గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
Published Mon, Oct 24 2016 7:04 PM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM
ఆలమూరు :
పదహారో నంబరు జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం స్థానిక లాకుల సమీపంలో రాజమహేంద్రవరం–రావులపాలెం రహదారిలో గుర్తు తెలియని మృతదేహం ఉండడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో పాటు రక్తపు మరకలు ఉండటంతో వేకువజామునే గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. మృతుడికి 30 సంవత్సరాలు ఉండవచ్చని, ఎరుపు రంగు టీ షర్టు, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో సమాచారం ఇవ్వాలని కోరారు.ఎస్‌సై దొరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement