక్టివాపై వెళుతోన్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడితోపాటు ఏక్టివాపై ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సంఘటన వద్ద ఉన్న, రెండు కోడిపుంజులు, ఏక్టివాకు ఉన్న క్యారీ బ్యాగ్‌పై రక్తపు మరకలు ఉండడంతో వారు కోడిపందేల నుంచి వస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పెద్దాపురం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న సుజికి ఏక్టివాపై వెళుతున్న ముగ్గురిని రాజానగరం వైపు నుంచి పెద్దాపురం వైపు వెళ్లే రాళ్లు లోడు లారీ ఢీకొట్టింది. సోమవారం సాయంత్రం రంగంపేట–వడిశలేరు మధ్య దుర్గమ్మగుడి సమీపంలో ఏడీబీ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో అప్పలస్వామి (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ధవళేశ్వరానికి చెందిన అప్పలస్వామితోపాటు గంట విక్రమ్, దొమ్మ మరిడియ్య పెద్దాపురం వైపు నుంచి ధవళేశ్వరం సుజుకిపై వెళుతున్నారు. విక్రమ్‌కు తీవ్ర గాయం కాగా, మరిడయ్య స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ప్రమాద సంఘటనకు సమీపంలో రెండు కోడిపుంజులను పోలీసులు కనుగొన్నారు. వాటి కాళ్లకు తాడు కట్టి ఉంది. ఒక కోడిపుంజు గాయాలతో కదలలేని పరిస్థితిలో ఉంది. మరో పుంజుకు గాయాలు తగలకపోయినా, కాళ్ల కట్టిన తాడు రాయికి మెలిక పడడంతో కదలకుండా ఉండిపోయింది. క్షతగాత్రులను రాజానగరం జీఎస్‌ఎల్‌కు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు పెట్రోలింగ్ ఏఎస్సై పీడీసీహెచ్ రాజు సహకరించారు. మృతి చెందిన అప్పలస్వామి మృతదేహానికి పంచనామా నిర్వహించి పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎ¯ŒS.సన్యాసి నాయుడు తెలిపారు.చెప్పారు. -
ఈవేళ హాలిడే అని తెలియదా?
ఆస్పత్రికి హాజరుకాని వైద్యుడి మాటలు సకాలంలో వైద్యం అందక వ్యక్తి మృతి చింతూరు : ఏజెన్సీలో సకాలంలో వైద్యసేవలందక పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సేవలందించాల్సిన వైద్యులు అందుబాటులో లేక రోగులతో పాటు కుటుంబ సభ్యులూ నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యుడు లేక సరైన వైద్యం అందక ఓ బడుగుజీవి మరణించిన సంఘటన చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోతుగూడేనికి చెందిన వడ్డి రాజు(40)కు రెండు రోజులుగా ఆయాసం అధికంగా ఉండి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం రాత్రి 108లో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో, స్టాఫ్ నర్సు, 108 సిబ్బంది అతడిని పరిశీలించి వైద్యుడికి ఫో¯ŒS చేశారు. ఆయాసం అధికంగా ఉండడంతో డాక్టర్ సూచన మేరకు రెండు ఇంజెక్షన్లు చేసినట్టు ఆమె తెలిపింది. కొంతసేపటికి రాజు చలనం లేకుండా పడి ఉండడంతో.. ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. డాక్టర్‌కు ఫో¯ŒS చేస్తే, ఈరోజు పబ్లిక్ హాలిడే అని, అందుకే తాను డ్యూటీలో లేనని చెప్పినట్టు వారు తెలిపారు. ఈ విషయమై నర్సును ప్రశ్నించగా, నాడి కొట్టుకోవడం లేదని, వైద్యులు పరీక్షిస్తేనే కానీ ఏమైనదీ తెలియదని చెప్పినట్టు రాజు భార్య శాంతి, కుమార్తె కుసుమ తెలిపారు. దీనిపై మరోసారి వైద్యుడిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన ఫో¯ŒS స్విచాఫ్ వచ్చిందని, అయన వస్తేనే కానీ తానేమీ చెప్పలేనని స్టాఫ్ నర్సు స్పష్టం చేసినట్టు వారు తెలిపారు. నిర్థారించేందుకు రెండు గంటలు అప్పటికే రాజు మరణించినట్టు పరిస్థితులు చెబుతున్నా, నిర్ధారించలేని పరిస్థితి స్టాఫ్ నర్సుది. మరోవైపు అతను చనిపోయాడని తెలుస్తున్నా వైద్యాధికారి వచ్చి పరీక్షిస్తే ప్రాణం ఉండవచ్చేమోనని కుటుంబ సభ్యుల్లో చిన్న ఆశ. ఇలా రెండు గంటలు గడిచినా వైద్యుడి జాడ లేకపోవడంతో చివరకు వారు కూడా ఆశ వదులుకున్నారు. వైద్యుడు లేడని ముందే చెబితే ప్రైవేటు ఆస్పత్రికైనా తీసుకెళ్లేవారమని, పెద్దాస్పత్రికి వస్తే మంచి వైద్యం అందుతుందనుకుంటే ప్రాణమే పోయిందని కుటుంబ సభ్యులు రోదించారు. రాజు మృతిని నిర్థారించేందుకు వైద్యాధికారి తప్పనిసరి కావడంతో మీడియా సిబ్బంది పీఓ చినబాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శేషారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో వారు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంటలో నివసిస్తున్న చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ వైద్యాధికారి కోటేశ్వరరావును హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి పంపారు. ఆయన రాజును పరీక్షించి, మధుమేహం అధికంగా ఉండడంతో మరణించినట్టు నిర్థారించారు. రోగుల ఇబ్బందులు కాగా వైద్యాధికారి మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో లేకపోవడంతో చాలామంది రోగులు ఇబ్బందులు పడ్డారు. చింతూరు మండలం గూడూరుకు చెందిన ఎనిమిదో తరగతి గిరిజన విద్యార్థి మడివి జోగయ్యకు జ్వరం, వాంతులు, విరేచనాలు అవుతుండడంతో 108లో ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు లేకపోవడంతో స్టాఫ్‌నర్సు వైద్యం అందించినట్టు విద్యార్థి తల్లి తెలిపింది. ఇక్కడి వైద్యుడు తెలంగాణలోని భద్రాచలంలో నివసిస్తూ, అక్కడినుంచే రాకపోకలు సాగిస్తున్నట్టు రోగులు ఆరోపించారు. -
ఉసురు తీసిన ఉచ్చు
కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆటోకు విద్యుదాఘాతం వాహనం నుంచి ఎగిరిపడి వ్యక్తి మృతి ఎ.మల్లవరం (రౌతులపూడి) : అడవి పందులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ ఉచ్చు కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని ఎ.మల్లవరం శివారు కొండపాలెం సమీపంలోని పామాయిల్‌తోటలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఎ.మల్లవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాకిరెడ్డి ఎంకినాయుడు తనయుడు నాకిరెడ్డి శ్రీనివాసరావు (బుజ్జి) (38) తన పొలంలోని పట్టుపురుగుల పెంపకానికి నిర్మించ తలపెట్టిన రేకులషెడ్డు కోసం అదేగ్రామానికి చెందిన తన కుటుంబీకుడైన నాకిరెడ్డి శివ ఆటోలో సిమెంట్‌బస్తాలు తీసుకెళ్లాడు. సిమెంటు బస్తాలు తనపొలంలో దింపి వచ్చేటపుడు వెళ్లిన మార్గం బురద, గోతులమయంగావుండటంతో తిరిగి పక్కనేవున్న పామాయిల్ తోటలోంచి ఆటోలో వస్తున్నారు. ఆ తోటలో అడవిపందుల కోసం ఎవరో అమర్చిన విద్యుత్ తీగలకు ఆటో ముందుభాగం తగిలి వాహనానికి విద్యుత్ సరఫరా అయ్యి ఆటో డ్రైవర్ శివ పక్కకు తూలిపడగా, బుజ్జి కూడా ఆటోలోంచి తూలిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అపస్మారక స్థితి నుంచి ఆటో డ్రైవర్ తేరుకుని అనంతరం గ్రామానికి వెళ్లి బుజ్జి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో భార్య నాగమణి, కుమార్తె జ్యోతి, కుమారుడు శివతో పాటు కుటుంభసభ్యులంతా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఆలమూరు : పదహారో నంబరు జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం స్థానిక లాకుల సమీపంలో రాజమహేంద్రవరం–రావులపాలెం రహదారిలో గుర్తు తెలియని మృతదేహం ఉండడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో పాటు రక్తపు మరకలు ఉండటంతో వేకువజామునే గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. మృతుడికి 30 సంవత్సరాలు ఉండవచ్చని, ఎరుపు రంగు టీ షర్టు, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో సమాచారం ఇవ్వాలని కోరారు.ఎస్సై దొరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
సర్కస్ బృందంలో విషాదం వై.కొత్తపల్లి (పి.గన్నవరం) : విద్యుదాఘాతానికి గురై సర్కస్ కళాకారులు మరణించిన ఉదంతమిది. మండలంలోని వై.కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన సర్కస్ బృందం కొన్ని రోజులుగా కోనసీమలో సర్కస్ ప్రదర్శనలు ఇస్తోంది. గురువారం రాత్రి వై.కొత్తపల్లి గ్రామంలో సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. రాత్రివేళ లైటింగ్ కోసం కర్రను పాతి, దానికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఆ బృందంలోని అవేట గోవింద్(18) ఆ కర్రను తొలగిస్తుండగా, దానికున్న తీగ 11 కేవీ విద్యుత్ లైన్‌ను తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై గోవింద్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై పి.వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘సినిమాకి తీసుకువెళ్తా.. లేవరా నాన్నా..’ ‘అన్నం తినిపిస్తా.. సినిమాకు తీసుకువెళ్తా.. లేవరా నాన్నా.. అంటూ కొడుకు మృతదేహం వద్ద గోవింద్ తల్లి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సర్కస్ బృందంలో గోవింద్ ప్రధాన భూమికను పోషిస్తున్నాడు. అతడి మృతితో జీవనాధారం కోల్పోయామని గోవింద్ తండ్రి ప్రసాద్, తల్లి శారద, సోదరుడు యోగి, సోదరి భవానీ విలపించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాజమహేంద్రవరం క్రైం : గుర్తు తెలియని వాహనం ఢీకొని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన కొయ్యా వెంకటరావు(35) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అతడు రాజమహేంద్రవరానికి ఓ పని కోసం వచ్చాడు. వైఎస్సార్ వారధిపై నుంచి కాతేరు సమీపంలో సబ్ వే మీదుగా మోటార్ బైక్‌పై వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరిలో మునిగి యువకుడి మృతి
పుష్కర స్నానానికి వెళ్లి నీట మునిగిన వైనం భద్రత చర్యలు లేవని అధికారులపై విమర్శలు కేదారిలంక (కపిలేశ్వరపురం) : గోదావరి నదిలో కేదారిలంక వద్ద పుష్కర స్నానానికి వెళ్లిన యువకుడు యర్రంశెట్టి సతీష్(19) నీటమునిగి చనిపోయాడు. గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనతో విషాదం అలముకుంది. అధికారులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేదారిలంక గ్రామానికి చెందిన సతీష్, తన ఇద్దరి స్నేహితులతో కలిసి పుష్కర స్నానానికి వెళ్లాడు. తొగరపాయ వద్ద అధికారికంగా పుష్కర ఏర్పాట్లు చేసినప్పటికీ, విశాలంగా ఉండడంతో సతీష్, అతడి స్నేహితులు ఇసుక ర్యాంపు రేవు వద్ద స్నానానికి దిగారు. స్నానం చేస్తుండగా సతీష్ అదుపుతప్పి నదిలో మునిగిపోయాడు. తహసీల్దార్ జి.చిన్నిబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టడంతో, అదే ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. ఎస్సై కె.దుర్గాప్రసాద్, వీఆర్ఓ వెంకటరమణ శవ పంచనామా చేసి, పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొడుకు అర్ధాంతరంగా దూరమయ్యాడంటూ సతీష్ తండ్రి నాగేశ్వరరావు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. చివరి క్షణంలో హడావిడి చర్యల వల్లే.. గ్రామంలో అంత్య పుష్కరాల నిర్వహణ కోసం ఘాట్‌కు అనుమతి ఇవ్వలేదు. చివరలో ఉన్నతాధికారులు రేవులో ఏర్పాట్లు చేయండంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో, గ్రామంలోని సూర్యగుండాల రేవు వద్ద అధికారికంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు అక్కడ కాకుండా, విశాలంగా ఉన్న ఇసుక ర్యాంపు రేవు వద్ద స్నానాలు చేస్తున్నారు. ప్రధాన పుష్కరాల సమయంలో కూడా ఇదే పరిస్థితి తలñ త్తడంతో, అధికారులు రెండు చోట్లా ఏర్పాట్లు చేసి, భద్రత చర్యలు తీసుకున్నారు. అంత్య పుష్కరాలకు మాత్రం ఇసుక ర్యాంపు రేవు వద్ద చర్యలు చేపట్టలేదు. పడవలో గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. దీనిపై తహశీల్దార్ జి.చిన్నిబాబును వివరణ కోరగా, అపాయకర రేవు వద్ద స్నానాలకు దిగవద్దని రెవెన్యూ, పోలీసు సిబ్బంది వారిస్తున్నా, భక్తులు మాట వినకపోవడం వల్ల సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.