రాజశేఖర్, శివాత్మిక, శివానీ, జీవిత
రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకింది. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘జీవితాకి, పిల్లలకి, నాకు ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాం. పిల్లలిద్దరికీ పూర్తిగా తగ్గిపోయింది. నేను, జీవిత ప్రస్తుతం బాగానే ఉన్నాం. త్వరలోనే ఇంటికి వెళ్లనున్నాం’’ అని ట్వీట్ చేశారు రాజశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment