revier
-
అలాంటి వారు థియేటర్ల వద్ద కనిపిస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. టీజర్ విడుదల సమయంలో సినిమాపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్లు విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాయి. తాజాగా సినిమా కూడా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. (ఇదీ చదవండి: Adipurush: ఓం రౌత్, ప్రభాస్‌ను కలిపింది ఎవరు?) జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు అర్ధరాత్రి నుంచే టపాసులుపేల్చుతూ.. డప్పులు వాయిస్తూ హంగామా చేస్తున్నారు . ఉదయం నాలుగు గంటలకే ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ప్రారంభం కావడంతో సినిమా చూసిన అభిమానులు ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే థియేటర్ల వద్ద రివ్యూలు చెప్పే వారికి ప్రభాస్ అభిమానులు ఓ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల ఏ సినిమా విడుదల అయితే ఆ సినిమాకు సంబంధించిన గెటప్‌లు వేసుకొని వచ్చి మరీ రివ్యూలు చెప్పేవారిని చూస్తూనే ఉంటాం. అలాంటి వారి చేష్టలను చూస్తూ ఊరుకోం అని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అవతార్2 సినిమా విడుదల సమయంలో ఆ గెటప్స్ వేసుకొని కొంతమంది హల్ చల్ చేశారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ రివ్యూలు చెప్తూ ఎవరైన హనుమంతుడు, రాముడు గెటప్‌లో వచ్చి.. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్. లైకులు కోసం, కామెంట్స్ కోసం అలాంటి పనులు చేస్తే ఊరుకోమని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. దేవుడి సినిమా కాబట్టి.. ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకండి అంటూ వారు తెలిపారు. (ఇదీ చదవండి: Adipurush: హనుమాన్కు కేటాయించిన సీట్ ఇదే..) -
36 గంటలు గడిచినా.. లభించని సింధూజ ఆచూకీ
సాక్షి, మహబూబ్‌నగర్: శనివారం ఉదయం కలుగొట్ల వాగులో కారు కొట్టుకు పోయిన ఘటనలో గల్లంతయిన సింధూజ రెడ్డి ఆచూకీ 36 గంటలు గడిచిన ఇంకా లభించలేదు. ఏపీలోని కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి కుటుంబం బెంగుళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమోనని భయపడి అడ్డదారిలో వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో కారును జాతీయ రహదారి నుంచి గ్రామాల మీదగా మళ్లించారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదగా కారుని పోనిచ్చారు. జోరు వాన...పైగా చీకట్లో కలుగోట్ల వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా వాగు దాటించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతిలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న శివకుమార్ రెడ్డి, అతడి స్నేహితుడు జిలానీ బాషా ప్రాణాలతో బయటపడ్డారు. శివకుమార్ రెడ్డి భార్య సింధూజ గల్లంతు కావడంతో నిన్నటి నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో డిఎస్పీ యాదగిరి,స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. నిన్న రాత్రి ఏడు గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా సింధూజ ఆచూకీ లభించలేదు. దీంతో మళ్లీ ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇంతవరకు ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
నదీపాయలో మునిగి యువకుడి మృతి
ప్రాణాలతో బయట పడ్డ మరో యువకుడు ∙ మృతుడు తుని వాసి పి.గన్నవరం : మండలంలోని చాకలిపాలెం శివారు కనకాయలంక (పశ్చిమ గోదావరి జిల్లా) కాజ్వే వద్ద గురువారం సాయంత్రం నదీపాయలో స్నానం చేస్తూ ఒక యువకుడు ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మేనమామ ఇంటికి వచ్చిన యువకుడు ఇలా మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన దాసరి ఆంజనేయులు కుటుంబం బుట్టలు, గంపలు అల్లి, వాటిని విక్రయిస్తూ జీవిస్తుంటుంది. మూడు నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక కాజ్వే వద్ద తాత్కాలిక గుడిసె నిర్మించుకుని బుట్టలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంజనేయులు బావ.. తుని పట్టణం కుమ్మరి లోవ ప్రాంతానికి చెందిన వారధి అప్పారావు, తన భార్య ముసలమ్మ, చిన్న కొడుకు అప్పలరాజు (18)తో కలిసి బావమరిదిని చూసేందుకు గురువారం ఉదయం ఇక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో ఆంజనేయులు కుమారుడు జా¯ŒSతో కలిసి అప్పలరాజు పక్కనే ఉన్న నదీ పాయలో స్నానం చేస్తున్నాడు. ఆప్రాంతం లోతుగా ఉందని, లోపలికి వెళ్లొద్దని జా¯ŒS హెచ్చరించినా వినకుండా అప్పలరాజు ముందుకు వెళ్లి నీటమునిగిపోయాడు. అతనిని రక్షించేంచే క్రమంలో జా¯ŒS కూడా మునిగిపోయి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. అప్పలరాజు మృతితో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. అప్పలరాజు తమను విడిచి ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదని తల్లి ముసలమ్మ కన్నీటి పర్యంతమైంది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఇదే ప్రాంతంలో వాడ్రేవుపల్లికి చెందిన ఐదుగురు యువకులు స్నానం చేస్తూ నీట ముగనడంతో స్థానికులు రక్షించినట్టు గ్రామస్తులు వివరించారు.