గడ్డం దాస్ ఏం చేస్తాడు? | What does the gaddam das is doing ? | Sakshi
Sakshi News home page

గడ్డం దాస్ ఏం చేస్తాడు?

Published Mon, May 12 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

గడ్డం దాస్ ఏం చేస్తాడు?

గడ్డం దాస్ ఏం చేస్తాడు?

‘‘తమిళంలో విజయం సాధించిన ‘సూదుకవ్వం’ ఈ చిత్రానికి మాతృక. ఎన్నో చేతులు మారి చివరకు ఈ కథ నా చెంతకొచ్చింది. ఎంతో విభిన్నమైన కథాంశమిది. ఇందులో నా పాత్ర పేరు గడ్డం దాస్. నా పాత్రకు సమానంగా నాలుగు పాత్రలు జర్నీ చేస్తాయి. మిగతా మూడు పాత్రలను నోయెల్, దీపక్, సంగీత దర్శకుడు అచ్చు పోషిస్తున్నారు. మరో పాత్రను ఎంపిక చేయనున్నాం ’’ అని రాజశేఖర్ అన్నారు. ఆయన ప్రధానపాత్రధారిగా సంతోష్.పి. దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గడ్డం గ్యాంగ్’. జీవితా రాజశేఖర్ నిర్మాత.
 
 ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ -‘‘కొంత విరామం తర్వాత మళ్లీ బిజీ అయ్యాను. రెండు నెలల్లో సినిమాను పూర్తి చేసి విడుదల చేసేస్తాం. వచ్చే నెలలో రామ్‌గోపాల్‌వర్మతో నేను చేసిన ‘పట్టపగలు’ విడుదల అవుతుంది. తక్కువ సమయంలో అద్భుతమైన సినిమా తీశారాయన. వీటితో పాటు ‘వందకు వంద’ సినిమా కూడా ఈ ఏడాదే విడుదలవుతుంది’’ అని తెలిపారు. నరేశ్, సీత, గిరిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మహి ఇలింద్రా, కెమెరా: డిమెల్ జేవియర్ ఆడ్వర్డ్స్, సంగీతం: అచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement