jeevitha
-
మరిన్నీ అవకాశాలిస్తా.. గదిలో సర్దుకుపోవాలన్నారు: బుల్లితెర నటి జీవిత
సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే అంతా ఈజీ కాదు. ఎన్నో అవకాశాలు తలుపుతట్టినా కూడా అదృష్టం కలిసి రావాలి. సినీ రంగుల ప్రపంచం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. సినీ ఇండస్ట్రీ కెరీర్ ప్రారంభంలో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం వేధింపులకు గురైనవారే. తాజాగా ఈ జాబితాలో ఓ బుల్లితెర నటి చేరింది. కడైకుట్టి సింగం తమిళ సీరియల్ ఫేమ్ జీవిత తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆమెకు ఎదురైన సంఘటనపై నోరు విప్పింది. ఆ సంఘటన తర్వాత జీవితంపై విరక్తి కలిగిందని చెబుతోంది. (ఇది చదవండి: అలా చేస్తేనే హీరోయిన్ ఛాన్సులిస్తామన్నారు: నటి) ఓ ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ..' ఒక దర్శకుడు తనకు ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేశాడు. అధిక రెమ్యూనరేషన్, మరిన్ని సినిమా అవకాశాల ఇస్తానని చెప్పాడు. అయితే వాటి కోసం సర్దుకు పోవాలని కోరాడు. నాకు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ కొత్త. కెమెరామెన్, నిర్మాత, మేనేజర్‌తో సర్దుకుపోవాలన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు గదికి రావాలి అన్నారు. దీంతో దర్శకుడి మాటలకు షాక్ తిన్నా. ఆ సమయంలో నాకు ఏడుపొచ్చేసింది. దర్శకుడి మాటలకు అవమానంగా ఫీలయ్యా. దీంతో అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వచ్చేశా.' అని అన్నారు. ఇటీవలే సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఖుష్బూ కూడా నోరు విప్పారు. తాము కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు. -
మిత్రా శర్మను మెచ్చుకున్న జీవిత, రాజశేఖర్..
Bigg Boss Non Stop Telugu OTT: Mithra Sharma Will Top 5 Contestants: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారనుంది. హౌజ్ కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5లో చేరండంపైనే దృష్టి పెట్టారు. ఇంటి సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో మిత్రా శర్మ ఒకరు. సాధారణంగా కంటెస్టెంట్‌గా చేరిన మిత్రా శర్మ ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తుంది. గత 70 రోజులకుపైగా జరిగిన రియాలిటీ షోలో రకరకాల టాస్కుల్లో పార్టిస్పేట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ప్రత్యర్థుల ఆరోపణలకు సరైనా సమాధానాలు చెబుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లో ఒకరిగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఇంటిలోకి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దీంతో తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించింది మిత్రా శర్మ. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత, రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోనుంది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో మిత్రా శర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ ఆదివారం ఏమవుతుందో వేచి చూడాలి. -
నటుడు ఉత్తేజ్కి సతీ వియోగం.. పరామర్శించిన పలువురు ప్రముఖులు
-
'మా' ఎన్నికలు: చిరు, బాలయ్య సపోర్ట్ ఎవరికి?
తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. మా అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బడా హీరోలు చిరంజీవి, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఎవరికి మద్దతు తెలుపుతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చిరంజీవి మద్దతుతో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తుండగా తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో మంచు విష్ణు అధికారికంగానే పోటీలోకి దిగాడు. అంతేగాక అతడు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను కూడా స్వయంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ మద్దతుతో జీవిత అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ కీలకంగా మారబోతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎలక్షన్స్‌లో ఓట్లు వేయడానికి ప్రభాస్, మహేశ్‌బాబు లాంటి స్టార్స్ వస్తారా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. చదవండి: ‘మా’ అధ్యక్ష బరిలో జీవిత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1721373393.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మేం బాగానే ఉన్నాం
రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకింది. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘జీవితాకి, పిల్లలకి, నాకు ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాం. పిల్లలిద్దరికీ పూర్తిగా తగ్గిపోయింది. నేను, జీవిత ప్రస్తుతం బాగానే ఉన్నాం. త్వరలోనే ఇంటికి వెళ్లనున్నాం’’ అని ట్వీట్ చేశారు రాజశేఖర్. -
అమ్మ దీవెన
ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మీ సమర్పణలో ఎత్తరి మారయ్య, చిన మారయ్య, గురవయ్య నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను జీవితా రాజశేఖర్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమని మాట్లాడుతూ– ‘‘మగదిక్కు లేని కుటుంబంలో ఓ స్త్రీ ఐదుమంది పిల్లలని ఎలా చదివించింది? వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దింది? అనే కథతో వస్తున్న మా సినిమాని సపోర్ట్ చేస్తున్న జీవితగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఆమనిగారి కెరీర్లో మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘మంచి సినిమా నిర్మించాలని నిర్మాతలు రాజీపడలేదు’’ అన్నారు శివ ఏటూరి. -
ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాం!
‘‘ఈ వయసులో మనం చేయలేని యాక్షన్ సీన్స్ చేయగలుగుతున్నామే... అని హ్యాపీ ఫీలయ్యాను. చేయలేకేం కాదు. యాక్షన్ సీన్స్‌ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను. సినిమాలో ప్రస్తావించిన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను’’ అన్నారు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా సి. కల్యాణ్ నిర్మించిన ‘కల్కి’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజశేఖర్‌తో పాటు ఆయన సతీమణి జీవిత చెప్పిన సంగతులు. నటన, లుక్స్, మేనరిజమ్.. ఇలా అన్ని అంశాల్లో ‘కల్కి’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్స్ పరంగా 60–70 శాతం మార్కులే వచ్చాయి. థియేటర్లో 100 పర్సెంట్ కలెక్షన్ లేదు. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాం. ఇలా ఎందుకు జరిగిందని విశ్లేషించుకోవాల్సి ఉంది. మొత్తంగా ‘కల్కి’ నేను అనుకున్న స్పీడ్ అందుకోలేదు. త్వరలో అందుకుంటాను. వదలను. మా సినిమాకు కొన్ని బ్యాడ్ రివ్యూస్ రాశారని తెలిసింది. మంచి సినిమాపై బ్యాడ్ రివ్యూస్ ప్రభావం చూపలేవు. స్క్రీన్‌ప్లే ఇంకా ఫాస్ట్ అండ్ గ్రిప్పింగ్‌గా ఉండి ఉంటే వంద మార్కులు సాధించి ఉండేవారమని నా అభిప్రాయం. సినిమాలో ‘ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి’ అనే డైలాగ్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ చెప్పినప్పుడు బాగా రాశారన్నాను. ఈ విషయం జీవితతో చెబితే... ఈ డైలాగ్ మీదే కదా అని చెప్పింది. నాపై వేసిన కామెడీ డైలాగ్ నాదే అని కూడా తెలియకుండా నటించాను. ఆ తర్వాత ఏవో కామెంట్స్ వినిపించాయి. ఆ సినిమా (ఈ డైలాగ్ ఉన్న సినిమా) చూడలేదు. విలన్ పాత్రలు చేయాలని ఉంది. కానీ రొటీన్‌గా ఉండేవి చేయాలనుకోవడం లేదు. మా ఇద్దరు కూతుర్లు మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకుంటారనే మాటలు వినిపించడం హ్యాపీగా ఉంది. ఓ సందర్భంలో నేను, శివానీ కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. నేను, జీవిత, శివానీ, శివాత్మిక కలిసి భవిష్యత్‌లో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇదే కాదు నా పిల్లలతో ఎన్ని సినిమాలు వచ్చినా చేస్తాను. కొడుకులే చేస్తారు? కూతుళ్లు అంతగా చేయలేరు? అనుకున్న నాకు నా కూతుళ్లు సర్ప్రైజ్ ఇచ్చారు. అంతగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ‘కల్కి 2’ ఉండొచ్చు కానీ ఎప్పుడన్న విషయం గురించి స్పష్టంగా చెప్పలేను. మరోవైపు ప్రవీణ్ సత్తారు ‘గరుడ వేగ 2’ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. జీవిత అవుట్‌లైన్ విన్నారు. అయితే నా నెక్ట్స్ సినిమా ఏంటీ అని ఇంకా అనుకోలేదు. ఇన్వాల్వ్మెంట్ కాదు... కేరింగ్ ‘‘కల్కి’ సినిమా డైరెక్షన్లో జీవిత లీనమయ్యారనే వార్త అక్కడక్కడా వినిపిస్తోంది. దీని గురించి జీవితా రాజశేఖర్‌లు ఈ విధంగా స్పందించారు. జీవిత: ఈ సినిమా బడ్జెట్ దాదాపు 23 కోట్లు అయ్యింది. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసేప్పుడు కరెక్ట్‌గా వస్తుందా? రాదా?.. అంటే యూనిట్లో మేం ఒక 10 మెంబర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా ఉంటాం. ఈ పదిమందికి ముందు నచ్చాలి కదా. రిలీజ్ తరవాత పదికోట్లమందికి నచ్చుతుందా? లేదా అన్నది తర్వాతి విషయం. ప్రశాంత్ వర్మకు ఇది రెండో సినిమా. పెద్ద సినిమా చేస్తున్నాం. మనం షూట్ చేసిన రషెస్ పరిశీలించుకున్నప్పుడు అవసరమైతే టీమ్ అందరితో కలిసి చర్చించుకోవాలి కదా. అలా చేయడం ఇంటర్ఫియరెన్స్ అవుతుందా? లేక ప్రాజెక్ట్‌పై మేం తీసుకునే కేర్ అవుతుందా? రాజశేఖర్: డైరెక్షన్లో కాదు జీవిత డిస్కషన్స్‌లో పాల్గొన్నారు. ఈ కేర్‌ను ఇంటర్ఫియరెన్స్ అంటే బాధగా ఉంటుంది కదా. జీవిత: ఇటీవల ‘డిగ్రీ కాలేజీ’ సినిమా ప్రెస్మీట్లో టీజర్ అసభ్యకరంగా ఉందని నా అభిప్రాయం చెప్పాను. సినిమాలో అవసరమైన చోట రొమాన్స్ అవసరం. నేనూ నటించాను. మా కూతుళ్లూ నటిస్తున్నారు. ఒక కిస్సింగ్ సీనో... ఒక హగ్గింగ్ సీనో కథ డిమాండ్ చేస్తేనే పెట్టాలి. మణిరత్నంగారు ఎంతో రొమాన్స్ చూపిస్తారు. కానీ వల్గర్‌గా అనిపించదు. బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారు, బాపుగారి సినిమాల్లో రొమాన్స్ ఉంటుంది. కానీ చూపించాల్సిన విధానంలోనే ఉంటాయి. ఒక సెన్సార్ మెంబర్‌గా ఆర్సీ (రివైజింగ్ కమిటీ) నా దగ్గరకు వచ్చిన కొన్ని సినిమాలు చూస్తుంటే... ఏడవాలో నవ్వాలో తెలియదు. అదేదో ‘ఏడుచేపల కథ’ అని ఒక సినిమా ఉంది. అందులో అనవసరమైన రొమాన్స్ ఉన్నట్లు ఉంది. ఇలాంటివి వద్దు అని చెబుతున్నాను. వెంటనే జీవితగారు తన పాత సినిమాల్లో చేయలేదా? రేపు ఆమె కుమార్తెలు ఎవర్నీ ముట్టుకోరా? రాజశేఖర్‌గారు ఎవరితోనూ రొమాన్స్ చేయలేదా? అంటే నేనిప్పుడు దాని గురించి మాట్లాడటంలేదు. రొమాన్స్, లవ్ సీన్స్ లేకుండా సినిమాలు తీయలేం. కానీ కావాలని అలాంటివి పెట్టొద్దన్నది నా అభిప్రాయం. ఇక ‘కల్కి’లో 30 శాతం అంశాలు కొందరికి నచ్చలేదు. వాటినే పట్టుకుని రాయొద్దని కోరుకుంటున్నాను. ఎఫ్డీసీ (ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చైర్మన్ పదవి నాకు ఇవ్వబోతున్నారన్న వార్తలు కేవలం పుకార్లే. వైఎస్ జగన్‌గారి కోసం మాకు దొరికిన తక్కువ సమయంలో చేయగలిగిన ప్రచారం చేశాం. ఆయన గెలిచినందుకు హ్యాపీగా ఉంది. ప్రజలకు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు నాకైతే ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్ పోయినట్లు ఉంది. ఇంతకుముందు ఆంధ్ర, తెలంగాణ వేర్వేరు అనే ఫీలింగ్ ఉండేది సైకలాజికల్‌గా. ఇప్పుడు ఇద్దరు సీయంలు (ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్) మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు కనిపిస్తోంది. – జీవిత -
చంద్రబాబు మరో మోసానికి యత్నం: రాజశేఖర్
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత వైఎస్సార్ హయాంలో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వైస్సార్సీపీ నేతలు జీవిత, రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య శ్రీ, 108 లాంటి పథకాలతో ఎంతో మందికి ప్రాణదాత అయ్యారని గుర్తుచేశారు. తణుకులోని లయన్స్ క్లబ్లో శనివారం ముస్లింల ఆత్మీయ సమావేశం వారు పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ కంటే మంచి పథకాలను అమలు చేస్తానంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్కఅవకాశం ఇవ్వాలని వారు కోరారు. చంద్రబాబు నాయుడికి అనుభవం ఉందని సీఎం చేసి అందరూ మోసపోయారని అన్నారు. అమరావతి పేరుతో ముప్పైవేల ఎకరాల పంట భూములను నాశనం చేశారని వారు ఆరోపించారు. అమరావతిని సింగపూర్ చేస్తానని భ్రమపెట్టారని, అక్కడి కంపెనీల దగ్గర కమీషన్లు కొట్టేశారని విమర్శించారు. ప్రజల కోసం బ్రతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్ మాత్రమే అని స్పష్టం చేశారు. మన భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయ్యాలని అభ్యర్థించారు. వేలకోట్ల సంపాదన వదిలేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, చంద్రబాబు దగ్గర బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. పసుపు కుంకుమ డబ్బులతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది ప్రజల డబ్బున్న విషయాన్ని మహిళలంతా గమనించాలని సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. -
మహిళ సంఘం నేత,మీడియా ఛానల్ పై జీవిత ఫిర్యాదు
-
త్వరలో జీవితతో సినిమా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): త్వరలో ఓ కుటుంబ కథా చిత్రం చేస్తామని, అందులో నా సహనటిగా జీవిత నటిస్తారని హీరో డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఇటీవల విడుదలైన గరుడవేగ చిత్రం విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రను చేపట్టింది. ఏలూరులో చిత్రం ప్రదర్శితమవుతున్న అంబికా డీలక్స్ థియేటర్‌ను శుక్రవారం మధ్యాహ్నం సందర్శించిన బృందం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చిత్ర హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత, కుమార్తెలు శివానీ, శివాత్మిక, సహనటుడు చరణ్‌రాజ్ ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ చాలా ఏళ్ల తరువాత తాను నటించిన గరుడవేగ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత, దర్శకురాలు జీవిత మాట్లాడుతూ ప్రేక్షకులను కలవడం సంతోషంగా ఉందన్నారు. యూఎస్‌లో 120 థియేటర్లలో ఇక్కడి కంటే ముందే చిత్రం విడుదలైందని, అక్కడ హిట్ టాక్‌ను సొంతం చేసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ వెంకటేశ్వరరావు, సురేష్ మూవీస్ మేనేజర్ నాగార్జున, టీడీపీ నాయకులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు చిత్ర బృందంతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. -
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామందితో లింకులు: డీసీపీ
హైదరాబాద్ : పాత నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన శ్రీనివాసరావు సినీనటి జీవిత సోదరుడు కాడని టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. అయితే ఫిల్మ్ ఇండ్రస్టీలో చాలామందితో అతడికి లింకులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డీసీపీ లింబారెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ.. శ్రీనివాసరావు చెన్నైలోని జాయ్ స్టోర్ట్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పురుషోత్తం, శ్రీనివాసరావు అనే ఇద్దరిని అరెస్ట్ చేసి, రూ.7 కోట్ల పాతనోట్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బ్యాంకర్లు తమకు బాగా తెలుసునని చెబుతూ.. చాలామంది వ్యక్తుల ద్వారా రద్దు అయిన నోట్లు తీసుకుని మార్పిడి చేసేందుకు నిందితులు యత్నించినట్లు తెలిపారు. చెన్నైకి చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి వద్ద రూ.7 కోట్లను 20 శాతం కమిషన్ మీద మార్పిడి చేస్తామని వారం రోజల క్రితం తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా ఫిలింనగర్‌లోని శ్రీనివాస ప్రొడక్షన్ కార్యాలయంలో గురువారం రూ. 7 కోట్ల విలువైన పాత నోట్లు దొరికిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన తమ్ముడని మీడియాలో వచ్చిన కథనాలను సినీనటి జీవిత ఖండించారు. శ్రీనివాసరావు తన తమ్ముడు కాదని, తన తమ్ముడు మురళీ శ్రీనివాస్ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె పేర్కొన్నారు. -
ముందు కోలీవుడ్‌కే వస్తా!
ముందుగా కోలీవుడ్‌కే వస్తానంటోంది నట దంపతులు రాజశేఖర్, జీవితల వారసురాలు శివాని. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్‌లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పోలికలను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్‌లో పాడుకుంటుండడమే మాకు కాలక్షేపం. కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. దానికి నేను అడిక్ట్ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్‌లో. బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను. ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను. నటుడు ధనుష్ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్‌తో ఏడ్చేశాను. నటుడు విశాల్ అంటే చాలా ఇష్టం. ఇక విజయ్‌సేతుపతి భలే యాక్టర్. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. వైద్య విద్య మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్ అయిన తరువాతే యాక్టర్ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు అని శివాని చెప్పుకొచ్చింది. -
ముందు కోలీవుడ్‌కే వస్తా!
ముందుగా కోలీవుడ్‌కే వస్తానంటోంది రాజశేఖర్- జీవితల వారసురాలు శివానీ. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్‌లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పలుకులను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్‌లో పాటలు పాడటం మాకు కాలక్షేపం. కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. దానికి నేను అడిక్షన్ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్‌లో బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను. ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను. నటుడు ధనుష్ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్‌తో ఏడ్చేశాను. నటుడు విశాల్ అంటే చాలా ఇష్టం.ఆయన చాలా మ్యాన్లీమెన్. ఇక విజయ్ సేతుపతి భలే యాక్టర్. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. ఎంబీబీఎస్ మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్ అయిన తరువాతే యాక్టర్ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు.’ అంటూ శివాని చెప్పిన సంగతులు ఇవీ. -
మరో సినీ వారసురాలు రెడీ!
చెన్నై: సినీ రంగానికి మరో నట వారసురాలు పరిచయం కానుంది. కోలీవుడ్‌లో నటుడిగా పరిచయం అయినా టాలీవుడ్లో రాణిస్తున్నారు సీనియర్ నటుడు రాజశేఖర్. నటి జీవిత, రాజశేఖర్ దంపతుల వారసురాలిగా శివానిని తెరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధమైందన్నది తాజా సమాచారం. రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా శివాని పెద్దమ్మాయి. ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ కార్యక్రమాల్లో చూసిన దర్శక నిర్మాతలు చాలామంది హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినా 'ఇప్పడే కాదు.. అమ్మాయి చదువు పూర్తి కానీయండి' అంటూ బదులిచ్చేవారు ఈ దంపతులు. అయితే తాజాగా రాజశేఖర్, జీవితలు తమ వారసురాలిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల శివానితో ఫొటో సెషన్ చేపించారని.. అంతేకాదు ఆమె తండ్రి, సీనియర్ హీరో రాజశేఖర్ స్వయంగా కథలు వింటున్నారట. అంతా కుదిరితే త్వరలోనే మరో సినీ వారసురాలిని తెరపై చూడవచ్చనని అభిమానులు ఉత్సహంగా ఉన్నారు. కాగా, శివాని ఫస్ట్ మూవీ తెలుగులోనా? లేక తమిళంలోనా? అన్న దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. తల్లిదండ్రుల నట వారసత్వాన్ని శివాని మరో మెట్టు ఎక్కిస్తుందా.. లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
నీటి టబ్బులో ముగిసిన చిన్నారి ‘జీవిత’ం
కూడేరు : కూడేరు శ్రీనివాసరావు కాలనీలో నివాసముంటున్న నెట్టికంటు, మమత దంపతుల కుమార్తె జీవిత(18 నెలలు) నీటి టబ్బులో పడి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తల్లీబిడ్డ ఇద్దరూ కలసి సాయంత్రమే నిద్రపోయారు. మధ్యలో పాపకు మెలకువ రావడంతో బాత్రూం వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న టబ్బులోని నీటిని చూస్తూ ఒక్కసారిగా అందులోకి పడిపోయింది. కాసేపటికి మెలకువ వచ్చిన మమత, బిడ కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లో వెతికింది. చివరకు బాత్రూంలోకి వెళ్లి చూడగా టబ్బులో పడి ఉండడం గమనించి బయటకు తీసి, వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు నిర్ధరించాడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. -
పెదరాయుళ్లు
మన సమస్య మనకు ఎప్పుడూ పెద్దగా అనిపిస్తుంది.. ఇతరుల సమస్య అర్థం చేసుకున్నప్పుడు మన సమస్య చిన్నగా అవుతుంది.. పెద్ద గీత ముందు చిన్న గీత లాగా! పెద్ద పెద్ద కష్టాలను చిన్నబోయేలా చేస్తున్నారు ప్రయోజనాత్మకమైన సృజనాత్మక టెలివిజన్ షోస్ హోస్ట్ చేస్తున్నారు! సుమలత, జీవితలు ఇతరుల సమస్యలు, కష్టాలను అర్థం చేసుకుని తమ కష్టాలుగా భావించి ‘జీవిత’ ‘సుమాలు’గా మారారు. • పెద్ద తెర నుంచి చిన్ని తెరకు ఎలా అడ్జస్ట్ కాగలిగారు? జీవిత: పెద్ద తెరకు ఇవాళ చిన్ని తెర ఏమాత్రం తక్కువ కాదు. గేమ్ షోస్, పర్పస్‌ఫుల్ షోస్ పెరుగుతున్నాయ్. చేసేది ప్రయోజనాత్మక కార్యక్రమం కాబట్టి చిన్ని తెర కోసం ప్రత్యేకంగా అడ్జస్ట్ కావల్సిన అవసరం ఏర్పడలేదు. నటిగా నేను సినిమాలు చేసింది ఎక్కువగా రాజశేఖర్ గారితోనే. ఆ తర్వాత దర్శకురాలిగా-నిర్మాతగా చేశాను. ఇప్పుడు బుల్లితెర ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సుమలత: ప్యాషన్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం రాలేదు. సినిమా, టీవీ దేని ప్రభావం దానిదే. టీవీకే రీచ్ ఎక్కువ. సినిమాలు చూడాలంటే ప్రేక్షకులు థియేటర్‌కి రావాలి. కానీ, టీవీతో మనం ప్రేక్షకుల ఇంట్లోకి వెళ్తాం. అందుకే ఒక కుటుంబ సభ్యుల్లా మన ల్ని చూస్తారు కాబట్టి హ్యాపీగా ఉంది. • టీవీ వాళ్లంటే సినిమా స్టార్స్‌కి చిన్న చూపు ఉంటుందేమో... సుమలత: ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు లేదు. పెద్ద పెద్ద స్టార్స్ టీవీలోకి వచ్చేశారు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ స్మాల్ స్క్రీన్ స్వరూపాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఆయన ముందు మాలాంటి వాళ్లెంత. • ఈ ప్రోగ్రామ్ గురించి మీ భర్త అంబరీష్‌గారు ఏమంటారు? నిన్ను ఇంట్లో మహారాణిలా చూసుకుంటే నువ్వెందుకు అందరి సమస్యలు వింటూ ఇబ్బంది పడతావు అంటారు. కానీ సామాన్య జనాలతో కలవడం, వాళ్ల ప్రాబ్లమ్ వినడం, పరిష్కారాలు చెప్పడం నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలతో తప్ప వాళ్లను కలిసే అవకాశం ఎలా ఉంటుంది? ఆ మాటే అంబరీష్‌గారితో అన్నాను. దాంతో కన్విన్స్ అయ్యారు. ‘బాగా చేస్తున్నావ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. మన చుట్టూ ఉన్న సమాజంలో జీవితాలు ఇలా కూడా ఉన్నాయా అన్నది తెలుస్తుంది. ఒక్కోసారి ఇంత కష్టాలు పడి మనుషులు బతుకుతున్నారా అనిపిస్తుంటుంది. వాళ్ల పెదాలపై చిన్న చిరునవ్వు కలిగిస్తే చాలనిపిస్తుంది. జీవిత: ఒకప్పుడు బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అనే తేడా ఉండేది. ఇప్పుడలాంటిది లేదు. స్మాల్ స్క్రీన్‌కి బిగ్ స్టార్స్ వస్తున్నారు. దానివల్ల చిన్ని తెరకు క్రేజ్ పెరిగింది. చిన్న చూపు కూడా పోయింది. • ఎంటర్టైన్మెంట్ షోస్ ఉండగా సమస్యలను పరిష్కరించే షోని అంగీకరించడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? జీవిత:ఈ కార్యక్రమానికి సోషల్ కాజ్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. జీ తెలుగువాళ్లు ‘బతుకు జట్కా బండి’ రెండోసారి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ షో దర్శకుడు కిశోర్ ‘జీవితగారు చేస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ తర్వాత నన్ను కలిశారు. పదిమందికి ఉపయోగపడే షో అనే ఉద్దేశంతోనే అంగీకరించాను. సుమలత:హాలీవుడ్లో ఓప్రా విన్ఫ్రే చేసే టీవీ షోలు బాగుంటాయి. అలాంటి షో చేయాలనిపించింది. ఆ చాన్స్ దక్కినందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమా లు ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిది. విడిపోయిన కుటుంబాలు కలవడానికి మరిన్ని వేదికలు దొరుకుతాయి. • ఒక మహిళగా మీరు మహిళలకు ఎక్కువగా మద్దతిచ్చే అవకాశం ఉంటుందని కొందరి అభిప్రాయం? సుమలత: జనరల్‌గా ఆడ, మగ మధ్య సమస్య అంటే దానికి కారణం మగవాళ్లే అనే అభిప్రాయం ఉంటుంది. నిజానికి మహిళల వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరికి వచ్చే వాటిలో 80 నుంచి 90 శాతం కేసులు మహిళల గొడవలతోనే ఉంటున్నాయి. ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ల వైపే మాట్లాడతా. ప్రత్యేకంగా మహిళలకు సపోర్ట్ చేయడం అంటూ ఉండదు. • మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో గుర్తుండిపోయిన కేసు ఏది? సుమలత: కర్నూలు నుంచి ఒక కేసు కౌన్సిలింగ్‌కు వచ్చింది. టైలర్ పని చేసుకునే పుట్టు మూగ, చెవిటి వ్యక్తికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి చాలా మంచిది. ఏమీ వినపడని, మాటలు రాని భర్తకి తనే అన్ని సేవలు చేసేది. అతని మూగ భాషను అర్థం చేసుకుంది. సైగలతో మాట్లాడటం నేర్చుకుంది. ఇద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతను టైలర్ పని మానేస్తే... తనే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇలా ఇరవై ఏళ్లు భర్తను కాపాడుకొచ్చింది. కొన్నేళ్ల తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన అంగవైకల్యం వల్ల భార్య మరో వ్యక్తిని ఇష్టపడుతుందేమోనన్న అనుమానం అతనిలో మొదలైంది. భార్యను తిట్టేవాడు, కొట్టేవాడు. అన్నీ సహించిందామె. ఈ కార్యక్రమానికి వచ్చారు. అతను విడాకులు కావాలన్నాడు. ఆమె నాకు కుటుంబమే కావాలంది. ఎందుకమ్మా ఇంకా ఇతన్ని భరిస్తావు? అని అడిగితే... ‘నేను లేకపోతే నా భర్తను ఎవరూ చూసుకోరు. ఆయన్ను నేను మాత్రమే కాపాడగలను’ అంది. ఆ అమ్మాయి మంచితనం, సహనం నా మనసుని క దిలించింది. కౌన్సిలింగ్ తర్వాత అతనిలో మార్పు వచ్చింది. మేం చేయాల్సిన సాయం చేశాం. ఇప్పుడు వాళ్లు కలిసి ఉంటున్నారు. జీవిత: ఓ కేసుని ఎప్పటికీ మర్చిపోలేను. పెళ్లయిన ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు పుట్టాక, తన భర్తని వదిలిపెట్టి వేరే ఎవరితోనే వెళ్లిపోయింది. ‘నా కోసం వద్దు. పిల్లల కోసమైనా వచ్చెయ్. నీ దారిన నువ్వు ఉండు. నీ జోలికి నేను రాను’ అని మా అందరి సాక్షిగా ఆ అమ్మాయి భర్త అన్నాడు. కానీ, ఆ అమ్మాయి మాత్రం పిల్లలు మొహం చూసో, భర్త కోసమో, సమాజం గురించి ఆలోచించో నిర్ణయం తీసుకోలేదు. ఎవరితో వెళ్లిపోయిందో అతనితోనే ఉంటానని చెప్పింది. ఈ అమ్మాయిని ఎవరైతే తీసుకెళ్లాడో అతన్ని మానవతా దృక్పథంతో ఆలోచించమంటే, ‘చచ్చినా.. బతికినా ఆ అమ్మాయితోనే. విడిపోయే ప్రసక్తి లేదు’ అని తెగేసి చెప్పాడు. పిల్లలు కూడా ‘రామ్మా..’ అని బతిమాలారు. కానీ, ఆ తల్లి కనికరించలేదు. కావాలంటే ‘మీరు రండి.. నాతో ఉండండి’ అంది. పిల్లలు మాత్రం ‘నువ్వూ, నాన్నా కలిసి ఉంటేనే మేం ఉంటాం. లేకపోతే నాన్నతోనే ఉంటాం’ అన్నారు. అప్పుడు నేను చెప్పిన తీర్పు ఏంటంటే.. ఆ అమ్మాయి భర్తను పిలిచి, ‘నీకు తగ్గ అమ్మాయిని, నీ పిల్లలను బాగా చూసుకునే అమ్మాయిని చేసుకో. నువ్ కాబట్టి ఆ అమ్మాయిని మళ్లీ తీసుకువెళతానంటున్నావ్. వేరేవాళ్లయితే ఒప్పుకోరు’ అన్నాను. జీవిత: దర్శక-నిర్మాతలు షో ప్రారంభానికి ముందు నా దగ్గర కేసు గురించి పది నిముషాలు వివరిస్తారు. దాంతో ఎవరు ఏంటో ఒక అవగాహన వచ్చేస్తుంది. ఆ తర్వాత షోలోకి వెళతాను. అక్కడ రెండు వర్గాలవాళ్లు చెప్పినవన్నీ వింటాను. మామూలుగా కొన్ని షోస్‌లో డెరైక్టర్ ఎలా చెబితే అలా చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఒక కేస్‌ని డీల్ చేసేటప్పుడు ఆడ, మగ అనేది ఉండదు. న్యాయంవైపే ఉంటాను. • ఇక్కడికొచ్చేవాళ్లు సమస్యలను కాస్త ఎక్కువ చేసి చెప్పే అవకాశం ఉంటుంది కదా? సుమలత: మేం ప్రశ్నించేటప్పుడు పూర్తిగా కాకున్నా 70 శాతం ఎవరు నిజం మాట్లాడుతున్నారు? ఎవరు అతిగా చెబుతున్నారనేది ఒక అంచనాకు వస్తాం. ఈ షో ప్రొడ్యూసర్స్ ఆ జంటలో ఎవరు తప్పు చేశారనేది ముందుగానే కనుక్కుంటారు. ఆ ఫీడ్‌బ్యాక్‌తో ఎవరు అతిగా చెబుతున్నారనేది తెలిసిపోతుంది. జీవిత: ఒకట్రెండు సార్లు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ రాకపోతే.. ఒకటికి నాలుగు సార్లు అడుగుతాను. వాళ్లే కన్ఫ్యూజ్ అయ్యి అసలు విషయం చెప్పేస్తారు. ఏ విషయాన్నయినా అతిగా చెబితే ఇట్టే పట్టేయొచ్చు. 200 శాతం నేను కరెక్ట్‌గా జడ్జ్ చేస్తాను. • ఈ కార్యక్రమంతో మీరెంత సంతృప్తిగా ఉన్నారు? సుమలత: కౌన్సిలింగ్‌కు వచ్చిన చాలామంది.. మూడు నాలుగు నెలల తర్వాత మళ్లీ వస్తారు. ‘మేడమ్ ఇప్పుడు మా కుటుంబం బాగుంది’ అని చెబుతుంటారు. అప్పుడు నాకు దొరికే సంతృప్తి డబ్బుతో రాదు. ఒక కుటుంబాన్ని నిలబెట్టామనే సంతోషం వెల కట్టలేనిది. జీవిత: ఓ పెద్ద యూనివర్శిటీ వీసీ (వైస్ చాన్సలర్) ‘మేడమ్.. మీ షో చాలా బాగుంది. నేనా షోకి మా ఇంట్లో వాళ్లను తీసుకొచ్చే పరిస్థితిలో లేను. విడిగా మీరు టైమ్ ఇస్తే, నా కూతురు, అల్లుణ్ణి తీసుకువస్తాను. మీరు మాట్లాడితే సర్దుకుంటుందని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంతకన్నా సంతృప్తి ఏముంటుంది? • ఇలాంటి షోస్ ఇంకా ఉన్నాయి కదా.. మరి పోటీ? జీవిత: ఎవరు షో ఎంత బాగా సక్సెస్ అయిందనే పోటీ ముఖ్యం కాదు. వచ్చిన వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతున్నామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ షో కన్నా మనం ఇంకా బాగా చేయాలి? అనుకోవడానికి ఇది నటన కాదు... జీవితం. సుమలత: ఇలాంటి షోస్ ఎన్ని ఉన్నా చాలదు. ఎందుకంటే ప్రపంచంలో బోల్డన్ని సమస్యలున్నాయి. ఒకవేళ లేకపోతే వీటి అవసరమే లేదు. ఎవరి షో వాళ్లదే. న్యాయ నిర్ణేతల మధ్య పోలికలు పెడుతున్నారు. ఆవిడ ఇలా చేస్తోంది? ఈవిడ ఇలా చేస్తోంది? అని మాట్లాడు కుంటారు. అది సహజం. మా మధ్య పోటీ లేదు. • మీ భర్త రాజశేఖర్‌గారు మీ ప్రోగ్రామ్ చూస్తుంటారా? ఆయన ప్రోత్సహించడంవల్లే చేస్తున్నాను. నాకూ వ్యక్తిగతంగా ఇష్టమే. షో చూసినప్పుడల్లా ‘నీ పెదరాయుడు తీర్పు ‘బతుకు జట్కా బండి’లో చూపించుకో. నా దగ్గర కాదు’ అని సరదాగా ఆటపట్టిస్తుంటారు. నా కూతుళ్లేమో ‘నువ్వేమైనా చేసుకో మమ్మీ. నువ్ మాత్రం మా బానిసవే’ అని నవ్వుతుంటారు. నేను కూడా ‘యస్.. నేను మీ బానిసనే’ అంటుంటాను. షో ఇంత సక్సెస్ అవు తుందని ఊహించలేదు. ఆ మధ్య ఓ పెళ్లికి వెళితే.. పెద్ద పోలీసాఫీసర్స్ ‘ఏమ్మా.. మా పని నువ్వే చేసేస్తున్నావ్. సమస్యలన్నీ తీర్చేస్తున్నావ్’ అని అభినందించారు. • ఒక్కోసారి సహనం కోల్పోయి తిట్టే స్థాయి వరకూ..? జీవిత: ప్రతి షో గురించి ప్రేక్షకులు, మీడియా మాట్లాడుకుంటారు. ఆ షోలో ఆ నటి కొట్టిందట.. మరో షోలో ఆ నటి బూతులు తిట్టిందట.. అని. జీవిత ఇలా మాట్లాడిందట అని తప్పు వెతికితే.. ఎవరో దగ్గర కాకుండా నేరుగా నా దగ్గరే ఆ మాట అంటే సమాధానం చెబుతా. మాస్, క్లాస్ విషయానికొస్తే.. నేను మాసే. సుమలత: కొన్నిసార్లు కోపం వస్తుంది. కానీ, కోపాన్ని ప్రదర్శించి డ్రామా క్రియేట్ చేయడం నాకిష్టం ఉండదు. అలా చేస్తే ఎక్కువ మంది నా ప్రోగ్రామ్ చూస్తారు. మా లక్ష్యం అది కాదు. వాళ్ల సమస్యను ఎలా పరిష్కరించగలం అని మాత్రమే ఆలోచిస్తాం. ఎవరినైనా తిట్టినా అది ఆపుకోలేని కోపమే గానీ వాళ్లను కించపరచాలని కాదు. - శివ మల్లాల -
బుల్లితెరపై జీవితం
‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అన్నారు పెద్దలు. ఎన్ని కలతలొచ్చినా, ఆలుమగలు అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలంటారు. కానీ, అనుమానాలు, అపార్థాలతో కొంతమంది విడిపోతుంటారు. అలా విడిపోయే భార్యాభర్తలను కలపడానికి ‘జీ తెలుగు’ ‘బతుకు జట్కాబండి’ ద్వారా ప్రయత్నం చేస్తోంది. ఈ కార్యక్రమం జూలై 6న పునః ప్రారంభమైంది. ‘‘నటి, దర్శకురాలు జీవిత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. లాయర్, సైకాలజిస్ట్‌ల సమక్షంలో ఈ వేదికపై సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలున్న దంపతులు మమ్మల్ని సంప్రదించమని కోరుతున్నాం. జీ తెలుగులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది’’ అని జీ తెలుగు చానల్ ప్రతినిధులు తెలిపారు. -
జీవితతో మాట్లాడటానికి ఇష్టపడేవాడ్ని కాదు..
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమనీ.. 'అల్లరి ప్రియుడు' చిత్రంలో అలరించే ఈపాటను మర్చిపోగల వారెవరు? ప్రేమలో మాధుర్యాన్ని సుమనోహరంగా వర్ణించిన ఈ గీతాన్ని జ్ఞాపకాల నుంచి చెరిపేయగల వారెవరు? నిజం.. ప్రేమ అంత మధురభావం. అది అనుభవమైన వారి జీవితం ధన్యం. అల్లరిప్రియుడిగా ఈపాటలో అభినయించిన రాజశేఖర్ కు అది అనుభవమైంది. వేరే సినిమాలో కలిసి నటించిన జీవిత జీవన భాగస్వామిగా మారింది. ఇప్పుడా జంట తోడునీడగా బతుకునావలో పయనం సాగిస్తోంది. విశాఖకు వచ్చిన సందర్భంగా ఆ జంట తమ వలపు ముచ్చట్లను ఇలా 'సిటీప్లస్' తో పంచుకుంది. రాజశేఖర్: తలంబ్రాలు చిత్రంలో జీవిత, నేను కలిసి తొలిసారిగా నటించాం. అందులో నాది నెగెటివ్ రోల్. అయితే వ్యక్తిగతంగా నా తీరు అందుకు పూర్తిగా భిన్నం. పెద్దగా అమ్మాయిలతో మాటాడేవాడిని కాను. అప్పటికే మెడిసిన్ కంప్లీట్ చేసి సినిమాలంటే ఇష్టం కొద్దీ తెరపైకి వచ్చాను. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పేశాను కూడా. యాక్టింగ్ తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. అయితే మొదట్లో మా ఇద్దరి మధ్య సంభాషణ కొద్దిగా ఇగోతోనే మొదలైంది. ఆమె నాకంటే బాగా నటించేది. దాంతో బేసిగ్గానే కాస్త అసూయ ఉండేది. ఆమెతో మాట్లాడటానికి ఆసక్తి చూపేవాడిని కాదు. కానీ క్రమంగా స్నేహం పెరిగింది. ప్రేమ కలిగింది. కానీ అప్పుడు కూడా మా మధ్య ప్రేమ ఉన్నదనే విషయం మాకు తెలియదు. ఆ విషయం తనే నాకు చెప్పింది. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. జీవిత: అతన్ని నాకు తెలియకుండానే ఇష్టపడేదాన్ని. అతను వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రమేం.. నేను ప్రేమించకూడదని ఏమైనా ఉందా అని ప్రశ్నించేటంత ఇష్టం ఉండేది. మామూలుగా ఉండే నేను కావాలనుకున్న దాని గురించి ఎంత వరకైనా వెళ్తానని అలా అర్ధమైంది. నా ఇష్టం అతనికి నచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం పెళ్లితో ముడిపడింది. తనే నా బలం.. రాజశేఖర్: (నవ్వుతూ).. ఆమె నన్ను ప్రేమించింది. నేను దొరికిపోయాను.. ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే ఉంది. ఆ శక్తి ఎంత గొప్పదనిపిస్తుంది. తను నేనంటే ప్రాణం పెడుతుంది. నాకోసం ఎంతో చేస్తుంది. సర్దుకుపోతుంది. నాకు కోపం ఎక్కువ. మగాళ్లో కనిపించే ఇగో నాలో కూడా ఉంది. కొన్ని సార్లు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లాక కూడా సీరియస్‌గా ఉంటా. ఆ క్షణం ఆమె చాలా కామ్‌గా ఉంటుంది. కోపంతో ఏమైనా అన్నా తనే సారీ చెబుతుంది. హీరోగా బిజీ అయిన తర్వాత ఇంటి బాధ్యత మొత్తం జీవిత తీసుకుంది. నన్ను ఓ పిల్లాడిలా చూసుకుంది. నా అవసరాలన్నీ తీరుస్తుంది. ఇలాటి ఇల్లాలు ఉంటే ఇక కావాల్సిందేముంది? అందుకే నా బలం అంతా జీవితనే.. జీవిత: భార్యగా బాధ్యతలు చూసుకోవడంలో తప్పేముంది? భర్త, పిల్లల మంచి చెడ్డలు చూసుకోవడం సంతోషకరమే కదా. ఒత్తిడితో ఇంటికి వచ్చే భర్తకు భార్య వల్ల ఉపశమనం కలగాలి. ప్రేమ ఉంటే ఇగో ఉండకూడదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఇద్దరూ ఒకటే అయితే ఎవరు సారీ చెబితే ఏముంది? ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్లలేక. మా కోసం ఈయన చాలా అవకాశాలు వదిలేసుకున్నారు. నా కోసం, పిల్లల కోసం అంత చేసినపుడు నేను కొంతైనా చేయాలి కదా.. ప్రేమ ఉన్న చోట కోపం కూడా ఉంటుంది. దాన్ని అర్ధం చేసుకుంటే సమస్య ఉండదు. ప్రేమలో నిజాయితీ ముఖ్యం రాజశేఖర్: ఈ జనరేషన్ పిల్లలకు మేము చెప్పాల్సింది ఒకటే. మీ ప్రేమలో నిజాయితీ ఉందోలేదో చూసుకోండి. మగవారిమనే ఇగో పక్కన పెట్టి.. అభిప్రాయభేదాలు ఉంటే వెంటనే వెళ్లి సారీ చెప్పేయండి. ఆడవాళ్లకు క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి కనిపించింది...అందంగా ఉంది. ఇష్టపడ్డాం అనుకుంటే ఆ ప్రేమ ఎంత వరకు నిలబడుతుందో నమ్మకం ఎక్కడిది? జీవిత: ఇప్పటి జనరేషన్లో పిల్లలకు వయస్సుకు మించిన ఆలోచనలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కల్పించిన సౌకర్యాలను, అందించిన అవకాశాలను కొందరు సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. అనవసరపు వ్యామోహాలు, ఆలోచనలకు పోయి తెలియని ఆకర్షణకు లోనవుతున్నారు. దానిని ప్రేమ అనుకుంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఆలోచించాలంటున్నా. ప్రేమో కాదో తేల్చుకున్నాకే నిర్ణయం తీసుకోమంటున్నా. ఇది ముఖ్యంగా ఆడపిల్లలకు చెబుతున్న మాట. -
ప్రతిష్టాత్మకంగా బీజేపీ సభ్యత్వ నమోదు
జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలతో కిషన్‌రెడ్డి సమీక్ష సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో బీజేపీ చేపట్టిన ఆన్లైన్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సూచించారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జిలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఆన్లైన్ సభ్యత్వం, జిల్లాల వారీగా స్పందన, 35 లక్షల నిర్దేశిత లక్ష్యం వంటి అంశాలపై సమీక్షించారు. తెలంగాణలో సభ్యత్వం మందకొడిగా ఉందని అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోందని ఆయన వివరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి, లోపాలను సరిదిద్దుకోవాలని నేతలకు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పార్టీ అగ్రనేతలు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. జీవితకు నామినేటెడ్ పదవిపై పెదవి విరుపు.. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో ఎవరికీ నామినేటెడ్ పదవులు పెద్దగా దక్కడం లేదని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీలో చేరిన నటి జీవితకు నామినెటెడ్ పదవి ఎలా వచ్చిందంటూ కొందరు జిల్లా అధ్యక్షులు కిషన్‌రెడ్డిని నిలదీశారు. అయితే ఆమె నియామకానికి పార్టీ రాష్ట్ర శాఖకు సంబంధం లేదని ఆయన బదులిచ్చారు. జిల్లాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ల జాబితాను జాతీయ నాయకత్వానికి అందిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఈ ఏడాదిలో...ఆరు సినిమాలు
‘‘ఈ ఏడాది ఆరు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇకపై నా మనసుకు నచ్చిన విభిన్న పాత్రలే చేస్తాను’’ అని డాక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘నేను నటించిన ‘గడ్డం గ్యాంగ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో చేసిన ‘పట్టపగలు’ కూడా త్వరలోనే విడుదలవుతుంది. ‘అర్జున్’ సినిమా కూడా సిద్ధంగా ఉంది. నేను కార్పొరేషన్ స్కూలు టీచర్‌గా నటిస్తున్న ‘వందకు వంద’ సినిమా ఇప్పటికి ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ‘గడ్డం గ్యాంగ్’ గురించి రాజశేఖర్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ -‘‘ ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ తర్వాత ఆ స్థాయి హిట్ సినిమాలు నా నుంచి రాలేదు. అందుకే రొటీన్‌గా కాకుండా విభిన్నంగా ఈ సినిమా చేశా. ఈ సినిమాకు అసలు హీరో స్క్రిప్టే. అచ్చు అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ. జీవిత నిద్రాహారాలు పట్టించుకోకుండా ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది. ఇందులో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా. కానీ ఎప్పటిలానే నా పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు’’ అన్నారు. -
సినీనటి జీవితకు నాన్‌బెయిలబుల్ వారెంట్
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీ నటి జీవితకు సిటీ సివిల్ కోర్టు మంగళవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జీవిత ఇచ్చిన రూ.25 లక్షల చెక్ బౌన్స్ అయిందంటూ పరంధామయ్య రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో సివిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇవాళ నాన్‌బెయిబుల్ వారెంట్‌తో జీవిత ఇంటికి వెళ్లారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవటంతో పోలీసులు వెనుదిగిరారు. కాగా మరో చెక్ బౌన్స్ కేసులో జీవితకు ఇటీవలే ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. -
చెక్‌బౌన్సు కేసు.. జీవితకు బెయిల్
-
చెక్‌బౌన్సు కేసు.. జీవితకు బెయిల్
హైదరాబాద్ : చెక్‌బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు బెయిల్ లభించింది. సోమవారం మధ్యాహ్నం జీవిత 25 లక్షల రూపాయల జరిమానాను చెల్లించడంతో ఎర్రమంజిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కోర్టు జీవితకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా విధించింది. తీర్పు వెలువడిన వెంటనే జీవిత కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. అందుకు సామ శేఖర్‌రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు జరిమానా, జైలుశిక్ష విధించింది. -
చెక్‌బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు
-
చెక్‌బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు
చెక్‌బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. రూ. 25 లక్షల జరిమానా కూడా విధించారు. 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. సామ శేఖర్‌రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. (ఇంగ్లీషు కథనం)