dash
-
ఆసుపత్రికి చేర్చే దిక్కులేక మృత్యుఒడికి..
బ్రాహ్మణచెరువు (పెనుమంట్ర) : మోటారు సైకిల్‌తో చెట్టును ఢీకొన్న ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యువకుడ్ని ఎవరూ గమనించలేదు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ఆస్పత్రికి చేర్చే దిక్కులేకపోయింది. దీంతో యువకుడు మృత్యుఒడికి చేరాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవుడూరు గ్రామానికి చెందిన తమ్మినీడి గణేష్(30) గురువారం రాత్రి బ్రాహ్మణచెర్వు నుంచి నవుడూరు వెళుతుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న చెట్టును మోటారు సైకిల్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో తీవ్ర గాయాలపాలైన గణేష్‌ను ఎవరూ గమనించకపోవడంతో తెల్లవారేసరికి ఘటనస్థలంలో మృతి చెందాడు. అవివాహితుడైన గణేష్ ఇటీవలనే విదేశాల నుంచి ఇక్కడకు వచ్చాడని అతని బంధువులు తెలిపారు. పెనుమంట్ర ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ఈవ్‌టీజింగ్ చిదిమేసింది
వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. అక్క శ్రీగౌతమి కలెక్టర్ కావాలనే సంకల్పంతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. చెల్లెలు పావని ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. వీళ్లిద్దరూ స్కూటర్‌పై వెళుతుండగా.. మద్యం సేవించిన కొందరు యువకులు కారులో వెంబడించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటమే కాకుండా.. కారుతో ఆ స్కూటర్‌ను ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో శ్రీగౌతమి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాలకొల్లు అర్బన్/నరసాపురం రూరల్ : మద్యం మత్తు, ఈవ్‌టీజింగ్ ఓ యువతిని బలి తీసుకున్నాయి. ఇదే ఘటనలో మృతురాలి చెల్లి తీవ్రంగా గాయపడింది. ఈ దుర్ఘటన పాలకొల్లు–నరసాపురం రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నరసాపురం పట్టణంలోని కోవెల వీధికి చెందిన దంగేటి శ్రీగౌతమి, పావని అక్కాచెల్లెళ్లు. పూలపల్లి సంధ్యామైరైన్స్లో పావని ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి శ్రీగౌతమి, పావని పూలపల్లి నుంచి స్కూటర్‌పై నరసాపురం వెళ్తుండగా, కారు ఢీకొంది. ఈ ఘటనలో శ్రీగౌతమి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. పావని తీవ్రంగా గాయపడింది. నరసాపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈవ్‌టీజింగే కారణం స్కూటర్‌పై వస్తున్న పావని, శ్రీగౌతమిని మద్యం సేవించిన కొందరు యువకులు కారులో వెంబడించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కారు స్కూటర్‌ను ఢీకొంది. ఫలితంగా గౌతమి అక్కడికక్కడే మరణించింది. పావని ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. కొందరు కారులో వెంబడించారని పావని కూడా చెబుతోంది. వైజాగ్ రిజిస్ట్రేషన్‌తో కారు స్కూటర్‌ను ఢీకొన్న కారు విశాఖపట్టణంలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టు పాలకొల్లు రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. సివిల్స్ ప్రిపరేషన్లో శ్రీగౌతమి శ్రీగౌతమి చిన్ననాటి నుంచి బాగా చదివే విద్యార్థిని. నరసాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ చదివిన ఆమె ఎన్సీసీ నేవీ విభాగంలో సీ సర్టిఫికెట్ పొందింది. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌డే పరేడ్‌లోనూ పాల్గొని ప్రశంసలందుకుంది. అదే కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం సివిల్స్‌కి ప్రిపేర్ అవుతోంది. విశాఖపట్నంలో శిక్షణ పొందుతోంది. తండ్రి మరణం నుంచి తేరుకోకుండానే... శ్రీగౌతమి తండ్రి నరసింహరావు వ్యవసాయ పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. ఆ దుఃఖం నుంచి కోలుకోకుండానే శ్రీగౌతమి మరణించడం, పావని ఆస్పత్రి పాలుకావడం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. బంధువులు, స్నేహితులు గౌతమి మృతదేహాన్ని చూసి తీవ్రంగా రోదిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
తాడేపల్లిగూడెం రూరల్ : ప్రత్తిపాడు ఫుడ్స్‌ఫ్యాట్స్ వద్ద కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామానికి చెందిన అడపా రామారావు(58), అతని భార్య వరలక్షి్మ(50) పూళ్లలో ఉన్న బంధువులను పలకరించేందుకు సోమవారం ఉదయం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బంధువులకు చెందిన కారులో స్వగ్రామం ఆరుగొలను వెళ్తుం డగా ఫుడ్స్‌ఫ్యాట్స్ సమీపంలో డ్రైవర్ వెంకటకృష్ణకు ఫిట్స్ రావడంతో బ్రేక్‌కు బదులుగా ఎక్స్‌లేటర్‌ను తొక్కాడు. దీంతో కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అడపా రామారావు, అతని భార్య వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ వెంకటకృష్ణకు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పెంటపాడు ఎస్సై సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువులను పలకరించేందుకు వెళ్లి భార్యభర్తలు మృత్యువాత పడడంతో ఆరుగొలను గ్రామం విషాదంలో మునిగింది. ఘటనాస్థలానికి బంధువులు భారీగా తరలిరావడంతో ఫుడ్స్‌ఫ్యాట్స్ వద్ద తణుకు – ఏలూరు రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. -
పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం: 9 మందికి గాయాలు
ఏలూరు అర్బన్ : ముందు వెళ్తున్న లారీని ఆటో ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నూజివీడు మండలం లైన్‌తండాకు చెందిన కొందరు కూలీలు పనుల కోసం రెండురోజుల కిందట ఏలూరు మండలం చొదిమెళ్ల వచ్చారు. అక్కడ పనులు ముగిసిన అనంతరం వారంతా తిరిగి సొంత ఊరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తొమ్మిది మంది తమ బంధువు వడిత్యా నాగరాజు ఆటోలో బయలుదేరారు. ఆటో దుగ్గిరాల డెంటల్ కాలేజీ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా లారీ వెళ్తుంది. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బాణోతు సంకురమ్మ, వడిత్యా రాధ, వడిత్యా నరసింహులు, బాణోతు చిలకమ్మ, వడిత్యా బుజ్జి, ఆటో డ్రైవర్ వడిత్యా నాగరాజు, వడిత్యా స్వామి , వడిత్యా ప్రసాద్, వడిత్యా శ్రీను గాయపడ్డారు. వీరిలో మహిళ వడిత్యా బుజ్జి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది బాధితులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందించిన వైద్యులు తలకు తీవ్ర గాయమైన బుజ్జిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకువెళ్లాలని బంధువులకు సూచించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఆలమూరు : పదహారో నంబరు జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం స్థానిక లాకుల సమీపంలో రాజమహేంద్రవరం–రావులపాలెం రహదారిలో గుర్తు తెలియని మృతదేహం ఉండడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో పాటు రక్తపు మరకలు ఉండటంతో వేకువజామునే గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. మృతుడికి 30 సంవత్సరాలు ఉండవచ్చని, ఎరుపు రంగు టీ షర్టు, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో సమాచారం ఇవ్వాలని కోరారు.ఎస్సై దొరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న కారు
చెట్టును ఢీకొన్న కారు car dash tree, 8 members injured చెట్టును, ఢీకొన్న, కారు car, dash, tree, 8 members, injured ఎనిమిది మందికి గాయాలు పెనుబల్లి : కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రామచందర్‌రావుబంజర్–లంకాసాగర్ క్రాస్ రోడ్డు మధ్య జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బృందావనం కాలనీకి చెందిన ఎనిమిది మంది కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో రామచందర్‌రావుబంజర్–లంకాసాగర్ క్రాస్ రోడ్డు మధ్యలో ఉన్న ఒంపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, భార్గవ్ రాజేశ్వరరావు, నాగకుమారి, కేశవాణి, గాయత్రి, మనీష, సునీత, మూర్తిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిని స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ఎస్సై పి.నవీన్, ట్రెయినీ ఎస్సై బి.పవన్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ కొండా శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చెట్టును ఢీకొన్న కారు
చెట్టును ఢీకొన్న కారు car dash tree, 8 members injured చెట్టును, ఢీకొన్న, కారు car, dash, tree, 8 members, injured ఎనిమిది మందికి గాయాలు పెనుబల్లి : కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రామచందర్‌రావుబంజర్–లంకాసాగర్ క్రాస్ రోడ్డు మధ్య జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బృందావనం కాలనీకి చెందిన ఎనిమిది మంది కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో రామచందర్‌రావుబంజర్–లంకాసాగర్ క్రాస్ రోడ్డు మధ్యలో ఉన్న ఒంపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, భార్గవ్ రాజేశ్వరరావు, నాగకుమారి, కేశవాణి, గాయత్రి, మనీష, సునీత, మూర్తిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిని స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ఎస్సై పి.నవీన్, ట్రెయినీ ఎస్సై బి.పవన్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ కొండా శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పోలీస్ జీపును ఢీ కొన్న లారీ
పోలీస్ జీపును ఢీ కొన్న లారీ lorry dash police jeep పోలీస్, జీపును, ఢీ కొన్న, లారీ lorry, dash, police, jeep కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు..చేయి తొలగింపు స్వలంగా గాయపడిన ఏఎస్ఐ, హోంగార్డు సత్తుపల్లి :పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్జీపును మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని లారీ ఢీకొన్న సంఘటనలో ఒక కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వలంగా గాయపడ్డారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం..మండల పరిధిలోని తాళ్లమడ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ జీపును గుర్తు తెలియని లారీ సైడ్ నుంచి వేగంగా ఢీకొని వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ ఉమర్ కుడిచేయి నుజ్జునుజ్జు అయ్యి మాంసం ముద్దలు జీపులో పడ్డాయి. దీంతో జీపు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. జీపులో ఉన్న ఏఎస్సై రాజుకు తలకు గాయమైంది. హోంగార్డు కె.అశోక్ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న సీఐ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం ఉమర్‌ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చేయి తొలగించారు. ఏఎస్సై రాజు, హోంగార్డు అశోక్‌కు చికిత్స నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాలకు సమాచారం అందించారు. గాయపడిన ఉమర్ చేయి తొలగించాల్సి రావడంతో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉమర్‌కు వివాద రహితుడిగా మంచిపేరు ఉంది. ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా క్రైం కేసుల్లో చురుగ్గా వ్యవహరించి పలు మార్లు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. -
'పాలబుగ్గలతోనే ఉక్కులా తయారయ్యాడు'
కాన్బెర్రా: మూడేళ్ల బాలుడు అంటే మనకెంతో మురిపం. క్షణమైనా కాలు కిందపెట్టకుండా ఇంట్లో వాళ్లంతా ముద్దు చేస్తుంటారు. అతడికి చిన్న కష్టం కూడా కలగనీయకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నదెబ్బతగిలినా అయ్యో అని కంగారుపడిపోతుంటారు. అక్కడికీ ఇక్కడికీ పరుగులు పెట్టొద్దని అడ్డుకుంటుంటారు. కానీ, ఆస్ట్రేలియాలో డాష్ ఓ మూడేళ్ల బాలుడు చేసిన సాహసం చూస్తే మాత్రం ఔరా అని ఆశ్చర్యపోయి ముక్కున వేలుసుకోవాల్సిందే. ఇక బద్దకస్తులుగా ఉండి.. భారీగా పొట్టలు పెంచుకునేవారైతే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఎందుకంటే ఆ బాలుడు చేసింది మాములు సాహసం కాదు. బాగా తినేసి గంటలకొద్ది జిమ్ముల్లో గడిపినా నేటి యువకులు పొందలేని సిక్స్ ప్యాక్ (ఆరుపలకల దేహం)ను ఈ మూడేళ్ల బుడతడు సాధించాడు. అంతేకాదు, ఏకధాటిగా నాలుగు కిలోమీటర్లు అలవోకగా పరుగెత్తగలడు. కొండలు ఎక్కుతాడు, జంపింగ్‌లు చేస్తాడు. జిమ్ లో డంబెల్స్ ఎత్తుతాడు, బెంచ్ కొడతాడు. అప్ డౌన్స్ చేస్తాడు. ఇన్ని ప్రయోగాలు చేస్తూ పాలబుగ్గల వయసులోనే తన లేత శరీరాన్ని ఉక్కుకవచంలా తయారు చేశాడు. ఇంతచేసినా తన కుమారుడు మాత్రం అందరు పిల్లల్లాగానే మళ్లీ తన కొంగుపట్టుకొని ఐస్ క్రీం అడుగుతాడని ఆ చిట్టిబుడతడి తల్లి మురిసిపోతుంది. వాడి కసరత్తు ఆటలను చూసి ముచ్చటపడిన తల్లి ఉర్సులా ఇటీవలనే హ్యాంగింగ్ రాడ్, రింగ్స్ గిఫ్ట్‌గా తీసుకొచ్చింది. పిల్లాడి పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా తెరిచింది. అతడి కసరత్తు ఫొటోలను ఎప్పటికప్పుడు ఆ ఖాతాలో పోస్ట్ చేస్తోంది. ఆ ఫొటోలకు లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. వాడు తనకు కృత్రిమ గర్భం ద్వారా పుట్టాడని, ప్రిమెచ్యూర్‌గా పుట్టడం వల్ల చాలా బలహీనంగా ఉండేవాడని, 11 నెలలు వచ్చినాగానీ సరిగ్గా నడిచేవాడు కాదని తల్లి ఉర్సులా తెలిపారు. పిల్లాడిని ఆరోగ్యవంతుడిని చేయాలనే ఉద్దేశంతో రెండో ఏట నుంచి ఆ బాలుడిని తీసుకొని తాను గార్డెన్లో పరుగెత్తేదాన్నని ఆమె వివరించారు. అలా అలవాటైన డాష్ క్షణం కూడా ఆగకుండా ఏకధాటిగా నాలుగు మైళ్లు పరుగెత్తుతాడని, నాలుగైదు గంటలపాటు అలుపెరగకుండా కసరత్తు చేస్తాడని చెప్పారు. అందరి పిల్లాడిలా వాడికి కూడా ఓ చెడలవాటు ఉందని, ఎప్పుడూ చాక్లెట్లు తింటుంటాడని, అందుకోసం ఏ మాత్రం వీలు చిక్కినా చక్కాపోయి ఫ్రిజ్‌లో మొహం పెడతాడని ఉర్సులా తెలిపారు. డాష్ ను జిమ్ములో చేర్చాలని, ఒలంపిక్ క్రీడల లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని చుట్టుపక్కల వాళ్లు తనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని, తానుమాత్రం ఇప్పటిలా ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్‌లో వాడెమవతాడో తనకు తెలియదని, అది వాడి ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుందని ఉర్సులా మీడియాతో వ్యాఖ్యానించారు. -
విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన లారీ
విజయనగరం (తెర్లాం): విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఓ లారీ రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ లారీ స్తంభాన్ని ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా కరెంటు పోయింది. రాత్రి నుంచి కరెంటు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాగా శనివారం ఉదయం తెర్లాంలోని పెరుమాళ్ల జంక్షన్ వద్ద కామేశ్వరావు అనే ఏడో తరగతి విద్యార్థి ఓ లారీ కింద పడి చనిపోయాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో డ్రైవర్‌ను పరామర్శిద్దామని మరో లారీలో కొంతమంది వెళ్లారు. పరామర్శించడానికి వెళ్లిన లారీ డ్రైవరే కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి మరో యాక్సిడెంట్ చేశాడు.