- ప్రాణాలతో బయట పడ్డ మరో యువకుడు ∙
- మృతుడు తుని వాసి
నదీపాయలో మునిగి యువకుడి మృతి
Published Thu, Apr 6 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
పి.గన్నవరం :
మండలంలోని చాకలిపాలెం శివారు కనకాయలంక (పశ్చిమ గోదావరి జిల్లా) కాజ్‌వే వద్ద గురువారం సాయంత్రం నదీపాయలో స్నానం చేస్తూ ఒక యువకుడు ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మేనమామ ఇంటికి వచ్చిన యువకుడు ఇలా మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన దాసరి ఆంజనేయులు కుటుంబం బుట్టలు, గంపలు అల్లి, వాటిని విక్రయిస్తూ జీవిస్తుంటుంది. మూడు నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే వద్ద తాత్కాలిక గుడిసె నిర్మించుకుని బుట్టలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంజనేయులు బావ.. తుని పట్టణం కుమ్మరి లోవ ప్రాంతానికి చెందిన వారధి అప్పారావు, తన భార్య ముసలమ్మ, చిన్న కొడుకు అప్పలరాజు (18)తో కలిసి బావమరిదిని చూసేందుకు గురువారం ఉదయం ఇక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో ఆంజనేయులు కుమారుడు జా¯ŒSతో కలిసి అప్పలరాజు పక్కనే ఉన్న నదీ పాయలో స్నానం చేస్తున్నాడు. ఆప్రాంతం లోతుగా ఉందని, లోపలికి వెళ్లొద్దని జా¯ŒS హెచ్చరించినా వినకుండా అప్పలరాజు ముందుకు వెళ్లి నీటమునిగిపోయాడు. అతనిని రక్షించేంచే క్రమంలో జా¯ŒS కూడా మునిగిపోయి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. అప్పలరాజు మృతితో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. అప్పలరాజు తమను విడిచి ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదని తల్లి ముసలమ్మ కన్నీటి పర్యంతమైంది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఇదే ప్రాంతంలో వాడ్రేవుపల్లికి చెందిన ఐదుగురు యువకులు స్నానం చేస్తూ నీట ముగనడంతో స్థానికులు రక్షించినట్టు గ్రామస్తులు వివరించారు.
Advertisement