రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
Published Mon, May 1 2017 12:23 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కాకినాడ క్రైం:
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్‌ను చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. జీజీహెచ్ ఔట్‌పోస్ట్ పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం మండపేట మండలం డి. కేశవరం గ్రామానికి చెందిన మన్ని మణిరాజు (45) లారీ డ్రైవర్. అతను ఏప్రిల్ 29న రాజమహేంద్రవరం నుంచి కోకోకోలా డ్రింక్స్ లోడ్‌తో భద్రాచలం వెళుతుండగా బూర్గంపాడు వద్ద వేరే లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరచినట్టు ఔట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement