చికెన్‌ తినను అన్నందుకు దాడి | Friends Force To Eat Chicken And Death in Controversy | Sakshi
Sakshi News home page

చికెన్‌ తినను అన్నందుకు దాడి

Nov 21 2017 8:52 AM | Updated on Nov 21 2017 8:52 AM

Friends Force To Eat Chicken And Death in Controversy - Sakshi

నాగోలు: వైన్‌షాప్‌లో ఏర్పడ్డ చిన్న వివాదం ఓ వ్యక్తిమృతికి దారితీసింది.  డీసీపీ  వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ది వినాయక వైన్‌ షాపులో ఈ నెల 10న రాత్రి మద్యం తాగడానికి లింగోజిగూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌కు చెందిన అర్వపల్లి వెంకటేశ్వర్లు (45) వెళ్ళాడు. ఇతని పక్కనే మున్సిపల్‌ కాలనీకి చెందిన గజపాక హరిబాబు, వట్కూరి ఈశ్వర్‌గౌడ్, శ్రీధర్‌ మద్యం తాగుతున్నారు. తినుబండారాలు లేకుం డా వెంకటేశ్వర్లు మద్యం తాగుతుండగా చికెన్‌తినాలని ఒత్తిడి చేశారు. వెంకటేశ్వ ర్లు వద్దనడంతో వాగ్వాదం జరిగింది.

దీంతో వెంకటేశ్వర్లను ఆ ముగ్గురు తోసివేయడంతో క్రిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం ఓమ్ని ఆసుపత్రికి తరలించి అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ ఈ నెల 14న మృతిచెందాడు. వెంకటేశ్వర్లు  కొడుకు అర్వపల్లి గణేష్‌ సాయిరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేపట్టి  నిందితులు హరిబాబు, ఈశ్వర్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement