త్వరలో జీవితతో సినిమా | i am acting with jeevitha says Rajasekhar | Sakshi
Sakshi News home page

త్వరలో జీవితతో సినిమా

Published Sat, Nov 11 2017 6:43 AM | Last Updated on Sat, Nov 11 2017 11:49 AM

i am acting with jeevitha says Rajasekhar - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట):  త్వరలో ఓ కుటుంబ కథా చిత్రం చేస్తామని, అందులో నా సహనటిగా జీవిత నటిస్తారని హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ఇటీవల విడుదలైన గరుడవేగ చిత్రం విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ విజయోత్సవ యాత్రను చేపట్టింది. ఏలూరులో చిత్రం ప్రదర్శితమవుతున్న అంబికా డీలక్స్‌  థియేటర్‌ను శుక్రవారం మధ్యాహ్నం సందర్శించిన బృందం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చిత్ర హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత, కుమార్తెలు శివానీ, శివాత్మిక, సహనటుడు చరణ్‌రాజ్‌ ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు.  రాజశేఖర్‌ మాట్లాడుతూ చాలా ఏళ్ల తరువాత తాను నటించిన గరుడవేగ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత, దర్శకురాలు జీవిత మాట్లాడుతూ ప్రేక్షకులను కలవడం సంతోషంగా ఉందన్నారు. యూఎస్‌లో 120 థియేటర్లలో ఇక్కడి కంటే ముందే చిత్రం విడుదలైందని, అక్కడ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో థియేటర్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు, సురేష్‌ మూవీస్‌ మేనేజర్‌ నాగార్జున, టీడీపీ నాయకులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు చిత్ర బృందంతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement