- కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి
- ఆటోకు విద్యుదాఘాతం
- వాహనం నుంచి ఎగిరిపడి వ్యక్తి మృతి
ఉసురు తీసిన ఉచ్చు
Published Fri, Dec 16 2016 11:55 PM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM
ఎ.మల్లవరం (రౌతులపూడి) :
అడవి పందులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ ఉచ్చు కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని ఎ.మల్లవరం శివారు కొండపాలెం సమీపంలోని పామాయిల్‌తోటలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఎ.మల్లవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాకిరెడ్డి ఎంకినాయుడు తనయుడు నాకిరెడ్డి శ్రీనివాసరావు (బుజ్జి) (38) తన పొలంలోని పట్టుపురుగుల పెంపకానికి నిర్మించ తలపెట్టిన రేకులషెడ్డు కోసం అదేగ్రామానికి చెందిన తన కుటుంబీకుడైన నాకిరెడ్డి శివ ఆటోలో సిమెంట్‌బస్తాలు తీసుకెళ్లాడు. సిమెంటు బస్తాలు తనపొలంలో దింపి వచ్చేటపుడు వెళ్లిన మార్గం బురద, గోతులమయంగావుండటంతో తిరిగి పక్కనేవున్న పామాయిల్ తోటలోంచి ఆటోలో వస్తున్నారు. ఆ తోటలో అడవిపందుల కోసం ఎవరో అమర్చిన విద్యుత్ తీగలకు ఆటో ముందుభాగం తగిలి వాహనానికి విద్యుత్ సరఫరా అయ్యి ఆటో డ్రైవర్ శివ పక్కకు తూలిపడగా, బుజ్జి కూడా ఆటోలోంచి తూలిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అపస్మారక స్థితి నుంచి ఆటో డ్రైవర్ తేరుకుని అనంతరం గ్రామానికి వెళ్లి బుజ్జి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో భార్య నాగమణి, కుమార్తె జ్యోతి, కుమారుడు శివతో పాటు కుటుంభసభ్యులంతా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Advertisement