చెట్టును ఢీకొన్న కారు | car dash tree, 8 members injured | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు

Published Wed, Jul 20 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

గాయాలపాలైన ప్రయాణికులు

గాయాలపాలైన ప్రయాణికులు

చెట్టును ఢీకొన్న కారు
car dash tree, 8 members injured

చెట్టును, ఢీకొన్న, కారు
car, dash, tree, 8 members, injured

  • ఎనిమిది మందికి గాయాలు


పెనుబల్లి : కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రామచందర్‌రావుబంజర్‌–లంకాసాగర్‌ క్రాస్‌ రోడ్డు మధ్య జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బృందావనం కాలనీకి చెందిన ఎనిమిది మంది కారులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో రామచందర్‌రావుబంజర్‌–లంకాసాగర్‌ క్రాస్‌ రోడ్డు మధ్యలో ఉన్న ఒంపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, భార్గవ్‌ రాజేశ్వరరావు, నాగకుమారి, కేశవాణి, గాయత్రి, మనీష, సునీత, మూర్తిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిని స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ఎస్సై పి.నవీన్, ట్రెయినీ ఎస్సై బి.పవన్‌కుమార్, హెడ్‌ కానిస్టేబుల్‌ కొండా శ్రీనివాస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement