విజయం ఖాయం | Gaddam Gang To Release On 6th February | Sakshi
Sakshi News home page

విజయం ఖాయం

Published Sun, Jan 25 2015 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

విజయం ఖాయం

విజయం ఖాయం

వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా ఉన్నా.. ఏదో తెలియని వెలితి. దానికి కారణం ఈ మధ్యకాలంలో నా కెరీర్ ఆశాజనకంగా లేకపోవడమే. అయితే, ఈ చిత్రంతో నా కెరీర్ మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని రాజశేఖర్ అన్నారు. తమిళ చిత్రం ‘సూదు కవ్వమ్’ తెలుగు రీమేక్ ‘గడ్డం గ్యాంగ్’లో నటించారాయన. ఈ చిత్రంపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. పి. సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. రాజశేఖర్ మాట్లాడుతూ - ‘‘‘సూదు కవ్వమ్’ని చూడగానే తెలుగులోకి రీమేక్ చేయాలనుకున్నా. వినూత్న కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. సంగీత దర్శకుడు అచ్చు మంచి పాటలు ఇచ్చారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’  అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement