విజయనగరం (తెర్లాం): విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఓ లారీ రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ లారీ స్తంభాన్ని ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా కరెంటు పోయింది.
రాత్రి నుంచి కరెంటు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాగా శనివారం ఉదయం తెర్లాంలోని పెరుమాళ్ల జంక్షన్ వద్ద కామేశ్వరావు అనే ఏడో తరగతి విద్యార్థి ఓ లారీ కింద పడి చనిపోయాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో డ్రైవర్‌ను పరామర్శిద్దామని మరో లారీలో కొంతమంది వెళ్లారు. పరామర్శించడానికి వెళ్లిన లారీ డ్రైవరే కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి మరో యాక్సిడెంట్ చేశాడు.
విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన లారీ
Published Sun, Aug 2 2015 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement
Advertisement