కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్‌ | Hero Rajasekhar Has Recovered From Corona Virus | Sakshi
Sakshi News home page

కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్‌

Nov 10 2020 12:18 AM | Updated on Nov 10 2020 12:18 AM

Hero Rajasekhar Has Recovered From Corona Virus - Sakshi

కరోనా మహమ్మారి బారిన పడిన హీరో రాజశేఖర్‌ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అక్టోబరులో రాజశేఖర్, జీవితలతో పాటు ఆయన కుమార్తెలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తొలుత శివాని, శివాత్మిక కరోనా నుంచి కోలుకోగా ఆ తర్వాత జీవిత కోలుకున్నారు. అయితే రాజశేఖర్‌ మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లారు.

సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు– జీవిత
‘‘రాజశేఖర్‌గారు ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు నేను, మా అమ్మాయిలు కూడా ఆస్పత్రిలోనే ఉంటూ ఆయన్ని చూసుకున్నాం. డాక్టర్‌ కృష్ణగారు, ఇతర డాక్టర్లు, నర్సులు, వార్డు బాయ్స్‌తో పాటు యాజమాన్యం వారు మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. అందుకే రాజశేఖర్‌గారు ఇంత పెద్ద విపత్తు నుంచి బయట పడ్డారు. రాజశేఖర్‌గారు త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’’ అన్నారు జీవిత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement